చర్చ:ఆక్సి హైడ్రోజన్ వెల్డింగు
- ఈ వ్యాసంలో C2H6 అనే దానికి "ప్రొపెను" అని ఉన్నది. ఇది ద్విబంధం గల హైడ్రోకార్బన్ కదా! దీనిని "ప్రోపీన్" అని ఉండాలని నా అభిప్రాయం. పాలగిరి గారు సందేహ నివృత్తి చేయగలరు.
- మొదటి పేరాలో "బుటెను" అని ఉన్నది. అది "బ్యూటేన్" కదా! ----K.Venkataramana (talk) 12:15, 12 నవంబర్ 2013 (UTC)
- ఈ పదాలను నేను పెద్దగా వాడిందిలేదు.ఆంగ్లంలోని అక్షరాల కనుగుణ్యంగా వ్రాసాను.1.propane అలాగే 2. Butane..కొన్ని తెలుగు వ్యాసాలలో(పత్రికల లోని) కొన్ని చోట్ల బ్యూటెన్ అని మరికొన్ని బుటెన్ అని వుంది.ఇక్కడ తెలుగులో ఆంగ్ల పదాలను దీర్ఘం తీసి పలుకుతారు కొందరు. కొందరు మృదువుగా పలుకుతారు.ఏదికరెక్టు. ఏది తప్పో చెప్పలేను.నాకు మీ లాగా ఆంగ్లం లో పెద్ద పాండిత్యంలేదు.కొందరు Good morning ను గుడ్ మార్నింగ్ అంటారు,నాలాంటి వాళ్ళం గుడ్ మాణింగ్ అంటాము. వాళ్లకు అది కరెక్టు,మాకిది కరెక్టు. అలాగే ta పదాన్ని ట కు టె కు మధ్యస్తంగా పలుకుతాం,వ్రాయడం టె అని వ్రాస్తాం,మరి ట,టె మధ్యస్తంగా పదం లేదు కాబట్టి. ప.పె లు కుడా అంతే. భారతీయులు మాట్లాడె ఆంగ్ల ఇచ్చారణ మరోరకంగా వుంటుంది. ఇండియన్ ఇంగ్లీసు అని అంటారు. సాధారణంగా అమెరికను ఆంగ్లంలో మనలా ప్రతి పదాన్ని ఒత్తిపలకరు.ఇలా చర్చించుకుంటూ పోతే ప్రతి ఆంగ్లపదం ఉచ్చారణ తెలుగులో వివాదస్పదమే.ఉదా బస్(bus)=బస్సు,.రోడ్ (Road}=రోడ్డు,బుక్(book)=బుక్కు.... నాకు అనవసరంగా విషయాలను గెలకడం ఇష్టం లేదు.అందుకే ఇలాంటి సందేహ నివృత్తికై నేను వ్రాసే వ్యాసంలో ఎదోఒకచోట వీలున్నంత వరకు తెలుగు పదం ప్రక్కన బ్రాకెట్టులో ఆంగ్లపదాన్ని వ్రాస్తుంటాను.మొదట్లో ఎక్కువవ్రాసెవాడిని.మీ వ్యాసాల్లో ఆంగ్లపదాలు ఎక్కువ అన్నారని ఈ మధ్య తగ్గించాను.
- butane బ్యూటెన్, అయ్యినప్పుడు bus బ్యూస్ అవుతుందా? Bus అనెడి బస్ కావునా butane అనేది బటెను అవుతుందా?......మనకుస్కూలు,కొందరికి ఇస్కూలు.మనం ఆయిల్ అంటాం.కేరళ వాళ్ళు ఒయిల్ అంటారు.
- bus =బస్;Bush=బుష్,.......????...అంటె చెప్పదం కష్టం. ఇలా చర్చించికుంటూ పోతే వచ్చిన ఇంగ్లీసు కూడామర్చిపోతాం.
పదుగురాడు మాట పాడియై ధర చెల్లు....ఎక్కువ ఈ పదం పత్రికలల్లో,పుస్తకాలలో వుంటే అదే అనుసరణియం ప్రస్తుతానికి. నేను చర్చ తీసింది వ్యాస శీర్షికను ఏ పక్షం గా మార్చిన విషయం పైన,వ్యాసంలోని ట్రైపింగు తప్పులను,అక్షరదోషాలను,వ్యాకరణ దోషాలను దిద్దుబాటులో వ్యాసకర్తను సంప్రదించవలసిన అవసరంలేదు.
కనుక మీరనుకున్నట్లు మీరనుకున్న పదాలు కరెక్టు అయితే మార్చండి.అందుకే మీరు ప్రొపెను అనే నా వ్యాస శీర్షికను ప్రోపేనుగా మార్చినప్పుడు.దానిమీద నేను స్పందించలేదు. పాలగిరి (చర్చ) 14:27, 12 నవంబర్ 2013 (UTC)
- నాలుగు కార్బనులను కలిగివున్న ఆల్కహాలును బుటైల్ ఆల్కహాల్- బుటనాల్ అనిఆల్కహాలు వ్యాసంలో వున్నది.కావున నాలుగు కార్బనులున్న వాయువును బుటెను అనుటలో తప్పులేదేమో??పాలగిరి (చర్చ) 05:42, 14 నవంబర్ 2013 (UTC)
- Oxygen ను తెలుగులో ఆక్సిజను ఆనే[1]చాలా పత్రికలలో వ్రాస్తున్నారు అందువలన Oxy ని ఆక్సి అని అనటం తప్పుకాదేమో?పాలగిరి (చర్చ) 05:46, 14 నవంబర్ 2013 (UTC)
- పత్రికలలో ఆల్కహాల్ ల గురించి మిథనాల్,ఇథనాల్([2]),([3])అని వున్నందున ఈ ఆల్కహాలులకు మూలమైన వాయువులను మిథేను(methane), ఇథేను( ethane)అని పిలిచే అవకాశం కూడా వుందనుకుంటాను.పాలగిరి (చర్చ) 06:10, 14 నవంబర్ 2013 (UTC)
- ఆంధ్రభారతి నిఘంటువులో Ethane ను తెలుగులో ఎతెన్([4])గా పేర్కొన్నారు.
- కొల్లిన్స్ ఆంగ్ల నిఘంటువులో Butane ను బుటేను గా వుచ్చరించారు.[5]English dictionary.ఇది బ్రీటిషు ఇంగ్లీషు ఉచ్చరణ.
- ఈ ఆంగ్ల నిఘంటువులో propane యొక్క ఉచ్ఛారణ ప్రొపెన్ గా వున్నది{[6]).ఇది అమెరికన్ ఉఛ్ఛారణ.
- ఈ నిఘంటువులో acetylene ను ఎసెటిలిన్ అని వుచ్చరించడం జరిగినది.ఇది బ్రిటను ఇంగ్లీసు.[7]
తెలుగు పదాలు
మార్చు- ఈ క్రింద విధముగా చదువుకున్నాము.
- Butane: బ్యుటేన్
- Propane:ప్రొపేన్
జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:46, 12 నవంబర్ 2013 (UTC)
- Ethane: ఈథేన్
- Methane: మీథేన్
జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:49, 12 నవంబర్ 2013 (UTC)
- Heptane: హెప్టేన్
- Hexane: హెక్సేన్
జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:52, 12 నవంబర్ 2013 (UTC)
- PROPENE : ప్రొపీన్
జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:54, 12 నవంబర్ 2013 (UTC)
- Pentane: పెంటేన్
జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:58, 12 నవంబర్ 2013 (UTC)
అక్షర దోషాలు
మార్చుముఖ్యంగా కర్బన రసాయన శాస్త్రంలో అక్షర దోషాలను నిశితంగా పరిశీలించాలి. ఎందువలనంటే, ప్రోపేన్, ప్రోపీన్, ప్రోపైన్ లలో చిన్న తేడాలున్నప్పటికీ వాటిలో ఎంతో తేడా ఉంటుంది. అందువలననే కర్బన రసాయన శాస్త్రంలోని పదాలను ఖచ్చితంగా వ్రాయవలసి ఉంటుంది. ఆంగ్ల పదాలను బట్టి వాటి ఫొనెటిక్స్ ప్రకారం రసాయన శాస్త్రంలో వాడుక బట్టి పదాలు వ్రాయాలనినా అభిప్రాయం.జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారు సూచించిన పదాలు సరైనవి. నాకు ఆ పదాలతో నిరంతరం పరిచయం ఉండటం వలన చిన్న దోషాలను తెలియ జేస్తున్నాను. అంతవిశ్వాసం ఉండుట చేతనే రచయితను సంప్రదించకుండా వ్యాస శీర్షికను మార్చాను. నేను మార్చిన శీర్షిక కూడా తప్పు కాదుకదా. దానికి అనేక మైన ఋజువులు ఉన్నాయి కదా. ----K.Venkataramana (talk) 15:22, 12 నవంబర్ 2013 (UTC)
- K.Venkataramanaగారు, ధన్యవాదములు. తదుపరి, Propyne అనగా ప్రోపైన్ అని తోటి వాడుకరులు కూడా గమనించ గలరు అని నా మనవి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:27, 12 నవంబర్ 2013 (UTC)
- Oxy అనగా తెలుగులో " ఆక్సీ" అని చదువుకున్నాము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:28, 12 నవంబర్ 2013 (UTC)