చర్చ:కప్పగంతు
వ్యాసవిస్తరణ
మార్చుకప్పగంతు అనె ఇంటి పెరు ఏలా వచ్చినదొ వ్యాసములొ వ్రాసినచొ బాగుండును. నెను కప్పగంతు కుటుంబమునకు చెందివాడినయినప్పటికి, నాకు, మా ఇంటిపెరు యెలా వచ్చినదొ తెలియదు. తెలిసినవారు, వ్రాయగలరు.--SIVA 17:08, 12 మార్చి 2008 (UTC)
1990లలో ఆంధ్రజ్యోతి వార పత్రికలో ఇంటిపేర్లు అవి ఎలా వచ్చినాయి అన్న విషయం మీద వారం వారం వ్రాశారు. వ్రాసినాయన పేరు కూడ్ జ్ఞాపకం లేదు. ఆంధ్ర ప్రాంతములోని లైబ్రరీలలో వెతికితే ఈ పత్రిక పాత సంచికలు దొరుకుతాయి. సభ్యులెవరైనా కొంత ఇంటరెస్ట్ తీసుకుని వెతికితే, ఇంటిపేర్లలో దాదాపు అన్నిటికి తగినంత సమాచారం దొరుకుతుంది. ఈ వ్యాసాలన్నీ పుస్తకరూపంలో కూడ వచ్చి ఉండవచ్చు. ప్రస్తుతం నేను ముంబాయి నగరంలో ఉంటున్నందువల్ల ఈ పని నేను చేయలేకపోతున్నాను.--SIVA 18:28, 26 డిసెంబర్ 2008 (UTC)
- తెలుగు ఇంటిపేర్ల మీద అనేకమంది శాస్త్రీయ పరిశోధనలు చేశారు. పీహెచ్‌డీ పట్టాలు కూడా పొందారు. ఏదో పత్రికలోని వ్యాసం వెతికేకంటే ఇలాంటి పరిశోధనా పుస్తకాలు పెద్ద పెద్ద గ్రంథాలయాల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ తప్పకుండా దొరుకుతాయి. వాటిని సంప్రదిస్తే మీకు మరింత సమాచారం లభించే అవకాశం ఉంది ఉదాహరణకు ఈ లింకు చూడండి --వైజాసత్య 20:11, 26 డిసెంబర్ 2008 (UTC)
ఆధారాలు చూపాలి
మార్చుఆధారాలు చూపాలట
ఫలనాఫలానా నగరాలలో ఈ ఇంటి పేరు గలవారు ఉన్నారు అంటే దానికి ఒక టాగ్ పెట్టారు "ఆధారాలు చూపాలి" అని. ఏమి ఆధారాలు చూపాలి? జనాభా లెక్కల్లో ఆ ఇంటి పేర్లు ఉన్న పేజీలు ఇక్కడ అప్లోడ్ చెయ్యాలా, లేదా ఆ ఇంటిపేరు గలవారి ఆధార్ కార్ద్ చిరునామాతో సహా ఇక్కడ అప్లోడ్ చెయ్యాలా?
కప్పగంతు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసానికి మూలాలు లేవు. అయోమయ నివృత్తి పేజీ చేద్దామన్నా "కప్పగంతు" ఇంటి పేరుతో వ్యక్తులు కూడా వికీలో లేరు. గ్రామాలు లేవు. ఇచ్చిన విషయం కూడా మౌలిక పరిశోధన కలిగినది. సరైన ఆధారాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కప్పగంతు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
- కప్పగంతు గ్రామం లేని మాట నిజమే. కానీ, ప్రతి ఇంటిపేరుకు ఒక గ్రామం పేరు ఉండాలి అని ఏమీ లేదు. ఆ వ్యాసం తీసెయ్యటానికి అదొక పెద్ద కారణం కాదు. కప్పగంతు, కప్పగంతుల ఇంటిపేరు గలవాళ్ళు వేలల్లో ఉన్నారు. వికీపీడియాలో ఎవరూ లేరు అనే మాట కరెక్ట్ కాదు. నేను ఉన్నాను కదా! ఆపైన వికీపీడియాలో ఎవ్వరూ లేరు అనే ఒక్క కారణం వ్యాసం తీసెయ్యటానికి ప్రామాణికం ఎలా అవుతుంది?
- ఇంటిపేర్ల మీద ఆంధ్ర జ్యొతి వార పత్రికలో వ్యాస పరంపర వచ్చింది. నేను కప్పగంతు మా ఇంటి పేరు కాబట్టి చదివాను. ఇప్పుడు గుర్తు లేదు.
- తరువాత, ప్రతి ఇంటి పేరుకూ ప్రామాణికం కావాలి అంటే దొరకటం కష్టం. అలా పట్టుపడితే గట్టిగా 0.5% ఇంటి పేర్లకు కూడా ప్రామాణికాలే కాదు అర్ధాలు కూడా దొరకవు.
- సరే, వికీపీడియా చాదస్తానికి అవధులు లేవు. తీసెయ్యాలనుకుంటే తీసేసుకోండి. నేను వికీ పీడియాలో ఇప్పుడు ఏమీ వ్రాయటం లేదు,వ్రాయలనీ అనుకోవటం లేదు. నాకు మైలు వచ్చింది కాబట్టి ఈ స్పందన.
- శలవు
- పాస్ వర్డ్ మరచిన కారణాన లాగ్ ఇన్ అవ్వలేకపొయ్యాను. పాస్ వర్డ్ మరచాను సౌకర్యంలో నా మైలు వగైరా ఇచ్చాను కానీ, ఇంతవరకూ నాకు రిసెట్ లింకు రాలేదు. కాబట్టి లాగ్ ఇన్ అవకుండానే ఈ వ్యాఖ్య వ్రాయవలసి వచ్చింది.
- Sivaramaprasad Kappagantu vu3ktb@gmail.com --2020-09-01T18:41:42 27.6.80.55