చర్చ:పాత్రికేయులు

తాజా వ్యాఖ్య: 1 సంవత్సరం క్రితం. రాసినది: Pranayraj1985

09:04, 4 ఫిబ్రవరి 2012‎ న YVSREDDY గారు‎ 3,265 బైట్లు తో విలేకరి పేరుతో ఒక కొత్త పేజీ సృష్టించారు.

విలేకరి వ్యాసంలో 4 ఫిబ్రవరి 2012‎ న YVSREDDY గారు‎ వ్రాసిన సమాచారం.

విలేకరి వార్తలను మరియు ఇతర సమాచారాన్ని సేకరించి వాటిని పంచి పెడతాడు. వేరువేరు ప్రాంతాలలో జరిగిన విషయాలను తన సంపాదకీయం ద్వారా వేరువేరు ప్రాంతాలకు తెలియజేయడం విలేకరి కర్తవ్యం. వివిధ పద్ధతుల ద్వారా పరిశీలన జరిపి వార్తలను సేకరించిన వీరు వివిధ పద్ధతులద్వారా అనగా వార్తాపత్రికల ద్వారా మరియు మేగజైన్ల ద్వారా అందించే పద్ధతిని ప్రింట్ మీడియా అని, టెలివిజన్, రేడియో, డాక్యూమెంటరీ చిత్రాల ద్వారా అందించే పద్ధతిని ఎలక్ట్రానిక్ మీడియా అని, అన్ లైన్ ద్వారా అందించే పద్ధతిని డిజిటల్ మీడియా అని అంటారు. విలేకరిని లేక పత్రికా సంపాదకుడిని ఇంగ్లీషులో Reporter (రిపోర్టర్) లేక Journalist (జర్నలిస్ట్) అంటారు.

01:26, 17 మార్చి 2019 న‎ Chaduvari గారు‎ 1,575 బైట్లు తో పాత్రికేయులు పేరుతో ఒక కొత్త పేజీ సృష్టించారు.

పాత్రికేయులు వ్యాసంలో 17 మార్చి 2019 న Chaduvari గారు‎ వ్రాసిన సమాచారం.
వార్తలను, సమకాలీన సమాచారాన్నీ సేకరించి, రాసి, ప్రజలకు అందించేవారు పాత్రికేయులు. వారు సామాన్య విషయాలపై పనిచెయ్యవచ్చు, ప్రత్యేకించి ఒక రంగంలో విశేష కృషి చెయ్యనూవచ్చు. ఎక్కువ మంది పాత్రికేయులు ఒక రంగంలో కృషి చేసి, నైపుణ్యం సాధించేందుకు మొగ్గు చూపిస్తారు. ఇతర నిపుణులతో కలిసి వివిధ విషయాలపై రచనలను కూర్చి పత్రికలను వెలయిస్తారు. ఉదాహరణకు, క్రీడల పాత్రికేయులు క్రీడలకు సంబంధించిన వార్తలపై పనిచేస్తారు. అయితే వీళ్ళు అనేక రంగాల వార్తలను ప్రచురించే వార్తా పత్రికలో పనిచేస్తూండవచ్చు.

4 ఫిబ్రవరి 2012‎ న YVSREDDY గారు‎ వ్రాసిన వ్యాసాన్ని, 17 మార్చి 2019 న Chaduvari గారు‎ వ్రాసిన వ్యాసంలో విలీనం చేశారు. ఈ విధానం తప్పు. ముందుగా సృష్టించబడిన వ్యాసంలో అదనపు సమాచారం చేర్చాలి. లేకపోతే ఏ వ్యాసం ఎప్పుడు సృష్టించబడినదో ఎవరు సృష్టించారో కూడా తెలియకుండా పోతుంది. YVSREDDY (చర్చ) 13:52, 22 జనవరి 2023 (UTC)Reply

ముందుగా సృష్టించబడిన వ్యాసంలో అదనపు సమాచారం చేర్చాలి. లేకపోతే వ్యాసం చరిత్ర చెడిపోతుంది.
విలేకరి వ్యాసంలో4 ఫిబ్రవరి 2012‎ న YVSREDDY గారు‎ వ్రాసినది పాత్రికేయులు వ్యాసంలో 17 మార్చి 2019 న Chaduvari గారు‎ వ్రాసినది
విలేకరి వార్తలను మరియు ఇతర సమాచారాన్ని సేకరించి వాటిని పంచి పెడతాడు. వేరువేరు ప్రాంతాలలో జరిగిన విషయాలను తన సంపాదకీయం ద్వారా వేరువేరు ప్రాంతాలకు తెలియజేయడం విలేకరి కర్తవ్యం. వివిధ పద్ధతుల ద్వారా పరిశీలన జరిపి వార్తలను సేకరించిన వీరు వివిధ పద్ధతులద్వారా అనగా వార్తాపత్రికల ద్వారా మరియు మేగజైన్ల ద్వారా అందించే పద్ధతిని ప్రింట్ మీడియా అని, టెలివిజన్, రేడియో, డాక్యూమెంటరీ చిత్రాల ద్వారా అందించే పద్ధతిని ఎలక్ట్రానిక్ మీడియా అని, అన్ లైన్ ద్వారా అందించే పద్ధతిని డిజిటల్ మీడియా అని అంటారు. విలేకరిని లేక పత్రికా సంపాదకుడిని ఇంగ్లీషులో Reporter (రిపోర్టర్) లేక Journalist (జర్నలిస్ట్) అంటారు. వార్తలను, సమకాలీన సమాచారాన్నీ సేకరించి, రాసి, ప్రజలకు అందించేవారు పాత్రికేయులు. వారు సామాన్య విషయాలపై పనిచెయ్యవచ్చు, ప్రత్యేకించి ఒక రంగంలో విశేష కృషి చెయ్యనూవచ్చు. ఎక్కువ మంది పాత్రికేయులు ఒక రంగంలో కృషి చేసి, నైపుణ్యం సాధించేందుకు మొగ్గు చూపిస్తారు. ఇతర నిపుణులతో కలిసి వివిధ విషయాలపై రచనలను కూర్చి పత్రికలను వెలయిస్తారు. ఉదాహరణకు, క్రీడల పాత్రికేయులు క్రీడలకు సంబంధించిన వార్తలపై పనిచేస్తారు. అయితే వీళ్ళు అనేక రంగాల వార్తలను ప్రచురించే వార్తా పత్రికలో పనిచేస్తూండవచ్చు.

ముందు సృష్టించిన వ్యాసాల చరిత్రను కాపాడుకోవాలంటే అదే వ్యాసం మరో పేరుతో తరువాత సృష్టింపబడితే ముందు సృష్టించబడిన వ్యాసంలో తరువాత సృష్టించబడిన వ్యాసంలో వున్న అదనపు సమాచారాన్ని చేర్చాలి. YVSREDDY (చర్చ) 03:23, 23 జనవరి 2023 (UTC)Reply

ముందుగా సృష్టించిన వ్యాసంలో తగు సమాచారం ఉంటే, అందులోకి తరువాత సృష్టించిన వ్యాసాన్ని విలీనం చెయ్యాలి అనే సూత్రం ప్రకారం పైన @YVSREDDY చెప్పినట్లుగా విలీనం జరగాలి. ఇంతకుముందు నేను చేసిన విలీనం ఆ విధంగా లేదు. ఆ తప్పును సరిచేసేందుకు విలీనాన్ని సరిచేసాను. ఈ విషయాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు రెడ్డి గారు. __చదువరి (చర్చరచనలు) 05:01, 23 జనవరి 2023 (UTC)Reply
ఈ విషయంలో అసలు లోపం మొదట ఎక్కడ జరిగిందని పరిశీలిస్తే నాకు తెలిసినంతవరకు పేజీ సృష్టించినరోజే పొరపాటుకు తావు ఏర్పడిందని నేను భావిస్తున్నాను.పాత్రికేయులు శీర్షికతో ఈ లింకులో పేజీ సృష్టించబడింది. పాత్రికేయులు పేరుతో వ్యాసం సృష్టించి, వ్యాస పరిచయంలో విలేకరి అవి రాసినట్లుగా అదే లింకులో చూడవచ్చు. అయితే ఆరోజే విలేకరి లేదా విలేఖరి అనే అర్థాలు ఉన్నాయనే భావం ఉన్నప్చుడు ఆ శీర్షికలతో దారిమార్పు చేసిఉన్నట్లయితే, ఈ సమస్య వచ్చేదికాదు.అలాంటి చర్చలలో సమాధానం సత్వరం గా ఇవ్యాలి. ఇలాంటివి జరగటం సహజం. కానీ ఏక వాక్యంతో సృష్టించేపేజీలు, అదే వ్యాసం మరో పేరుతో సృష్టించిన వ్యాసాలు, అభివృద్ది జరిగిన వ్యాసాల పేజీలో, వ్యాసాలు చరిత్రలకు భంగంవాటిల్లకుండా విలీనం లేదా దారిమార్పు చేయటం భావ్యం అని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 16:46, 23 జనవరి 2023 (UTC)Reply
ఈ వ్యాసం పేరు విలేఖరి అని ఉండాలి. విలేకరి తప్పు పదము. దయచేసి సవరించండి.Rajasekhar1961 (చర్చ) 06:18, 18 మార్చి 2014 (UTC)

చేశాను చేశాను --వైజాసత్య (చర్చ) 11:13, 19 మార్చి 2014 (UTC)
విలేకరి, విలేఖరి అన్న పదాలలో ఏది సరైనదో నిర్ణయించడం అంత సులభం కాదు. -అరి అన్న తెలుగు ప్రత్యయాన్ని సుంకరి, కుమ్మరి, కమ్మరి మొ॥ తెలుగు పదాల్లో వాడితే, -కర/కరి /కార అన్న సంస్కృత ప్రత్యయాలను సుధాకర, అహంకారి మొ॥ సంస్కృత ప్రత్యయాల్లో వాడుతాము. లెక్క ప్రకారం విలేఖ(సంస్కృతం) లను సృష్టించే వాడు విలేఖకరుడు, విలేఖకరి అవ్వాలి. అయితే, రెండు సన్నిహిత ధ్వనులు పక్కపక్కనే ఉన్నప్పుడు, రెండు ధ్వనులకు మారుగా ఒక్క ధ్వనిని మాత్రమే పలకడం అన్ని భాషలలో జరిగే ధ్వని పరిణామమే (ఈ ధ్వని పరిణామాన్ని సదృశ వర్ణలోపం (Haplology) అని అంటారు). ఈరకమైన ధ్వని పరిణామం వలన విలేఖకరి అన్న పదం విలేఖరి/విలేకరి గా మారిందని చెప్పుకోవచ్చు. లిఖించేవాడిని (రాసేవారిని) అచ్చతెలుగులో “లేకరి” అనేవారు (మహాప్రాణాలు అచ్చతెలుగులో అల్పప్రాణాలు అవుతాయి కదా!). విలేఖలు రాసేవాడు, విలేకరి అయినా కావాలి, లేదా విలేఖకరి అయినా కావాలి. బూదరాజు గారెప్పుడూ విలేకరి అనే రాసేవారు.

Return to "పాత్రికేయులు" page.