చర్చ:టిప్పు సుల్తాన్
తాజా వ్యాఖ్య: అంతర్వికీ లింకుల గురించి టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: T.sujatha
అంతర్వికీ లింకుల గురించి
మార్చుసుజాత గారూ తెవికీ మీ గతేడాది కృషి వల్ల ఇప్పుడు భారతదేశంలోని ఏ జిల్లాకైనా బ్లూలింకులతో అంతర్వికీ లింకులు ఇచ్చుకోగల స్థితికి చేరుకుంది. ఇది వికీపీడియన్లందరికీ గర్వకారణం. అందుకు ఏ చారిత్రిక వ్యక్తులు, మహనీయుల పేజీల్లోనైనా జిల్లాల వివరాలుంటే అంతర్వికీ లింకులు ఇచ్చుకుందాం. తెలుగు వికీపీడియాలో భారతీయ జిల్లాల లింకులు అంత అనవసరమైన సమాచారమేమీ కాదని నా అభిప్రాయం. మీరు కూడా ఓమాటు ఆలోచించి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 14:52, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- -పవన్ సంతోష్ గారూ ! ఈ జిల్లాల ప్రాజెక్ట్ ఉద్ధేశ్యమే అది. 11 సంవత్సరాల తెవికీ ప్రయాణం తరువాత కూడా భారతీయ జిల్లాలకు పేజీలు లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. పుణ్యక్షేత్రాల గురించి వ్యాసాలు అభివృద్ధిచేయాలని ప్రయత్నిస్తున్నసమయంలో చాలా జిల్లాలకు మరియు తాలూకా స్థాయి పట్టాణాలకు పేజీలు లేకపోవడం గ్రహించాను. ఆ కొరత పూర్తిచేయడానికి మన దేశం గురించి మనం తెలుసుకోవాలి కనుక. జిల్లాల సమాచారం తెలుగులో అందించాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాను. ఇక చక్కగా ఆయా పేజీలలో లింకులు ఇచ్చుకుందాము. ఇప్పటివరకూ ఎర్ర లింకులలో ఉన్న జిల్లాలను నీలి లింకులుగా మార్చుకుందాము. --t.sujatha (చర్చ) 15:46, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- సరే సుజాత గారూ తప్పనిసరిగా చేద్దాం. ఇందాకా మార్పులో అంతర్వికీ లింకు తీసేయడంతో అలా అన్నాను. అంతకుమించి మరేం లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 15:53, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- నేను గమనించనే లేదు పొరపాటున అలా జరిగిందేమో ఇక చూడాలి. --t.sujatha (చర్చ) 15:58, 18 ఫిబ్రవరి 2015 (UTC)