చర్చ:కణ కేంద్రకం
కణ కేంద్రకం వ్యాసమును YVSREDDY 8 జనవరి 2016 న 1,762 బైట్లతో సృష్టించారు. ఈ వ్యాసమునకు Kasyap గారు 31 ఆగస్టు 2020 న 4,264 బైట్ల అదనపు సమాచారం చేర్చారు. అయితే 6,026 బైట్లకు విస్తరించబడిన ఈ వ్యాసం తొలగించబడింది.
- YVSREDDY గారిచే 8 జనవరి 2016 న సృష్టించిన ఈ వ్యాసములోని సమాచారం:
కణ కేంద్రకం అనేది జన్యుకోడ్ డి.ఎన్.ఎను కలిగియున్న కణము యొక్క భాగం. ఈ కేంద్రకం చిన్నది, గుండ్రంగా ఉంటుంది, ఇది కణం యొక్క నియంత్ర్రణ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది క్రోమోజోములను కలిగియున్న డి.ఎన్.ఎ గూడు. మానవ శరీరం బిలియన్ల కణాలను కలిగి ఉంటుంది, వీటిలో చాలావరకు కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. అన్ని యూకారియోటిక్ జీవులు వాటి కణాలలో కేంద్రకాలను కలిగి ఉంటాయి, అయినా అనేక యూకారియోట్లు ఏక-కణం కలవి. ప్రోకర్యోట్లు ఇవి బాక్టీరియా, ఆర్కియా, చాలా వేరే రకమైన ఒకే కణం కల ప్రాణులు, కేంద్రకాలను కలిగి ఉండవు. కణ కేంద్రాకాలు మొదట 17 వ శతాబ్దంలో అంటోని వాన్ లీవెన్‌హూక్ ద్వారా కనుగొనబడ్డాయి.
- Kasyap గారిచే 31 ఆగస్టు 2020 న విస్తరించిన ఈ వ్యాసములోని సమాచారం:
క్రోమోజోమ్‌లను ఏర్పరచటానికి హిస్టోన్‌ల వంటి వివిధ రకాల ప్రోటీన్‌లతో కలిపి ఇది చాలా కాలం పాటు ఉన్న DNA అణువులుగా నిర్వహించబడుతుంది. ఇవి క్రోమోజోమ్‌లలోని జన్యువులుకణం యొక్క పిండ జన్యువు. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడం ద్వారా, పిండం ఈ జన్యువుల సమగ్రతను కాపాడటం కణాల కార్యకలాపాలను నియంత్రించడం. అందువల్ల కేంద్రకం కణం యొక్క నియంత్రణ కేంద్రం. పిండం కోత, పిండ పొర అనేది పిండాన్ని తయారుచేసే ముఖ్యమైన నిర్మాణాలు. కవరు డబుల్ పొర. ఇది అణు అంతర్గత నిర్మాణాన్ని పూర్తిగా కవర్ చేస్తుంది దాని విషయాలను పిండం యొక్క సైటోప్లాజం నుండి వేరు చేస్తుంది. న్యూక్లియస్ అక్యుంబెన్స్ అనేది న్యూక్లియస్‌లోని ఒక నెట్‌వర్క్. సెల్ ఫ్రేమ్ మొత్తం సెల్కు మద్దతు ఇస్తున్నందున, ఇది యాంత్రిక మద్దతును అందిస్తుంది. పిండం పొర చాలా అణువులలోకి చొచ్చుకుపోదు కాబట్టి, పిండం గుండా అణువులను కదిలించడానికి కేంద్రకాలు అవసరమవుతాయి. ఈ రంధ్రాలు రెండు పొరలను దాటుతాయి. ఇది చిన్న అణువులతో రూపొందించబడింది, అయాన్లు స్వేచ్ఛగా కదలడానికి అనుమతించే ఒక పథాన్ని కూడా అందిస్తాయి. ప్రోటీన్లు వంటి పెద్ద అణువుల కదలిక జాగ్రత్తగా నియంత్రించబడుతుంది. దీనికి కుంకుమ ప్రోటీన్లచే నియంత్రించబడే క్రియాశీల రవాణా అవసరం. కణాల పనితీరుకు పిండ రవాణా అవసరం. ఎందుకంటే జన్యు వ్యక్తీకరణ, క్రోమోజోమ్ నిర్వహణ రెండింటికీ రంధ్రాల ద్వారా కదలిక అవసరం.
న్యూక్లియస్ లోపలి భాగంలో నెలవంక వంటి చుట్టుపక్కల ఉప గదులు లేనప్పటికీ, దాని విషయాలు ఏకరీతిగా ఉండవు. ప్రత్యేకమైన ప్రోటీన్లు, ఆర్‌ఎన్‌ఏ అణువులు, క్రోమోజోమ్‌ల యొక్క చిన్న భాగాలతో రూపొందించిన అనేక సబ్యూనిట్ శరీరాలు కూడా ఉన్నాయి. వీటిలో బాగా తెలిసినది పంక్చర్. ఇది ప్రధానంగా రైబోజోమ్‌ల అసెంబ్లీలో పాల్గొంటుంది . కేంద్రకంలో ఏర్పడిన తర్వాత, రైబోజోమ్‌లు సైటోప్లాజమ్‌కు పంపబడతాయి, ఇది mRNA ని అనువదిస్తుంది.
[[వర్గం:జీవ శాస్త్రము]
అయితే ఈ వ్యాసము యొక్క చరిత్రను పరిశీలిస్తే ఈ వ్యాసమును సృష్టించిన YVSREDDY పేరు గాని, ఈ వ్యాసమును విస్తరించిన Kasyap గారి పేరు గాని కనిపించవు. అలాగే ఈ వ్యాసంలో Kasyap గారు వ్రాసిన సమాచారమూ కనిపించదు. మొత్తానికి ఈ వ్యాసమును జీవకణం అనే వ్యాసానికి దారిమార్పుగా ఉన్న లింకుతో ఎవరికీ ఏమీ అర్థం కాకుండా ఏదో ఏలాగో చేశారు. ఏదో ఏలాగో చేసిన ఈ వ్యాసంలో Kasyap గారు వ్రాసిన సమాచారం కూడా చేర్చి ఉంటే బాగుండేది. YVSREDDY (చర్చ) 17:05, 21 ఫిబ్రవరి 2023 (UTC)
- YVSREDDY గారూ, కేంద్రకం అనే వ్యాసాన్ని 2009 లో సృష్టించారు. అదే విషయంపై కణకేంద్రకం వ్యాసాన్ని 2016 లో సృష్టించారు. ఒకే విషయంపై రెండు పేర్లతో వ్యాసాలుంటే వాటిని విలీనం చెయ్యడం పద్ధతి. మొదటగా సృష్టించిన వ్యాసంలో (అందులో తగినంత సమాచారం ఉంటే) తరువాత సృష్టించిన వ్యాసాన్ని విలీనం చెయ్యడం పద్ధతి. ఆ విధంగానే కేంద్రకం వ్యాసం లోకి కణ కేంద్రకం వ్యాసాన్ని విలీనం చేసాను. కానీ కణ కేంద్రకం అనేది మరింత సరైన మాట కాబట్టి (కేంద్రకం అనే మాటకు సంబంధించి రెండు వేరువేరు అంశాలుంటాయి - అవి అణుకేంద్రకం, కణ కేంద్రకం.) విలీనం తరువాత ఉన్న పేజీని కణ కేంద్రకం కు తరలించాను.
- ఈ విలీనం లాజిక్కంతా మీకు బాగా తెలుసు. ఎందుకంటే పాత్రికేయులు అనే పేజీలో జరిగిన విలీనాన్ని ఈ తర్కం ప్రకారమే చర్చ:పాత్రికేయులు పేజీలో మీరు ప్రశ్నించారు. అక్కడ మీరు చెప్పినది రైటు కాబట్టి, ఆ ప్రకారమే విలీనాన్ని మార్చాను. మరి, అక్కడ మీరు చేసిన వాదన, ఇక్కడ అర్థం కాలేదని ఎందుకు అంటున్నారు?
- "ఏదో ఏలాగో చేసిన ఈ వ్యాసంలో Kasyap గారు వ్రాసిన సమాచారం కూడా చేర్చి ఉంటే బాగుండేది" అని రాసారు- విలీనం చేసినపుడు పాఠ్యాన్ని విలీనం చేస్తాం. ఈ విలీనంలో అర్థవంతంగా ఉన్న సమాచారాన్ని- 1432 బైట్లను - చేర్చాను, గమనించారా?. ఫలానా వారు రాసిన పాఠ్యాన్ని వీలీనం చేద్దాం, ఫలానావారి పాఠ్యాన్ని వదిలేద్దాం అని ఏదోలా చేసెయ్యరు. కనీసం నేనైతే అలా అదోలా చెయ్యను.
- మీరు కింది విషయాలకు సంబంధించి ఆత్మ పరిశీలన చేసుకున్నారా?
- కేంద్రకం అనే మాటతో పేజీ ఉండగా, కణ కేంద్రకం అనే మాటను సృష్టించడం అనేది పొరపాటు కదా.. నేను ఈ పొరపాటు చేసాను కదా అని ప్రశ్నించుకున్నారా? ఇలాంటి పొరపాట్లు అందరూ చేస్తారు. వికీలో జరుగుతూనే ఉంటుంది. కానీ నా పేజీని ఏదో ఏలాగో విలీనం చేసేసారు అని బాధ పడేవాళ్ళు, తాము చేసిన ఇలాంటి పొరపాట్లను గ్రహించడం, ఒప్పుకోవడం అవసరమే కదా.
- మీరు 2016 లో 1700 బైట్లతో మొలకగా సృష్టించేసి అలా వదిలేసారని, 2020 వరకూ అది మొలకగానే ఉండిపోయిందని గ్రహించుకున్నారా? మొలకల విస్తరణ ప్రాజెక్టులో గానీ దానికి ముందు గానీ మీరు ఈ వ్యాసాన్ని విస్తరించే ప్రయత్నం చెయ్యలేదని గ్రహించుకున్నారా?
- మీరు సృష్టించిన వ్యాసంలో మీరు కనీసం ఒక్క మూలం కూడా చేర్చలేదని గ్రహించుకున్నారా? అంతేకాదు, ఆ వ్యాసాన్ని విలీనం చేసేవరకూ ఆ వ్యాసంలో ఒక్క మూలం కూడా లేదన్న సంగతి మీరు గమనించారా?
- నమస్కారం.__చదువరి (చర్చ • రచనలు) 02:02, 22 ఫిబ్రవరి 2023 (UTC)