చర్చ:కే

తాజా వ్యాఖ్య: వ్యాసానికి పేరు టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


విషయ సేకరణ

మార్చు

ఈ వ్యాసం వ్రాయటానికి ముఖ్య విషయాలు, కార్టూన్లు K గారు స్వయంగా మైలు ద్వారా పంపారు. ఈ వివరాలు సంపాయించటానికి ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారు మంచి సహాయం చేశారు. వీరిద్దరికీ నా కృతజ్ఞతలు.--S I V A 00:58, 10 ఫిబ్రవరి 2009 (UTC)Reply

వ్యాసానికి పేరు

మార్చు

ఆంగ్ల భాషలో తెలుగు వికీలో పేజీ పేరు ఉండకూడదని ఒక నియమం. స్వచ్ఛమైన సజ్జా కృష్ణగా వ్యాసం పేరు మారిస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నాను.Rajasekhar1961 03:34, 9 ఫిబ్రవరి 2009 (UTC)Reply

ఈ కార్టూనిస్ట్ తెలుగులో కార్టూన్లు వేసిన ప్రముఖులలో ఒకరు. వీరి కలంపేరు K ఆ పేరుతోనే అదరికీ పరిచయం.సజ్జా కృష్ణ అని ఒక పేజీ సృష్టించి అక్కడనుండి దారిమార్పు ఏర్పరిచాను. కొంతమంది ప్రముఖుల గురించి వ్రాస్తున్నప్పుడు కొంచెం పట్టువిడుపులు ఉండాలని నా ఉద్దేశ్యం. వికీలో వ్యాసాలు నలుగురికీ తెలియటానికి, ఒట్టి నియమాలపాలనకోసం కాదుకదా. నియమాపాలన అవసరమే కాని మరొకసారి చెప్పదలుచుకున్నాను కొంచెం అప్పుడప్పుడు సడలింపు కూడ ఉండాలి.--S I V A 17:31, 9 ఫిబ్రవరి 2009 (UTC)Reply
ఇతను K గా ప్రసిద్ధుడైతే తెలుగులో కె గా వ్యాసం పేరు ఉండటం సముచితం. ఆంగ్ల (K) అక్షరం వ్యాసం పేరుగా ఉండే అవసరం లేదనుకుంటా! -- C.Chandra Kanth Rao-చర్చ 20:14, 9 ఫిబ్రవరి 2009 (UTC)Reply
మన వికీలో అనేక వ్యాసాలు ఆంగ్ల నామంతోనే ఉండి, వ్రాసినప్పుడు మాత్రం తెలుగు లిపిలో ఉన్నవి ఉన్నాయి. వాటితో పోలిస్తే ఈ వ్యాసానికి "K"అని పేరు పెట్టడంలో మన విలువైన నియమాలకు ఏమీ భంగం కలగలేదని నా అభిప్రాయం. ముఖ్యమైన విషయం ఇంతవరకు ఎవరికీ తెలియని కార్టూనిస్టుల గురించి అనేక వివరాలు, ఫొటొలు, వారి వారి కార్టూన్లు సేకరించి (వారి అనుమతితో)వ్యాసం వ్రాయటం. వ్యాసానికి పేరు విషయంలో చిన్న సడలింపు. వ్యాసం పేరు మార్చటానికి నేను వ్యతిరేకం, ఎందుకంటే వీరి అసలు పేరుతో సజ్జా కృష్ణ నియమబద్ధంగా పుట ఇప్పటికే ఏర్పరచటం జరిగింది, ఈ వ్యాసానికి అక్కడనుండి దారి మార్పు కూడ ఏర్పరచటం జరిగింది.--S I V A 00
54, 10 ఫిబ్రవరి 2009 (UTC)
  • సడలింపు సమంజసమే. ఇలాగే ఉంచుదాము. శివగారి సెంటిమెంట్లను దెబ్బతీస్తే క్షమించమని మనవి.Rajasekhar1961 04:56, 10 ఫిబ్రవరి 2009 (UTC)Reply
  • రాజశేఖర్‌గారూ!క్షమించటం వంటి పెద్ద మాటలు వద్దండీ. మనం అందరం కలసి చేస్తున్న సమిష్టి కృషి మన వికీ. నాబాధ అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదములు. నా సెంటిమెంటు ఏమీలేదు ఇందులో. తెలుగు వ్యాసానికి ఆంగ్ల పేరు పెట్టటానికి నేను అసలు అంగీకరించను. కాని, ఇక్కడ పరిస్థితి అలా వచ్చించిది. సజ్జా కృష్ణ గారు వారి కార్టూన్లు అన్నిటికి K అని మాత్రమే సంతకం పెట్టెవారు. దాదాపు కార్టూనిస్టులందరూ వారి వారి కలంపేర్లతోనే ప్రసిద్ధులు. వారి అసలు పేర్లతో వ్యాసాలు వ్రాస్తే వారిగురించి తెలుసుకుందామని వికీలోకి వచ్చేవారికి దొరకరు. తెలిసినవారికి కూడ ఆ వ్యాసం అనుకోకుండా కాకతాళీయంగా తగిలినా అసలు పేరుతో గుర్తుపట్టలేరు. వ్యాసానికి పేరు కొంత అలోచన చేసిన మీదటనే, కార్టూనిస్టులందరి గురించి వ్రాశేటప్పుడు వారి కలం పేరునే వ్యాసాలకు పెట్టడం జరిగింది. ఈ విషయం మీద రాజశేఖర్‌గారు-నేను కొంత చర్చించటం జరిగింది, జయదేవ్ వ్యాస చర్చా పుటలో. అప్పుడు రాజశేఖర్‌గారు, అసలు పేరుతో వ్యాస పుట ఏర్పరిచి కలం పేరున ఉన్న వ్యాసానికి దారి మళ్ళింపు ఏర్పరిచారు. తరువాత వ్రాసిన వ్యాసాలకు నేనుకూడ అదేపద్ధతి అవలింభించాను. ఈ వ్యాసానికి కూడ అదే జరిగింది. కాకపోతే వ్యాసం పేరు ఆంగ్ల అక్షరంతో ఉన్నది. సడలింపుకు అంగీకరించినందుకు మరొక్కసారి ధన్యవాదములు.--S I V A 16:28, 10 ఫిబ్రవరి 2009 (UTC)Reply
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:కే&oldid=840221" నుండి వెలికితీశారు
Return to "కే" page.