చర్చ:గాజుల లక్ష్మీనర్సు శెట్టి

వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


గాజుల లక్ష్మీనర్సు శెట్టి గారు స్వాతంత్ర సమరయోధులా? మార్చు

గాజుల లక్ష్మీనర్సు శెట్టి గారు చెన్నపట్టణంలో 19వ శతాబ్ది తొలి అర్థభాగంలోనే పౌరహక్కుల చైతన్యాన్ని కలిగించిన మహనీయులు. ఆయన ఆంగ్ల విద్యాభివృద్ధి కోరి, ఆంగ్ల విద్య దక్షిణ భారతదేశంలో ఏర్పడడానికి తనవంతు కృషి చేశారు. ఐతే వారిని స్వాతంత్ర సమరయోధులని చెప్పడం అతిశయోక్తి అవుతందని నా నమ్మిక. ఎందుకంటే అప్పటికి స్వాతంత్రానికి సంబంధించిన ఏ అంశమూ స్పష్టం కాలేదు. అప్పటికి స్వాతంత్ర సమరయోధులని చెప్పదగ్గవారు బ్రిటీష్ ఈస్టిండియాకు వ్యతిరేకంగా యుద్ధాలు చేసి మరణించిన సంస్థానాధీశులు, సైనికులు, 1857 విప్లవంలో పాల్గొన్నవారు వగైరా. పౌరహక్కుల ఉద్యమాన్ని లేవదీసినవారు అన్నదేమీ తక్కువ విషయం కాదు కదా. ఆయనకున్న గౌరవాన్ని పక్కనపెట్టేసి లేని గొప్పదనాలు తగిలించడం వల్ల చారిత్రికంగా లక్ష్మీనర్సు శెట్టిగారికి చేసేది అవమానమే. కనుక నేను ఆయన గురించి స్వాతంత్రసమరయోధుడు అన్న భాగాన్ని పౌరహక్కుల నాయకుడు అనో, రాజకీయ నేత అనో మారుస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 11:42, 30 డిసెంబరు 2014 (UTC)Reply

క్షమించాలి. కొంత ఆయన గురించి పరిశోధించిన మీదట స్వాతంత్ర సమరయోధులనే విషయం తెలిసింది. సహసభ్యులకు క్షమాపణలు. ఆయన స్వాతంత్ర సమరయోధులన్న విషయాన్ని విశదీకరిస్తూ నేనే ఓ విభాగాన్ని వ్రాస్తాను.--పవన్ సంతోష్ (చర్చ) 11:49, 30 డిసెంబరు 2014 (UTC)Reply
Return to "గాజుల లక్ష్మీనర్సు శెట్టి" page.