చర్చ:ఎ. ఆర్. రెహమాన్
తాజా వ్యాఖ్య: గార్డెన్ వరేలీ యాడ్ టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
గార్డెన్ వరేలీ యాడ్
మార్చు సహాయం అందించబడింది
ఈ లంకెను చూడండి. https://www.youtube.com/watch?v=0kKPBEH-U30 నాకు బహుశా పదేళ్ళుకూడా లేని సమయం అది. కానీ ఈ యాడ్, దీని నేపథ్య సంగీతం ఎందుకో నా మనసులో చెరగని ముద్ర వేసినది. అది అలా గుర్తు ఉండిపోయినది. ఇదే రాగం, రోజా సినిమాలో నా చెలి రోజావే లో ఉన్నది. ఈ యాడ్ కు కూడా రెహమాన్ యే సంగీతం అందించాడని ఎక్కడో తర్వాత చదివాను. అలాగే https://www.youtube.com/watch?v=ngGyGKSmQfQ లో స్క్రాలింగ్ టైటిల్స్ లో చిట్టచివరన సంగీతాన్నందించింది ఈయనే అని చూడవచ్చు. వీటిని మూలాలుగా వాడవచ్చునా? - శశి (చర్చ) 14:50, 26 అక్టోబరు 2015 (UTC)
- వీడియో ఇంటర్వ్యూలు, రోలింగ్ టైటిళ్ళు యూట్యూబు వీడియోలుగా ఉన్నప్పుడు మూలంగా ఇవ్వవచ్చని నా అవగాహన. --పవన్ సంతోష్ (చర్చ) 13:31, 27 అక్టోబరు 2015 (UTC)
- శశి గారూ నా సమాధానం మీ ప్రశ్నకు సరిపోయినట్టైతే సహాయం కావాలి అన్న మూసను సహాయం చేయబడిందితో మార్చండి. లేదంటే ఇక్కడ మీకు మిగిలిన సందేహం చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 10:19, 11 నవంబర్ 2015 (UTC)
- ఓహ్! సారీ పవన్ బ్రో, ట్యాగ్ చేయకపోయేసరికి అసలు చూసుకోనే లేదు, పైగా సారిక ఆత్మహత్య, పురుష లైంగికత ల పై సంపూర్ణ దృష్టి పెట్టటంతో మరల ఇక్కడికి వచ్చి చూసుకోవాలని స్ఫురించలేదు. గార్డెన్ వరేలీకి అయితే స్క్రోల్స్ లేవు, స్పిరిట్ ఆఫ్ యూనిటీ కాన్సర్ట్స్ కు మాత్రం చివరలో రెహమాన్ పేరు కనిపిస్తోంది. కావున అది చేర్చవచ్చును. గార్డెన్ వరేలీ కే కాక ఇంకా చాలా యాడ్ లకు రెహమాన్ జింగిల్స్ అందించాడన్నది వ్యాసంలో ఎలాగూ ఉన్నది. కానీ వాటన్నింటికీ మూలాలు సంపాదించలేం కాబట్టి, ఇలా చర్చలలో చదువుకొని సంతోషిద్దాం. మూస తొలగిస్తున్నాను. ధన్యవాదాలు. - శశి (చర్చ) 10:26, 11 నవంబర్ 2015 (UTC)
- ఏం ఫర్లేదు. మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు మీరే రకరకాలుగా పరిశోధించినవైతే చక్కగా ఓ వ్యాసం రాసేయండి, మనం సారంగ పత్రికకో, మరిదేనికో పంపిద్దాం. అక్కడ ప్రచురితమైతే ఆ మూలం వ్యాసం అభివృద్ధికి పనికివస్తుంది.11:28, 11 నవంబర్ 2015 Pavan santhosh.s (చర్చ | రచనలు | నిరోధించు)