వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కప్పగంతు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : తొలగింపు ప్రతిపాదన చేసిన నేను వ్యాసాన్ని విస్తరించినందున తొలగించవలసిన అవసరం లేదు. K.Venkataramana(talk) 16:54, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసానికి మూలాలు లేవు. అయోమయ నివృత్తి పేజీ చేద్దామన్నా "కప్పగంతు" ఇంటి పేరుతో వ్యక్తులు కూడా వికీలో లేరు. గ్రామాలు లేవు. ఇచ్చిన విషయం కూడా మౌలిక పరిశోధన కలిగినది. సరైన ఆధారాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. K.Venkataramana(talk) 14:45, 29 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- కప్పగంతు గ్రామం లేని మాట నిజమే. కానీ, ప్రతి ఇంటిపేరుకు ఒక గ్రామం పేరు ఉండాలి అని ఏమీ లేదు. ఆ వ్యాసం తీసెయ్యటానికి అదొక పెద్ద కారణం కాదు. కప్పగంతు, కప్పగంతుల ఇంటిపేరు గలవాళ్ళు వేలల్లో ఉన్నారు. వికీపీడియాలో ఎవరూ లేరు అనే మాట కరెక్ట్ కాదు. నేను ఉన్నాను కదా! ఆపైన వికీపీడియాలో ఎవ్వరూ లేరు అనే ఒక్క కారణం వ్యాసం తీసెయ్యటానికి ప్రామాణికం ఎలా అవుతుంది?
ఇంటిపేర్ల మీద ఆంధ్ర జ్యొతి వార పత్రికలో వ్యాస పరంపర వచ్చింది. నేను కప్పగంతు మా ఇంటి పేరు కాబట్టి చదివాను. ఇప్పుడు గుర్తు లేదు.
తరువాత, ప్రతి ఇంటి పేరుకూ ప్రామాణికం కావాలి అంటే దొరకటం కష్టం. అలా పట్టుపడితే గట్టిగా 0.5% ఇంటి పేర్లకు కూడా ప్రామాణికాలే కాదు అర్ధాలు కూడా దొరకవు.
సరే, వికీపీడియా చాదస్తానికి అవధులు లేవు. తీసెయ్యాలనుకుంటే తీసేసుకోండి. నేను వికీ పీడియాలో ఇప్పుడు ఏమీ వ్రాయటం లేదు,వ్రాయలనీ అనుకోవటం లేదు. నాకు మైలు వచ్చింది కాబట్టి ఈ స్పందన.
శలవు
పాస్ వర్డ్ మరచిన కారణాన లాగ్ ఇన్ అవ్వలేకపొయ్యాను. పాస్ వర్డ్ మరచాను సౌకర్యంలో నా మైలు వగైరా ఇచ్చాను కానీ, ఇంతవరకూ నాకు రిసెట్ లింకు రాలేదు. కాబట్టి లాగ్ ఇన్ అవకుండానే ఈ వ్యాఖ్య వ్రాయవలసి వచ్చింది. Sivaramaprasad Kappagantu vu3ktb@gmail.com
వాడుకరి:Vu3ktb (కప్పగంతు శివరామ ప్రసాదు) చర్చా పేజీ నుండి చేర్చితిని.
- @K.Venkataramana: గారూ, శివరామ ప్రసాదు గారు vu3ktb అనే వాడుకరి పేరుతో ఒకప్పుడు వికీలో చురుగ్గా ఉండేవారు. వ్యాసాలు కూడా ఓపిగ్గా రాసేవారు. కానీ ఎందుచేతనో ఆయనకు వికీ నియమాలు అంతగా అవగాహనకు రాలేదు. అందుకనే మన విధానాలు ఆయనకు చాదస్తంగా అనిపిస్తున్నాయి. కానీ ఆయన పేర్కొన్న కొన్ని వాస్తవాలు ఏమిటంటే తెవికిలో ఇదే కాక ఇంకా చాలా ఇంటి పేర్ల వ్యాసాలు ఉన్నాయి. వాటికి సరైన ఆధారాలు లేవు. కాబట్టి ఈ వ్యాసం మీద మనం చర్య తీసుకుంటే ఆధారాలు లేని ఇతర ఇంటి పేర్ల వ్యాసాల మీద కూడా తీసుకోవాలి. అలాగని ఇంటి పేర్ల వ్యాసాలన్నీ వికీకి పనికిరావని నా అభిప్రాయం కాదు. వీటికోసం ఓపిగ్గా విషయ సేకరణ చేసి రాయాలి. ఆంగ్ల వికీలో ఇంటి పేర్ల మీద అలాంటి వ్యాసాలు చూశాను. మన సమస్య ఆధారాలు సరిగా దొరక్కపోవడం, ఒకవేళ ఉన్నా ఎక్కడో ఎప్పుడో ప్రచురించిన పుస్తకాల్లో ఉండటం, వాటిని వెతికి పట్టుకోవడం కష్టమైన పని. - రవిచంద్ర (చర్చ) 13:02, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రవిచంద్ర గారూ, మూలాలను సేకరించే పనిలో ఉన్నాను. ఆధారాలను సేకరించి వ్యాస విస్తరణ చేయాలనేని నా ఉద్దేశ్యం. K.Venkataramana(talk) 13:19, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- కప్పగంతు ఇంటి పేరు గల రచయితలను వ్యాసంలో చేర్చితిని. మూలాలు చేర్చితిని. కనుక తొలగింపు మూసను తొలగిస్తున్నాను. K.Venkataramana(talk) 16:54, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రవిచంద్ర గారూ, మూలాలను సేకరించే పనిలో ఉన్నాను. ఆధారాలను సేకరించి వ్యాస విస్తరణ చేయాలనేని నా ఉద్దేశ్యం. K.Venkataramana(talk) 13:19, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.