చర్చ:ఇల్లాలి ముచ్చట్లు (శీర్షిక)
తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
Untitled
మార్చుఇలాంటి శీర్షికల గురించిన వ్యాసం నాకు గుర్తున్నంత వరకు తెవికీలో ఇదే మొదటిదనుకొంటాను. అభినందనలు. ఇంకా మాలతీ చందూర్ మరియు కె.రామలక్ష్మి గార్ల "ప్రశ్నలు-జవాబులు", గజ్జెల మల్లారెడ్డి "పుణ్యభూమి", డా. సమరం "సెక్స్-సైన్స్", రావూరి "కబుర్లు" - ఇలా చాలా ఉన్నాయి. కాని ఒక విషయం గమనించవలసింది. ఇలా పాతకాలపు శీర్షికల గురించి (అంటే పదేళ్లపై బడినవి. ఇది స్పీడ్ యుగం కదా!) వ్రాయ గలిగేవారు తక్కువ వుంటారు. కనుక ఆరంభించిన రచయితలే మరి కొంత శ్రమ తీసుకొని వ్యాసాలను వీలయినంత విపులీకరించమని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:30, 21 మే 2008 (UTC)
- తప్పకుండా కాసుబాబుగారూ. మీ వ్యాఖ్య చాలా ఆలస్యంగా చూశాను. ప్రస్తుతానికి, నాదగ్గర ఉన్న ఈ వ్యాస సంపుటి వెదుకులాటలో ఉండి రెండ్రోజుల క్రితం విజయం సాధించాను. వ్యాసలన్నీ మరొకసారి చదివి వికీలో విస్తారంగా వ్యాసాలగురించి వ్రాయటానికి ప్రయత్నిస్తాను. బొంబాయిలో జీవనం, మీకు తెలియనిదేమున్నది, కొంత సమయం పట్టవచ్చు.--SIVA 02:42, 2 డిసెంబర్ 2008 (UTC)
- వికీ విజ్ఞాన సర్వస్వం కనుక, ప్రతి శీర్షిక గురించి కాక, కొంత విలువ సంపాయించుకున్న శీర్షికల గురించి వ్రాస్తే బాగుంటుంది లేకపోతే 1990లలో కొన్ని వారపత్రికలు ఎక్కువ ప్రతులు అమ్ముడుపోవటానికి ప్రవేశపెట్టిన ప్రతి చౌకబారు శీర్షిక కూడ(ఉదాహరణలు ఇస్తే అవే గొప్ఫ శీర్షికలనుకునేవారు అభ్యంతర పెట్టవచ్చు)వికీలో చోటు చేసుకునే ప్రమాదం ఉన్నది.--SIVA 02:42, 2 డిసెంబర్ 2008 (UTC)