చర్చ:కలివికోడి
అనేకానేక ధన్యవాదాలు
మార్చుకట్టా శ్రీనివాస రావు గారూ.. నమస్తే. సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా ప్రారంభమైన ఈ సమాచారం ప్రయాణం వికీలో శాశ్వత నిధిగా రూపాంతరం చెందడం చాలా సంతోషకరం. ఈ వ్యాసాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇదే వ్యాసంలోని అంశాలు ఆంగ్ల వికీపీడియాలోకి కూడా అనువదించుకుని, ఆంగ్లం నుంచి ప్రపంచవ్యాప్తమయ్యేలా ఉన్నాయి మీ విలువైన వివరాలు. వికీలో టైప్ చేయడం కొంచెం ఇబ్బంది ఉంది అని ఆ రోజు చెప్పినప్పుడు నేను కొంత నిరుత్సాహపడ్డాను. మీరు ఇచ్చిన వివరాలు నేను వికీలో చేరిస్తే మీ స్వంత గొంతు ఎలా వినిపిస్తుంది, మీ అవగాహన నాకెలా వస్తుంది అని ఆలోచించాను. లేకుంటే నేను సహాయం చేయనని కాదు. మరోలా భావించవద్దు. తుదకు మీరు ఇలా వ్యాసం అభివృద్ధి చేయడం చూసి చాలా సంతోషం కలిగింది. మీరు భవిష్యత్తులో మరింత చక్కని వ్యాసాలు అభివృద్ధి చేయాలని, కొద్ది సమయంలోనే కలివికోడిని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రపక్షిగా ప్రకటించి మీ ఆశయం నెరవేరాలని ఆశిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 17:38, 1 అక్టోబరు 2014 (UTC)
- కట్టా శ్రీనివాస రావు గారూ.. ఈ వ్యాసాన్ని వ్రాసిన మీకు హృదయపూర్వక అభినందనలు. పవన్ సంతోష్ గారి ఆకాంక్ష నెరవేరాలని నేనూ కోరుకుంటున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 18:32, 1 అక్టోబరు 2014 (UTC)