చర్చ:అసమానత్వం నుంచి అసమానత్వం లోకే
రచయిత గమనించ వలెను. "విమర్శలకు ప్రతి విమర్శలు", "చలం సాహిత్యం ఆధారంగా విమర్శలు" లాంటివి ఈ పుస్తకానికి సంబంధించినవైతే వ్యాసంలో ఉంచవచ్చును. లేదంటే గుడిపాటి వెంకటచలం, రంగనాయకమ్మ వ్యాసాలలో తగిన చోట్ల వ్రాయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:02, 18 డిసెంబర్ 2008 (UTC)
ఈ పుస్తకం చలం గారు చనిపోయిన తరువాత కాలంలో వ్రాయడం జరిగింది. రంగనాయకమ్మ, వరవరరావు, చందు సుబ్బారావు తదితరులు చలం గారి శిష్యులే కానీ వీరి మధ్యే చలం సాహిత్యం విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. 2008 అప్రిల్ లో రంగనాయకమ్మ "వార్త" పత్రికలో చలం సాహిత్యం గురించి మళ్ళీ వ్యాసాలు వ్రాసారు. అందులోని ఒక వ్యాసంలో నీతిలేని వాళ్ళు తమని సమర్థించుకోవడానికి చలం గారి పేరు వాడుకుంటున్నారని వ్రాసారు. దీంతో చలం శిష్యుల మధ్య విభేదాలు మళ్ళీ బయట పడ్డాయి.
మూలాలు
మార్చుయాహూ గ్రూపులు వంటివాటిని మూలాలుగా స్వీకరించలేం. ఇలాంటి వాటిలో ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు వ్రాస్తుంటారు. విశ్వసనీయత చాలా తక్కువ--వైజాసత్య 12:06, 18 డిసెంబర్ 2008 (UTC)