చర్చ:ఊమెన్

తాజా వ్యాఖ్య: ధన్యవాదములు టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ధన్యవాదములు

మార్చు

నాకు ఊమెన్ కార్టూన్లతో చిన్నతనం నుండి పరిచయం. వీరి గురించి వ్యాసం వ్రాద్దామంటే, పాత ప్రతులు గాని, ఆయన గురించిన వివరాలు గాని నాదగ్గర లేవు. ఈ దశలో, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ సజ్జా జయదేవ్ బాబు గారు తమ దగ్గర ఉన్న వివరాలు, తాను స్వాతి పత్రికలో వ్రాసిన వ్యాసం, ఆయన మిత్రులు, సహ కార్టూనిస్ట్ అయిన సత్యమూర్తిగారినుంచి సంపాయించిన పాత పత్రిక నకళ్ళు (స్కాన్ చేసినవి) పంపి వ్యాసం వ్రాయటానికి ఎంతగానో ప్రొత్సహించారు. వారికి నా ధన్యవాదములు.--S I V A 08:02, 11 జనవరి 2009 (UTC)Reply

అవును. ఎప్పుడో ఊమెన్ కార్టూనులు చూసిన జ్ఞాపకం మాత్రం మిగిలింది నాకు. ఈ వ్యాసం వ్రాసిన శివాకు, మరియు సహకరించిన జయదేవ్ గారికి కృతజ్ఞతలు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 21:36, 11 జనవరి 2009 (UTC)Reply

సభ్యులకు విజ్ఞప్తి

మార్చు

ఊమెన్ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసినవి అనేకం ఉన్నాయి:

  • వారి కుటుంబ సబ్యుల పేర్లు-తల్లి తండ్రులు, భార్య, పిల్లల పేర్లు
  • ఊమెన్ పూర్తి పేరు
  • చిత్రాలు వేయటమేనా లేక ఇతర వృత్తి ఏమయినా చేసేవారా? చర్చిలో ఫాదర్‌గా ఉండేవారని ఎక్కడో కొన్ని దశాబ్దాల క్రితం చదివినట్టు గుర్తు.
  • వారి ఫొటొ
  • వీరి కార్టూన్ల పై ఇతరుల అభిప్రాయాలు
  • అప్పట్లో ఏమైనా వివాద కారణమయినాయా (నాకు తెలిసినంతవరకు కాలేదు. నేను దాదాపు 1965 నుండి వారి మరణం వరకు వారి కార్టూన్ల ను చదుతుండేవాడిని)
  • వీరి కార్టూన్లు ఎమైనా సంకలనంగా విడుదలయ్యాయా?(ఏ భాషలోనైనా సరే)

సభ్యులు పై వివరాలు సేకరించి వ్యాసంలో పొందుపరిస్తే, వ్యాసం పూర్తవుతుందని నా అభిప్రాయమం.--S I V A 08:10, 11 జనవరి 2009 (UTC)Reply

Return to "ఊమెన్" page.