కట్టా శ్రీనివాసరావు
కట్టా శ్రీనివాసరావు ఛాయాచిత్రపటం.
జననం
కట్టా శ్రీనివాసరావు

(1974-01-01) 1974 జనవరి 1 (వయసు 50)
జాతీయతభారతదేశ పౌరుడు
విద్యM.A(తెలుగు మరియు ఆంగ్లం)
వృత్తిఉపాద్యాయుడు
ఉద్యోగంతెలంగాణ విద్యాశాఖ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, చరిత్ర పరిశోధకుడు
గుర్తించదగిన సేవలు
మట్టివేళ్లు కవిత్వం మూడు బిందువులు హైకూలు కూసుమంచి గణపేశ్వరాలయం పుస్తక రచయిత
తరువాతివారురక్షిత సుమ , సుప్రజిత్ రామహర్ష
ఉద్యమంకవిసంగమం, లోచన అధ్యయన వేదిక
జీవిత భాగస్వామిమామిళ్ళపల్లి లక్ష్మి
తల్లిదండ్రులుకట్టా రాఘవులు, లీలావతి
బంధువులుకట్టా జ్ఞానేశ్వరరావు
వెబ్‌సైటుఅంతర్లోచన బ్లాగు
ఫేస్ బుక్ లంకె


మనకు తెలిసిన సమాచారాన్ని నలుగురితో పంచుకోవడంలో ఆనందమే కాదు, ఉపయోగం కూడా వుంది. అందుకే వికీపిడియా లో సభ్యుడిగా చేరాను. ఎంతో సమాచారాన్ని వికీ ద్వారా తెలుసుకోవడంతో పాటు కొంతైనా నావంతుగా దీనిలో చేర్చాలనే ఉద్ధేశ్యంతో పనిచేస్తున్నాను.

నాగురించి

మార్చు

మాది ఖమ్మం జిల్లా, సత్తుపల్లి స్వగ్రామం. ది 01-01-1974 న పుట్టాను. ప్రైమరీ నుంచి డిగ్రీ వరకూ విద్యాబ్యాసం అక్కడే. బి.యిడి మరియూ రెండు పోస్టుగ్రాడ్యూయేట్ డిగ్రీలను (తెలుగు మరియు ఆంగ్లం) దూర విద్యద్వారా పూర్తిచేసాను. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల సహోపాద్యాయునిగా నియామకం. కొన్ని సంవత్సరాలు డిప్యుటేషన్ పై లెజిస్లేటివ్ కౌన్సిల్ లో యంయల్ సి గారికి వ్యక్తిగత సహాయకునిగా డిప్యుటేషన్ పై పనిచేసాను, డిప్యుటేషన్ పిరియడ్ ను విజయవంతంగా పూర్తిచేసుకుని 2015-16 విద్యాసంవత్సరం నుంచి పాఠశాలలో నా విధుల్లోకి తిరిగిచేరాను.

 

వివిధ కార్యక్రమాలు

మార్చు

లోచన అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక సాహితీ కార్యక్రమాల నిర్వహణలోనూ, పలు పుస్తకాల ప్రచురణ లోనూ పాలు పంచుకోగలిగాను.బాల సాహిత్యం ఖమ్మం జిల్లా సంపాదక వర్గ సభ్యునిగా బడిమెట్లు మాసపత్రికను విడుదల చేయగలగటం అదృష్టంగా భావిస్తాను. సృజన సాహితీ సంస్థ ప్రారంభకులలో నేనూ ఒకడిని. సాహితీ స్రవంతి సంస్థలలో చురుకైన పాత్ర నిర్వహించాను. స్కౌట్ మాస్టర్ ట్రైనర్ గా శిక్షణ పూర్తిచేసుకున్నాను దానిలో అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్ పూర్తయ్యింది. సత్యాన్వేషణ మండలి రాష్ట్రకార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో అడ్మిన్ గానూ నిర్వహణలోనూ ప్రధాన భాగస్వామిగా వున్నాను.

వాడుకరి బేబెల్ సమాచారం
te-N ఈ వాడుకరి మాతృభాష తెలుగు.
en-4 This user has near native speaker knowledge of English.
భాషల వారీగా వాడుకరులు
  ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
  ఈ సభ్యుడు వికీపీడియాలో గత
10 సంవత్సరాల, 11 నెలల, 12 రోజులుగా సభ్యుడు.
  • 2001 లో మూడు బిందువులు పేరుతో ఒక హైకూ సంకలనం
  • 2012లో మట్టివేళ్ళు పేరుతో కవిత్వ సంకలనం వెలువరచాను
  • 2015 లో ఖమ్మంజిల్లా కూసుమంచిలోని చారిత్రక శివాలయం పై చరిత్రకందని శైవక్షేత్రం కూసుమంచి గణపేశ్వరాలయం పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరిచాను
  • అంతర్లోచన పేరుతో ఒక బ్లాగును నిర్వహిస్తున్నాను. దానిలో నేను తెలుగులో రాసుకునే కవిత్వంతో పాటు. నాకు నచ్చిన వ్యాసాలనూ విశేషాలనూ చేర్చుతుంటాను.

చిత్రమాలిక

మార్చు

బయటి లింకులు

మార్చు

నచ్చిన పద్యం

మార్చు
ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు
చూడజూడరుచుల జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ! వినురవేమ!

—యోగి వేమన

వికీ సంతకాలు

మార్చు

వికీ ఈనాటి చిట్కా

మార్చు
ఈరోజు : శుక్రవారం
తేదీ : 13
నెల : డిసెంబరు
ఈ నాటి చిట్కా...
 
Weasel Words వాడవద్దండి


సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid weasel words చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



సోదర ప్రాజెక్టులు
 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
 
వికీసోర్స్ 
మూలాలు 
 
వికీడేటా 
వికీడేటా 
 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
 
విక్షనరీ 
శబ్దకోశం 
 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.