చర్చ:గంగుడుపల్లి
తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Ahmadnisar
Untitled
మార్చుగ్రామాలు గురించిన వ్యాసాలకు ఇన్‌ఫోబాక్స్‌లు ప్రయోగిస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. తె.విలో ఎక్కువ గ్రామాలు గురించిన వ్యాసాలు ఉండగా ఇలా ఇన్‌ఫోబాక్స్‌ను ప్రయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్రమాలు గురించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఇన్‌ఫోబాక్స్‌లో ఉండొచ్చు. ఉదా|| పేరు,జిల్లా,దగ్గర ఉండే ముఖ్యమైన ఊరి దూరం etc. దీని ప్రయోగించడం వల్ల వ్యాసాలలో ఒక స్టాండర్డ్ మరియు యూనిఫార్మిటీ వస్తుంది వినోద్ 15:24, 22 జనవరి 2008 (UTC)
- చాలా పేర్లు డిసాంబిగ్యుయేట్ (అమోమయ నివృత్తి) చేయాల్సి వచ్చింది. అవన్నీ పూర్తయిన తర్వాత. వీటి జనాభా లెక్కలు మొదలైన గణాంకాలతో ఈ సమాచారపెట్టెలను బాటు ద్వారా అన్ని గ్రామాలకు చేర్చాలని ఆలోచన ఉంది. ఇంకో రెండు నెలల్లో అది ప్రారంభిస్తాం --వైజాసత్య 16:00, 22 జనవరి 2008 (UTC)
- గ్రామ వ్యాసాలకు ఇన్స్ఫోబాక్స్ చేర్చడమన్నది మంచి ఆలోచన. గ్రామ జనాభా, మండల కేంద్రం నుంచి మరియు జిల్లా కేంద్రం నుంచి దూరం, ఆ గ్రామం ఏ పంచాయతీ పరిధిలో ఉన్నది, ఇది ఏ అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గంలో భాగం మున్నగునవి బాక్స్‌లో చేర్చవచ్చు. దీనివల్ల గ్రామ వ్యాసాలు కూడా ఆకర్షణీయంగా తయారౌతాయి.--C.Chandra Kanth Rao 18:47, 22 జనవరి 2008 (UTC)
- అవునండి, గ్రామాలకు ఇన్ఫోబాక్స్ వుంచడం వల్ల 'సాధారణ పరిజ్ఞాన పరిధి' ఏర్పరచవచ్చు. అలానే అన్ని గ్రామాలకూ ఒక నిర్ణీత "ఫార్మేట్" ను ఏర్పరిస్తే, రచయితలు వాటిని పూరించగలరు. ఉదాహరణకు: జిల్లా>రెవెన్యూ డివిజన్>మండల>గ్రామపంచాయతీ>గ్రామం; భౌగోళికం; చరిత్ర; జనాభా; విద్య, సాంఘీక విషయాలూ; మతపరమైన విషయాలూ; నదులు; పంటలు; పరిశ్రమలు; రాజకీయాలూ; సంస్థలూ; వ్యక్తులూ; మరియు ఇతరములు. దీనికన్నా ఎక్కువ సమగ్ర సమాచారాలుంచగోరేవారూ సమాచారాన్ని వ్రాసి వాటిని విస్తరించగలరు. nisar 17:14, 28 ఏప్రిల్ 2008 (UTC)