చర్చ:కంప్యూటర్ చరిత్ర

తాజా వ్యాఖ్య: వ్యాసం విజ్ఞానసర్వస్వ ధోరణిలో లేదు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

ఇందులోని ఉపోద్ఘాతాన్ని కంప్యూటరులో చేర్చాలని విజ్ఞప్తి. ఈ శీర్షిక Computer science కు అనుగుణంగా ఉండాలని నా ఉద్దేశ్యం. ఈ వ్యాసంలో శాస్త్రీయత లోపించిందని నా అభిప్రాయం.దేవా 06:40, 7 నవంబర్ 2007 (UTC)

శాస్త్రీయంగా ఎలా ఉండాలో సూచించండి. లేదూ ప్రస్తుత వ్యాసం కాకుండా మీరు ఒకటి మొదలెట్టండి(ఆంగ్లవ్యాసాల చూచిరాత కాకుండా, నేను ఇంగ్లీషులో చాలాబాగా వీక్.నేనేది రాసినా తెలుగు పుస్తకాల క్రోడీకరణే ) తరువాత దీనిని తుడిచేయవచ్చు. కంప్యూటరు వ్యాసంలో కేవలం కంప్యూటరు గురించి మాత్రమే ఉంటే మంచిదనుకుంటున్నాను. ఇంటర్ నెట్, ప్రింటింగ్ ఆఫ్సన్స్, హార్డ్వేర్, సాప్ట్వేర్, కంప్యూటర్ వ్యాసంలో అవసరం లేదనుకొంటున్నాను. వాటికే వేరు వ్యసాలు మొదలెట్టవచ్చు, మీరు వ్రాయబోయే శాస్త్రెయ కంప్యూటర్ సైన్స్ వ్యాసానికి అనుభంద వ్యాసాలుగా.... మీ అభిప్రాయం తెలుపగలరు..కృతజ్ఞతలు..విశ్వనాధ్. 07:02, 7 నవంబర్ 2007 (UTC)
[1]ను ఒకసారి చూడండి. వికీపీడియాలో వ్రాయబడే వ్యాసాలు ఎన్నో రకాల మనుషులు చదువుతారు. చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు, ఇప్పుడిప్పుడే సాఫ్ట్‌వేర్ రంగంలో అడుగుపెట్టిన వారినుండి, సాఫ్ట్వేర్ రంగంలో దిట్టలు (వాళ్ళకు తెలుగులో చదవాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు), నా లాంటి కంప్యూటర్ రంగంలో లేకపోయినా కంప్యూటర్‌తో పనిచేసేవాళ్ళూ ఇలా ఎందరో చదువుతారు. భాష మారినంత మాత్రాన వివరాలు తగ్గించి ప్రాథమిక విషయాలు పొందుపరచడం, నా దృష్టిలో తెలుగువారిని, తెలుగు భాషను తక్కువ చేసినట్టే. ఇంగ్లీష్‌లో ఉన్నట్టుగానే లేదా ఇంకా మెరుగ్గా తెలుగులో ఉండాలనేదే నా ఆలోచన. ఇప్పటివరకు ఉన్న వికీలలో ఇంగ్లీష్ మాత్రమే అత్యంత వృద్దిలో ఉంది, మరియు నాకు తెలిసిన ఇతర రెండు భాషల్లో ఇంగ్లీష్ ఒకటి కాబట్టి ఆంగ్ల వ్యాసంతో పోల్చాను. నేను ఇంకో వ్యాసాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఏముంది? అయినా నేను వ్రాయలేనులెండి ఎందుకంటే మీకు తెలిసినంతగా నాకు కంప్యూటర్ విజ్ఞానం గురించి తెలవకపోవచ్చు. నేను కంప్యూటర్ రంగానికి సంబంధించిన వాడిని కాను. నాకు శాస్త్రీయత లోపించిందని 'కంప్యూటర్ వివరణ'లో అనిపించింది. అందులో కంప్యూటర్‌ను ఒక ఆట వస్తువు లేదా మనోల్లాసానికి మాత్రమే వాడే పరికరంగా వివరించినట్టు అనిపించింది. చివర్లో ఈ క్రింది వాక్యంలో ఏదో వ్రాయాలి కదా అన్నట్టు ఇతర ఉపయోగాలు వివరించబడ్డాయి.

సినిమాలు చూసే టి.వి. ఇలా ఒకే సాధనం ద్వారా విస్త్రుత ఉపయోగాల సమ్మేళనం కంప్యూటర్. కేవలం ఇవేకాక....ఫ్యాక్టరీలలో యంత్ర నిర్దేశకుడు, కార్యాలయలలో కాగితాల పని, సాటిలైట్ వ్యవస్థలలో నిపుణుడు, రోబోట్‌లను నడిపించే పనిమంతుడు ఇలా చాలా చాలా చేయగల సాధనం కంప్యూటర్.

పై వాక్యంలో కేవలం ఇవేకాక తర్వాత మూడు చుక్కలు పెట్టవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. వాక్యం పూర్తి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నా అభిప్రాయం అడిగారు కనుక చెప్పాను. ఏదేమైనా నా ఉద్దేశ్యం మాత్రం వ్యాసాన్ని మెరుగుపరచాలనే తప్ప మరొకరిని విమర్షించాలని కాదు. ధన్యవాదాలు దేవా 09:24, 7 నవంబర్ 2007 (UTC)

దేవా గారూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు కృతజ్ఞతలు. క్రింది వాక్యంలో ఏదో వ్రాయాలి కదా అన్నట్టు ఇతర ఉపయోగాలు వివరించబడ్డాయి. అని దీని గురించి చెప్పారు. బానే ఉంది కాని నాకు జవాబు మాత్రం దొరకలేదు. శాస్త్రీయంగా ఎలా ఉండాలో వివరించలేదు. వికీపిడియా ఎవరైనా దిద్దగల విజ్ఞాన సర్వస్వం, ఇక్కడ ఎవరు రాసినదీ శాశ్వతం కాదు. ఎవరైనా మార్పులు చేయచ్చు. సభ్యుల తప్పులను చూచిస్తూ పోయేకంటే వాటిని చూసిన వెంటనే సరిదిద్దటం మన భాద్యత. వ్యాసంలో ఒకే సారిగా పూర్తి స్వరూపం తీసుకురాలేం. ఒక్కొక్కరికి ఒకోసారి రాసేటపుడు ఒకో ఆలోచన వస్తుంది. అలా వ్యాసం మెరుగుపడ్తుంది. నేను రాసుకొనేది నాకోసంకాదు ఎవరూ మార్పులు చేయద్దని చెప్పేందుకు. ఎవరయినా మార్చచ్చు, లేదా పూర్తీగా తొలగించవచ్చు. వీటిగురించి ఎక్కువ టెన్సన్ తీసుకోవడం నాకిష్టముండదు. ఏదైనా మీకు నచ్చకపోతే మీరూ తొలగించి మార్పులు చేయచ్చు. మరొక చిన్న విషయం నేను కంప్యూటరు రంగానికి చెందిన వాడిని కాదు అన్నారు. మీకు ఇంగ్లీషు వచ్చు, హెటి.ఎమ్.ఎల్ తెలుసు. కాని నేను పెయింటింగు పనులు అచ్చుకొని చేయిస్తూ చేసే ఒక పెయింటరును మాత్రమే. కంప్యూటరు నాకొక హాబీ మాత్రమే. నాకు కేవలం పొటోషాప్ మాత్రమే తెలుసు. తెలుగు అంటే అభిమానం కనుక అందరినీ అడుక్కుంటూ వారి సలహాలతో ఇక్కడ ఇలా రాయగలుగుతున్నాను ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నంతవరకూ చేస్తాను లేదా లేదు. ఏదైనా మరో సారి మీకు నా కృతజ్ఞతలు.విశ్వనాధ్. 07:10, 8 నవంబర్ 2007 (UTC)
విశ్వనాథ్ గారూ, మీకు తెలిసినది మీరు వ్రాసి మంచిపని చేస్తున్నారు. అలాగే కొనసాగించండి. ఒక వ్యాసంలోని సమాచారం వికీప్రక్రియలో కొంత సమయమందిస్తే సహజంగానే మొరుగుపడుతుందని నా అభిప్రాయం కూడాను. అలా నన్ను అబ్బురపరచిన వ్యాసాలు చాలానే ఉన్నాయి. --వైజాసత్య 07:19, 8 నవంబర్ 2007 (UTC)
విశ్వనాథ్ గారు మీరు ఇలానే కొనసాగించండి. నేను మరోసారి చెపుతున్నదేంటంటే నాకు ఈ వ్యాసాన్ని తీర్చిదిద్దడం వస్తే నేనే దిద్దేవాడిని, ఇంకా ఎవరైనా ఉత్సాహవంతులు వ్యాసాన్ని అభివృద్ది చేస్తారేమోనని చర్చా పేజీలో రాసాను. ఒకవేళ నాకు తప్పులను సూచించాలనే ఉద్దేశ్యం ఉంటే మీ చర్చా పేజీలోనే వ్రాసేవాడిని. మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ చర్చ ఇంతటితో ముగిసిందని భావిస్తున్నాను. దేవాచర్చ 09:47, 8 నవంబర్ 2007 (UTC)

వ్యాసం విజ్ఞానసర్వస్వ ధోరణిలో లేదు

మార్చు

ఈ వ్యాసంలో పలు లోపాలున్నాయి. వ్యాస నిర్మాణంలో గానీ, వికీ విధానాలు, మూలసూత్రాల విషయంలో గానీ ఈ వ్యాసం వికీ పద్ధతిలో లేదు. సరిపడా మూలాల్లేవు. అజ్ఞాతలు పేజీలో బోల్డంత చెత్త పోసారు. దాన్ని చాలావరకు తీసేసాను. ఇంకా ఉందనిపిస్తోంది. వ్యాసాన్ని విజ్ఞానసర్వస్వ యుక్తంగా రాయాలి. శాస్త్ర సంబంధ విషయాన్ని సరైన మూలాల నుండి సేకరించి రాయాలి. ఇంగ్లీషు వికీపీడియా నుండి అనువదించడం అత్యుత్తమ పద్ధతి. అలా కాకుండా వాడుకరులు తమకు తెలిసిన అసమగ్ర సమాచారాన్ని రాసుకుంటూ పోతే వ్యాసంలో శాస్త్రీయత లోపిస్తుంది. ఈ వ్యాసంలో అదే కనిపిస్తోంది. __ చదువరి (చర్చరచనలు) 02:06, 21 ఏప్రిల్ 2022 (UTC)Reply

Return to "కంప్యూటర్ చరిత్ర" page.