చర్చ:చందమామలో బేతాళ కథలు
తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
వ్యాసం క్రమం
మార్చు- బేతాళకథలకు చివరి కథ ఉన్నదా. ఉంటే ఆ కథ ఏమిటి.
- చందమామలో వేసిన బేతాళకథలలో అత్యున్నతమయినవి ఎంచి, వాటి గురించి క్లుప్తంగా వ్యాసంలో వ్రాయగలమా
పైన ఉదహరించిన విషయాల గురించి సభ్యులు వువరములు వ్యాసములో పొందుపరచగలరు--SIVA 20:18, 19 మార్చి 2008 (UTC)
- తప్పకుండా వ్రాయవచ్చును. మీకు తెలిసినంత వరకు వ్రాయండి. మిగిలినవి ఎవరో ఒకరు వ్రాస్తారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:38, 20 మార్చి 2008 (UTC)
- బేతాళ కథల గురించి వ్యాసం కొంతవరకు పూర్తి చేసాను. నా దగ్గర ఉన్న బొమ్మలు జత పరిచాను.చందమామ పుటనుండి లింక్ ఉన్నది. దయచేసి చూసి, మీ అభిప్రాయం, సూచనలు చెప్పగలరు.--SIVA 20:04, 19 మార్చి 2008 (UTC)
వ్యాసం పేరు
మార్చుశివా! బేతాళ కథలు లేదా భేతాళ కధలు - ఏది సరైన పేరు? ఒకమారు చందమామలో ఉన్న సరైన స్పెల్లింగ్ చూసి చెప్పండి. కధలలో చివర ఉండే బొమ్మగా అన్ని బొమ్మలు ఉండడం (నాకు) బాగులేదు. అన్ని బొమ్మలనూ కలిపి ఒక చిత్రంగా తిరి త్వరలో లోడ్ చేస్తాను. పోల్చి చూసి నిర్ణయం తీసుకోవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:38, 20 మార్చి 2008 (UTC)
- కాసుబాబుగారూ! బేతాళ కథలు సరైన పేరు. అందులో బే కు వత్తు లేదు.
- కథ చివర బొమ్మలను కలిపి ఒకటిగా చేసి ఒకే చిత్రం చెయ్యటం మంచి ఆలోచన. నేనుకూడా పయత్నింస్తున్నాను,--SIVA 11:59, 20 మార్చి 2008 (UTC)
- నా బాల్యంలో చందమామ చదివేటప్పుడు, 'భేతాళ కథలు' అని చదివినట్టు గుర్తుంది. అలాగే కొన్ని తెలుగు సినిమాలలో "భేతాళ" అని పలికినట్టు విన్నాను. కాని ప్రస్తుతం చందమామ లో 'బేతాళ కధలు' అని వ్రాసి వున్నది.[1] ::: 'భేతాళ' కు బదులు 'బేతాళ' అని, 'కథ' కు బదులు 'కధ' అని వున్నది. పరిశీలించి, సరైన పేరు పెట్టడం సమంజసం. స్పెల్లింగ్స్ లో పాతతరమే బెస్ట్. ఈ తరం, పాతతరాన్ని అనునయించడమే మంచిది. nisar 20:11, 13 ఏప్రిల్ 2008 (UTC)
- స్పెల్లింగ్స్ లో పాతతరమే బెస్ట్. - క్రొత్త తరానికి స్పెల్లింగులు అనే కాన్సెప్టు లేదు లెండి. ఒకసారి మీ పిల్లలు ఫోన్లలో పంపుకొనే SMS లు చూస్తే ఈ విషయం ఒప్పుకొంటారు. అయినా "చందమామ" పుస్తకంలో ఇప్పుడు వాడుతున్న విధంగా వాడడమే బెటరు అనుకొంటాను. మిగిలినవాటికి దారిమార్పులు పెడదాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:36, 4 మే 2008 (UTC)