చర్చ:చందమామ ధారావాహికలు

తాజా వ్యాఖ్య: చిన్న ధారా వాహికలు టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Trivikram

శివరామ్! ధారావాహికల జాబితా 'టేబుల్' రూపంలో ఉండనవుసరం లేదనుకొంటాను. సాధారణంగా టేబుల్స్ క్రొత్త సభ్యులు దిద్దే ఉత్సాహానికి అడ్డు అని నా అనుభవంలో అనిపించింది. ప్రయోగాత్మకంగా మొదటి జాబితాలో టేబుల్ తీసేశాను. అది ఓకే అయితే మిగిలినవి కూడా మార్చగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:47, 16 మార్చి 2008 (UTC)Reply

శివా! రామాయణం, కృష్ణావతారం, మహాభారతం , శివ పురాణం, శివ లీలలు - అనే ధారావాహికలకు లింకులు తొలగించాను. ఇదివరకు చలం "మైదానం" విషయంలో లాగానే ఇవి వేరే వ్యాసాలకు వెళుతున్నాయి గనుక. ఈ విషయంలో క్రింది విధానం మంచిదని నాకు అనిపిస్తుంది. ఇవి సూచనలు మాత్రమే.

  • ఈ ధారావాహికల గురించి (అంటే - రామాయణం ఇతిహాసం గురించి కాదు, రామాయణం ధారావాహిక గురించి.) ప్రత్యేకంగా, మీరు గాని మరొకరు గాని, వ్యాసాలు వ్రాసే అవకాశం అంతగా మీకు కనిపించకపోతే అప్పుడు వీటిని అసలు లింకులు లేకుండానే ఉంచవచ్చును.
  • అలా కాకుండా ఈ ధారావాహికల గురించి వ్యాసాలు వచ్చే అవకాశం బాగానే ఉన్నదనిపిస్తే ఇలా వ్రాయవచ్చును-
[[రామాయణం (చందమామ ధారావాహిక)|రామాయణం]]  --> రామాయణం 

లేదా

[[రామాయణం]] ఇతిహాసం గురించిన ధారావాహిక  [[రామాయణం (చందమామ ధారావాహిక)]]  --> 
రామాయణం ఇతిహాసం గురించిన ధారావాహిక రామాయణం (చందమామ ధారావాహిక)

నా సూచనలను పరిశీలించి మీకు సబబు అనిపించినట్లుగా చేయవచ్చును. అదే విధానాన్ని ఇతర ధారావాహికలకు కూడా పాటించవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:09, 12 మే 2008 (UTC)Reply

అరణ్య పురాణం

మార్చు

అరణ్య పురాణం పౌరాణిక గాథ కాదు. దాని గురించి రాయవలసింది పురాణ ధారావాహికలలో కాదు. సాధారణ ధారావాహికల్లో. త్రివిక్రమ్ 11:43, 15 మే 2009 (UTC)Reply

చిన్న ధారా వాహికలు

మార్చు

ఈ వ్యాసంలో చిన్న ధారా వాహికలుగా పేర్కొన్న వాటిలో సింద్ బాద్ యాత్రలు అంత చిన్నదేమీ కాదు. మిగిలినవి అరేబియా కథల సీరీస్ లో వచ్చినవి అనుకుంటా. చందమామ ప్రారంభసంచికల్లో కొన్ని నిజంగా చిన్న సీరియల్స్ వచ్చాయి. ఈ విభాగంలోనుంచి వీటిని తొలగించి వాటిని చేర్చాలి. త్రివిక్రమ్ 11:55, 15 మే 2009 (UTC)Reply

Return to "చందమామ ధారావాహికలు" page.