చర్చ:చక్కెర సీతాఫలం
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
సీతాఫలం మరియు ఈ వ్యాసం సారూప్యత గలవి. అందువల్ల వీటిని విలీనం చేయవలెను. కె.వి.రమణ- చర్చ 16:22, 28 జనవరి 2013 (UTC)
- ఈ రెండింటి శాస్త్రీయ నామం వేరుగా ఉన్నది. Annona squamosa and Annona reticulata. ఏది సరైనది. రెండూ ఒకటేనా. వృక్షశాస్త్రంలో ప్రముఖులు నిర్ధారించిన తర్వాత విలీనం గురించి ఆలోచిద్దాము.Rajasekhar1961 (చర్చ) 08:48, 30 జనవరి 2013 (UTC)
- ఇక్కడ చక్కెర సీతాఫలంగా వర్ణించబడిన పండే నిజమైన సీతాఫలం. సీతాఫలం వ్యాసంలో వర్ణించిన పండును మనవాళ్లు ప్రాంతాన్ని బట్టి రామాఫలమో, లక్ష్మణఫలమో అని అంటారు. ఈ తికమక ఎందుకు జరుగుతుందంటే భారత దేశంలో సీతాఫలాన్ని custard apple అంటారు కానీ ఇతర దేశాలలో మనం రామాఫలంగా భావిస్తున్నదాన్ని custard apple అనటం వళ్ళ చాలా మంది తెలుగులోకి అనువదించేప్పుడు తప్పుచేస్తుంటారు. ఇవి రెండూ రెండు భిన్నమైన ఫలాలు కాబట్టి విలీనం చేయకూడదు --వైజాసత్య (చర్చ) 06:53, 25 ఫిబ్రవరి 2013 (UTC)
- సీతాఫలము, రామాఫలము, లక్ష్మణ ఫలము మూడు కొద్ది తేడాలతో ఒకే మాదిరి ఉంటాయి. సీతాఫలాన్ని అందరూ ఖచ్చితంగా గుర్తుపట్టినా రామాఫలాన్ని, లక్ష్మణఫలాన్ని చాలామంది మార్చివేస్తుంటారు --వైజాసత్య (చర్చ) 06:58, 25 ఫిబ్రవరి 2013 (UTC)