వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి

శుద్ధి పరచిన (చాలావరకు ఒకేపుస్తకకూర్పుకు స్కాను నకళ్లు తొలగించిన) జాబితా archive.org లో తాజాచేయబడింది. --అర్జున (చర్చ) 16:41, 1 డిసెంబరు 2018 (UTC)
శుద్ధి పరచిన మొత్తం జాబితా వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI final catalogueచూడండి.[ప్రత్యుత్తరం]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్‌సైటులో ఉన్న తెలుగు పుస్తకాలను డీఎల్‌ఐ పేజీలకు లింకులతో సహా జాబితా రూపొందించి, ఆ జాబితాను తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచేందుకు, కొత్త వ్యాసాలు రూపొందించేందుకు ఉపయోగించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ లక్ష్యాలు సాధించేందుకు మార్గదర్శక పేజీగా దీన్ని వాడదలిచాము. ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా DLI లోని తెలుగు పుస్తకాల జాబితాను అభివృద్ధి చేసి, దానిలోని సమాచారంతో తెవికీలో వ్యాసాలను అభివృద్ధి చేస్తాము.

ప్రాజెక్టు ప్రయోజనం

మార్చు

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పాతిక వేలకు పైగా తెలుగు పుస్తకాలు ఉచితంగా చదువుకునేందుకు వీలుగా ఉన్నాయి. ప్రాజెక్టు నిర్వాహకులు వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టులోని పుస్తకాలన్నీ కాపీరైట్ లేనివే అవుతాయి. కానీ, కొన్ని పుస్తకాలు కాపీరైట్ ఉన్నవి కాగా వాటి రచయితల నుండి అనుమతులు సంపాదిస్తున్నారని తెలిపారు. ఇంత ప్రయోజనకరమైన వెబ్‌సైటును వికీమీడియన్లు ఉపయోగించుకుంటే తెలుగు వికీపీడియా, తెలుగు వికీసోర్స్, తెలుగు వికీకోట్స్, తెలుగు విక్ష్నరీ బాగా అభివృద్ధి చెందుతాయి.
దురదృష్టవశాత్తూ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అపురూపమైన గ్రంథాలు ఉన్నా వాటి పేర్లు, రచయితల పేర్లు, వివరాలు వంటివి వెబ్‌సైట్‌లో పొందిపరిచిన తీరు సరిగా లేదు. తెలుగులో సరళమైన పేరును లిప్యంతరీకరణ(ట్రాన్స్‌లిటరేషన్) చేసేవారు తెలుగు వారికి అర్థం కాని విధంగా, సెర్చ్ ద్వారా వెతుక్కోవడానికి సాధ్యం కాని విధంగా తయారు చేశారు. ఒక్కో పుస్తకాన్ని తెరిచి మొదటి పదిపేజీలు డౌన్‌లోడ్ చేసుకుని చదివితే కానీ పుస్తకం పేరు, రచయిత పేరు తెలియని స్థితి నెలకొంది. అందువల్ల ఈ పుస్తకనిధి నుంచి ప్రయోజనాలు రాబట్టుకోలేకపోతున్నాం.
ఈ ప్రాజెక్టు ద్వారా DLI లోని తెలుగు పుస్తకాల జాబితా పేజీలో ఎంచుకున్న పుస్తకాలకు వివరాలతో కాటలాగ్(పుస్తకాల జాబితా) తయారు చేస్తాం. ఆ వివరాల్లో పుస్తకం పేరు, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా(డీఎల్‌ఐ) లింకు, రచయిత/సంపాదకుని పేరు, విభాగం(కాటగిరీ), పుస్తకంలోని సమాచారం గురించి క్లుప్తంగా వివరాలు, డీఎల్‌ఐ వారు పుస్తకానికి ఇచ్చిన కోడ్, పుస్తకం ముద్రింపబడిన తేదీ ఉంటాయి. అలాగే కొందరు వికీపీడియన్లు తెవికీలో ఈ పుస్తకాల్లోని సమచారం ఉపయోగించి వ్యాసాలను అభివృద్ధి చేయడం, కొత్త వ్యాసాలు తయారుచేయడం చేస్తారు.

ఏం చెయ్యాలి

మార్చు

జాబితా పని

మార్చు
 • తెలుగు వికీపీడియాలోని DLI లోని తెలుగు పుస్తకాల జాబితా సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన వివిధ జాబితాలు(అకార క్రమంలో) వాటిలో ఇచ్చిన ఆప్షన్లు గమనించండి.
 • డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల కోసం వెతికి జాబితాలో పొందుపరచని మంచి పుస్తకం ఏదైనా ఉంటే దాన్ని వేరే టాబ్‌లో తెరవండి.
 • ఆపైన పుస్తకం పేజీలు తెరిచి వివరాల కోసం కొన్ని పేజీలు డౌన్లోడ్ చేయండి. వాటిలోని పుస్తకం పేరు, రచయిత పేరు చూసి ఇక్కడ పొందుపరుస్తూ, పుస్తకానికి చేరేందుకు లింకు కూడా జాబితాలో ఇవ్వండి.
 • పుస్తకం ముందుమాట, విషయసూచిక చదివి అర్థమైనంత మేరకు పుస్తకం ఏ విభాగానికి చెందినది, పుస్తకంలో ఇచ్చిన సమాచారం ఏమిటి అన్నవి రాసే ప్రయత్నం చేయండి. అలాగే అక్కడే పుస్తకానికి డీఎల్‌ఐ వారు ఇచ్చిన మెటాడేటాలో కోడ్, ప్రచురించిన సంవత్సరం చూసి వికీపేజీలో రాయండి.

ముఖ్య గమనిక: ఈ ప్రాజెక్టు పని కోసం రాసేప్పుడు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారు పుస్తకం పేజీల్లో ఇచ్చిన సమాచారం ఏమాత్రం విశ్వసించకండి. పుస్తకం పేజీల్లో ఉన్న సమాచారం మాత్రమే నమ్మి జాబితాలో చేర్చండి.

జాబితా ఉపయోగించి తెవికీని అభివృద్ధి చేసే పని

మార్చు

తెలుగు వికీపీడియాలో సమాచారం చేర్చేందుకు ఉపయోగించే ఎన్నో పుస్తకాలను ఈ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి తెచ్చుకుంటున్నాం. కనుక ఆ పుస్తకాల జాబితా నుంచి డీఎల్‌ఐ పేజీకి వెళ్ళి పుస్తకంలోని పేజీలు దిగుమతి(డౌన్లోడ్) చేసుకుని చక్కని వ్యాసాలు రాయవచ్చు. ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేయవచ్చు.

 • మీకు ఆసక్తికరంగా అనిపించిన పుస్తకాన్ని DLI లోని తెలుగు పుస్తకాల జాబితాలో చూసి అక్కడ ఇచ్చిన బయట లంకె(ఎక్స్‌టర్నల్ లింక్) ద్వారా నేరుగా డీఎల్‌ఐలో ఆ పుస్తకం పేజీకు చేరుకోండి.
 • అది పుస్తక సమాచారం నిక్షిప్తం చేసిన పేజీ. ఆ పేజీలో BookReader-1 అని వున్న దగ్గరకు వెళ్ళి Click hereని క్లిక్ చేయండి. దానివల్ల మీరు పుస్తకాలు తెరిచేందుకు పెట్టిన పేజీలోకి వెళ్తారు. క్రింద PTIFF లేదా HTML లేదా TXT లేదా RTF లేదా Meta అని ఉంటుంది. అక్కడకు వెళ్ళి PTIFFను ఎంచుకుంటే పేజీని డౌన్‌లోడ్ చేస్తుంది. పక్కనే ఉన్న ఆప్షన్ ద్వారా వరుసగా పేజీలన్నీ విడివిడి డౌన్లోడ్లుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు.
 • ఒక్కోపేజీని చదువుతూ, వివరాలు తెలుసుకుంటూ తెలుగు వికీపీడియా, విక్ష్నరీ, వికీకోట్స్‌ మొదలైన ప్రాజెక్టుల్లో వ్యాసాలు రాసి, ఉన్న వ్యాసాలు అభివృద్ధి చేసి ప్రాజెక్టుకు తోడ్పడవచ్చు.
 • ఈ ప్రాజెక్టు ద్వారా మీరు అభివృద్ధి చేస్తున్న వ్యాసాల చర్చ పేజీల్లో ప్రాజెక్టు మూసను పెట్టగలిగితే, మీతో పాటు ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్న వారంతా తెలుసుకుని మీ కృషిలో మరింత తోడ్పడే వీలుంటుంది.

పని విభజన

మార్చు

ఈ ప్రాజెక్టులో పాలుపంచుకునే వికీపీడియన్లు తమకు ఆసక్తి వున్న పనిని స్వీకరించండి. ఆ క్రమంలో కింద బాధ్యతవహించే వికీపీడియన్లు అన్న వరుసలో మీకు ఆసక్తివున్న పని వద్ద సంతకం(~~~~) చేయండి. ప్రక్కగడిలో మీరు ఎంచుకున్న పని విషయంలో సూచనలు ఏమైనా ఉంటే చేయండి. ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య ప్రతిపాదనలలో, నిర్వహణ ప్రణాళికలో పాలుపంచుకునేందుకు ప్రాజెక్టు చర్చ పేజీని ఉపయోగించండి.

చేయాల్సిన పని బాధ్యత వహించే వికీపీడియన్లు సలహాలు/సూచనలు
డీఎల్‌ఐ పుస్తకాలను జాబితాలో చేర్చడం పవన్ సంతోష్ (చర్చ) 04:31, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం] --
జాబితాలోని పుస్తకాల పేజీల సృష్టి/అభివృద్ధి Rajasekhar1961 (చర్చ) 05:07, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
జాబితాలో ప్రస్తావించిన రచయితల పేజీల సృష్టి/అభివృద్ధి
జాబితాలోని పుస్తకాలను ఉపయోగించి వేర్వేరు పేజీలను అభివృద్ధి చేయడం
కాపీరైటు లేని పుస్తకాలను వికీసోర్సులో చేర్చడం Rajasekhar1961 (చర్చ) 05:07, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వికీసోర్సులో ప్రాజెక్టు ద్వారా చేర్చిన పుస్తకాలను టైప్ చేయడం
ఎడిట్-అ-థాన్ల నిర్వహణలో పాలుపంచుకోవడం పవన్ సంతోష్ (చర్చ) 04:47, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఫేస్‌బుక్, బ్లాగ్, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియాల్లో ప్రాజెక్టుకు ప్రాచుర్యం కల్పించడం * పవన్ సంతోష్ (చర్చ) 04:40, 28 జూలై 2014 (UTC),* Pranayraj1985 (చర్చ) 04:45, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం] ఫేస్‌బుక్‌లో వికీపీడియన్లు నాటక రంగం, సినీరంగం, సాహిత్యం, మొదలైన గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. వారు ప్రతీరోజూ జాబితాలో జరుగుతున్న మార్పులు చూసి ఆయా గ్రూపుల సభ్యులకు ఆసక్తికరమైన పుస్తకాల డిస్క్రిప్షన్‌తో జాబితా పేజీల లింకును పోస్ట్ చేయవచ్చు.
ప్రసార మాధ్యమాలు, సాహిత్య పత్రికల్లో ప్రాజెక్టుకు ప్రాచుర్యం కల్పించడం పవన్ సంతోష్ (చర్చ) 04:47, 28 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

జాబితా కోసం పుస్తకాల ఎంపిక

మార్చు

డి.ఎల్.ఐ.లో పుస్తకాలను తెలుగు వికీపీడియాలోని జాబితాకు ఎక్కించేందుకు ఎంచుకునేప్పుడు ఈ క్రింది విషయాలు మీకు ఉపకరించవచ్చు:

 • పుస్తకాలన్నీ కాపీరైట్ లేనివేనని డీఎల్‌ఐ వారు చెప్తున్నా కాదని కొందరు అంటున్న నేపథ్యంలో వీలున్నంతలో మరీ కొత్త పుస్తకాలు ఎంచుకోకపోవడమే ఉత్తమం. ఐతే మరీ మంచి పుస్తకం, తెలుగు వికీపీడియా అభివృద్ధికి బాగా దోహదపడుతుందనుకున్న పుస్తకం ఐతే ఎప్పుడు ప్రచురణ ఐనా వదిలిపెట్టవద్దు. ఎందుకంటే వికీపీడియాలో కేవలం లంకెలు ఇచ్చి వివరాలు మాత్రమే ఇస్తున్నాం. నేరుగా పుస్తకాన్ని పెట్టలేదు. కనుక కాపీరైట్ లేని పుస్తకాలు చేర్చినా సమస్యలేని విధంగానే విడివిడి పేజీలుగా డీఎల్‌ఐ వారు పెట్టారు. కాపీరైట్ సమస్య ఉత్పన్నం కాదు. కాకపోతే కాపీరైట్ లేని పుస్తకాలు కాని పక్షంలో వికీపీడియా, విక్షనరీ, వికీకోట్స్‌కు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప వికీసోర్స్‌ను సుసంపన్నం చేసేందుకు పనికిరావు.
 • వికీమీడియా ఉద్యమానికి పూర్తిస్థాయిలో అక్కరకు వచ్చే విజ్ఞానసర్వస్వ సమాచారంతో నిండిన పుస్తకాలే ముందుగా జాబితా చెయ్యండి. చరిత్ర గ్రంథాలు, జీవితచరిత్రలు, వ్యాస సంకలనాలు, ఆత్మకథలు వంటి కాల్పనికేతర సాహిత్యమే విజ్ఞానసర్వస్వ వ్యాసాలు తయారుచేయడానికి పూర్తిస్థాయిలో పనికి వస్తుంది. నవలలు, కథలు, కవితా సంకలనాలు, పద్యకావ్యాలు వంటి కాల్పనిక సాహిత్యం పూర్తిగా విజ్ఞానసర్వస్వ నిర్మాణానికి పనికిరాదనడం కుదరదు కానీ కొన్ని రకాల వ్యాసాలే అభివృద్ధి చేయడం కుదురుతుంది. ఉదాహరణకు కాకతీయ సంచిక అనే పుస్తకం వల్ల కాకతీయుల కాలం నాటి సాంఘిక, రాజకీయ విధానాల గురించి ఎంతో సమాచారం చేర్చగలం. అదే ఏదైనా కాకతీయుల కాలం నాటిని వర్ణించిన చారిత్రిక నవలను అలా ఉపయోగించుకోలేం. కానీ ఇదే అంతటికీ వర్తిస్తుందనుకోవడమూ సరైంది కాదు. తిరుపతి వెంకట కవుల పద్యనాటకాలు, శ్రీనాథుని కావ్యాలు వంటి సుప్రసిద్ధి పొందిన పుస్తకాలను చేర్చడం వల్ల వికీసోర్సు సుసంపన్నమవుతుందని గుర్తుంచుకోవాలి.
 • కొత్తకలం: వికీపీడియన్లు రాజశేఖర్, ప్రణయ్ రాజ్ గార్ల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న మీదట వికీపీడియాకు అక్కరకు వచ్చేవన్నీ కాల్పనికేతర సాహిత్యమే కాదని గుర్తించినాకా మిగిలినవి కూడా చేర్చడం జరుగుతోంది. ప్రస్తుతం వైజాసత్య గారు ఏకంగా ఈ ప్రాజెక్టును డిజిటల్ లైబ్రరీలోని అన్ని పుస్తకాలకూ విస్తరిద్దామని సూచించారు కనుక పై ప్రాతిపదికలు ప్రస్తుతానికి పక్కన పెట్టి దేన్నైనా చేర్చవచ్చు. ఇక కాపీహక్కులు లేని పుస్తకాలు వికీసోర్సులోకి ఉపయోగపడవన్న మాటే గానీ వికీపీడియా వ్యాసాల అభివృద్ధికి చాలా వినియోగపడగలవని విశ్వనాథ సత్యనారాయణ జీవితం సాహిత్యం, గ్రామాల వ్యాసాల్లో గ్రామనామ వివరణలు వగైరా ఉప ప్రాజెక్టుల ద్వారా నిరూపణ అయినపిమ్మట పుస్తకాల ఎంపిక విషయంలో ఎవరికీ సూచనలు లేవు.

ప్రాజెక్ట్ సభ్యులు

మార్చు

ఆసక్తి ఉన్న సభ్యులందరూ ఈ ప్రాజెక్టులో చేరి తమ కృషిని క్రమబద్ధీకరించి మరిన్ని సత్ఫలితాలు సాధించే ప్రయత్నం చేయండి. ఈ ప్రాజెక్టులో చేరాలంటే ఉదాహరణకు {{సభ్యుడు|శ్రీశ్రీ|పేరు}} అని చేరిస్తే మీరు ప్రాజెక్టులో చేరినట్టే. ఆపై లక్ష్యాలను గమనించి కృషి ప్రారంభించెయ్యండి.(షరా:మీరు ప్రాజెక్టుకు సంబంధించిన వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు, కొత్త పేజీలు చేర్చేందుకు ఈ ప్రాజెక్టులో సభ్యత్వం స్వీకరించాల్సిన పనేమీ లేదని గుర్తుపెట్టుకోండి)

సహకరిస్తున్న మరికొందరు వికీపీడియన్లు:
పైన పేర్కొన్న వ్యక్తులే కాక ఈ ప్రాజెక్టు విషయంలో చక్కని కృషి చేస్తున్న వికీపీడియన్లు మరికొందరు ఉన్నారు. ఐతే వారు పైన సభ్యత్వం నమోదు చేసుకోలేదు. వారికి ఉన్న ఆ హక్కును గౌరవిస్తూనే, కేవలం రికార్డు కోసం కింద వారి పేర్లు పేర్కొంటున్నాను. ఒకవేళు వారు పైన భవిష్యత్తులో నమోదు చేసుకునేట్టయితే కింద పెట్టిన పేర్ల లోంచి తమ పేర్లు తొలగించవచ్చు.

 • మీనా గాయత్రి : జాబితాల్లో పుస్తకాలు చేర్చడం, సంబంధిత వివరాలతో పేజీలు రాయడం వగైరా
 • వెంకటరమణ : సాంకేతిక సహకారం
 • స్వరలాసిక : ప్రధానంగా జాబితా అయిన పుస్తకాలలోని వివరాలు సేకరించి వాటితో వ్యాసాలు సృష్టించడం. జాబితాలో పుస్తకాలు చేర్చడం.
 • ప్రణయ్ రాజ్ : సామాజిక మాధ్యమాలలో ప్రచారం.
 • విశ్వనాధ్.బి.కె. : ఎడిట్-అ-థాన్ నిర్వహణలో సహకారం.
 • పాలగిరి : ఎడిట్-అ-థాన్ నిర్వహణలో సహకారం.

ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు

మార్చు

జాబితాలు

మార్చు

ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా అభివృద్ధి చేయాల్సిన పేజీలు ఇవి: వర్గం:డిజిటల్_లైబ్రరీ_ఆఫ్_ఇండియాలోని_తెలుగు_పుస్తకాల_జాబితా

వికీలలో మిగిలిన పేజీలు

మార్చు

ఈ జాబితాను ఉపయోగించి తెలుగు వికీపీడియాలోని పలు వ్యాసాలు, వికీసోర్సులో పుస్తకాలు, వికీకోట్సులో వ్యాసాలు, విక్ష్నరీలో పదాలు అభివృద్ధి చేయవచ్చు. తెలుగు వికీపీడియాలో ఈ జాబితాలోని పుస్తకాలను, జాబితాలోని సమాచారాన్ని ఉపయోగించి సృష్టించే/అభివృద్ధిచేసే పేజీల చర్చా పేజీల్లో {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}} అన్న మూస పెడితే సహ వికీపీడియన్లకు ఉపయుక్తంగా ఉంటుంది.

ప్రాజెక్టు మూసలు

మార్చు
 • ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసే అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాక దీనికి సంబంధించిన వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.
 • ఈ ప్రాజెక్టులో వ్యాసాల నాణ్యతను పరిశీలించి మూసలో వివిధ తరగతులను చేర్చవలసి ఉంటుంది. వ్యాసం యొక్క నాణ్యత పరిశీలించి వాటి నాణ్యత ప్రకారం మూసను ఈ క్రింది విధంగా చేర్చాలి.
తరగతి చర్చా పేజీలో ఉంచవలసిన మూస
మొలక {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=మొలక}}
ఆరంభ {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=ఆరంభ}}
మంచిఅయ్యేది {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=మంచిఅయ్యేది}}
మంచివ్యాసం {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=మంచివ్యాసం}}
విశేషంఅయ్యేది {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=విశేషంఅయ్యేది}}
విశేషవ్యాసం {{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=విశేషవ్యాసం}}

ఉదాహరణ

మార్చు

మంచివ్యాసం తరగతి మూస అయితే,

  ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
 
హెచ్చరిక: ప్రస్తుతం ఈ మూసను ఒక చర్చాపేజీ కాని పేజీలో ఉంచారు. ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే ఉంచాలి.
  మంచివ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ప్రాజెక్టు సభ్యుల పేజీలలో వాడవలసిన మూస

మార్చు

ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న సభ్యులు తమ వాడుకరి పేజీల్లో {{మూస:తెలుగు సమాచారం అందుబాటులోకి}} అన్న మూసను పెట్టుకోవడం ద్వారా మీ పేజీ ఈ ప్రాజెక్టు సభ్యుల వర్గీకరణలోకి చేరుతుంది. ఈ ప్రాజెక్టు సభ్యత్వ మూసలో అయ్యంకి వెంకటరమణయ్య ఫోటో ఉపయోగిస్తున్నాము. ఆయన తెలుగునాట గ్రంథాలయోద్యమ పితామహుడన్న పేరుపొందిన వ్యక్తి. పుస్తక విజ్ఞానం అందరికీ అందుబాటులోకి రావాలన్న సంకల్పంతో ఊరూరా తిరిగి అక్కడి యువతను, పెద్దలను ఉత్సాహపరిచి గ్రంథాలయాలను ఏర్పాటుచేయించారు. గ్రంథాలయ వారోత్సవాలు వంటి కార్యక్రమాలు ఇప్పటికీ ఆయన జయంతి నాడు ప్రారంభమవుతాయి. అటువంటి మహనీయుని స్ఫూర్తితో ఈ ప్రాజెక్టు అంతర్జాల గ్రంథాలయాలను అభివృద్ధిచేయాలని ఆయన ఫోటోను వారికి గౌరవంగా ఉపయోగిస్తున్నాము. {{తెలుగు సమాచారం అందుబాటులోకి}}

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు