నూర్ భాషా దూదేకుల పింజారి లద్దాఫ్ పేజీ తొలగించారు కాబట్టి విలీనం అనే అంశంపై ఇక చర్చ అవసరం లేదుఅని మేము భావిస్తున్నాము..

తెలుగు ముస్లిములు, దూదేకులు - రెండు వ్యాసాలూ అవసరం మార్చు

పేజీ దూదేకుల కు తెలుగు ముస్లిములు అనే పేరుతో దారిమార్పు గలదు. ఇక్కడ ఒక సందేహం, తెలుగు ముస్లిములు అంటే కేవలం దూదేకులు మాత్రమె కాదు, సీమాంధ్ర లో వుండే దాదాపు 80% మంది ముస్లింలు తెలుగు మాట్లాడే వారే. ఉదాహరణకు నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు గల అన్ని జిల్లాలలోని ముస్లిం సముదాయాలు తెలుగు మాట్లాడే వారే. అలాగే రాయలసీమ జిల్లాలలోనూ 70% ముస్లింలకు ఉర్దూ చదవడానికి వ్రాయడానికి రాదు. అనగా దాదాపు అన్ని ముస్లిం సమూహాలు తెలుగు ముస్లింలు గానే పరిగణింప బడాలి. మరియు తెలుగు ముస్లిములు అనే పేజీ కేవలం దూదేకుల సమూహానికి చెందినదే కాకుండా అన్ని ముస్లిం సమూహాల సమాచారం తో ఉండాలనే ప్రతిపాదిస్తున్నాను. సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 20:06, 15 జూలై 2014 (UTC)Reply

అవును.తెలుగు ముస్లిములు అంటే దూదేకుల వారే కానక్కరలేదు.తెలుగు మాతృభాషగా ఉన్న ముస్లిములంతా తెలుగు ముస్లిములే.కుటుంబ సభ్యులు ఇంట్లో రోజూ మాట్లాడుకునే భాష తెలుగు అయినప్పుడు వాళ్ళు తెలుగు ముస్లిములే. --Nrahamthulla (చర్చ) 08:59, 11 మార్చి 2019 (UTC)Reply
అవును, తెలుగు ముస్లిములు అంటే దూదేకుల వారు మాత్రమే కాదు. ఆ దారిమార్పును తీసెయ్యాలి. తెలుగు ముస్లిములకు ప్రత్యేకంగా పేజీ ఉండాలి. __చదువరి (చర్చరచనలు) 09:07, 11 మార్చి 2019 (UTC)Reply
ఈ విధంగా తెలుగు ముస్లిం అనడం నాకు నచ్చలేదు
మనం కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మనకు కావలసిన రిజర్వేషన్ లు మైనారిటీ లోకి చేర్చాలి 122.176.208.149 08:59, 22 నవంబరు 2023 (UTC)Reply

మానవత్వం ఏమతం? మార్చు

"ఆపదలోని మానవుడిపై అమృతం వర్షించే కరుణాంతరంగమే మతానికైనా, మానవత్వానికైనా సుక్షేత్రం కాగలదు. నిరుపేదలను ఆదుకోవటం వల్ల ముక్కోటి దేవతలను సందర్శించిన దానికంటే మించిన మోక్షం.ఆత్మతృప్తి కలుగుతాయి.(వార్త సంపాదకీయం 30-3-2003) ఇటీవల ఓ జిల్లా కేంద్రంలో నూర్ బాషాలు అంటే దూదేకుల కులస్థుల సమావేశం జరిగింది. హాజరయిన పెద్దలు "మనం ముస్లిములమా?హిందువులమా?" అనే మీమాంసంలో పడి రసవత్తరమయిన చర్చ జరిపారు. ఉర్దూ భాష నమాజురాకపోవటం వలన ముస్లిములు తమను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్ళ పిల్లలకు తమ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేయటానికి ముందుకు రావడంలేదని కొందరు ముస్లిం దూదేకుల వారు వాపోయారు. మాకు తెలుగు మసీదులు కావాలన్నారు. నిజంగా హిందూ దేవుళ్ళను నమ్ముకొని తిరుపతికి పోయి గుండు చేయించుకొచ్చినా, సాయిబుల పేర్లుండటం వలన హిందువులు కేటాయించి చూస్తున్నారనీ, షేక్ శ్రినివాసరావు, షేక్ పద్మావతులు గూడా హిందువుల ఆదరణకు నోచుకోవటం లేదని, మరికొందరు హిందూ దూదేకులవారు బాధపడ్డారు. మన విలువ పెరగాలంటే దూదేకుల సిద్ధప్పను తలదన్నే తాత్వికులతో పాటు ప్రత్యేక పూజారులు, పురోహితులు కావాలన్నారు. వేటపాలెం దగ్గర మా మందంతా క్రైస్తవ మతం పుచ్చుకొని హాయిగా ఉన్నాం. చర్చిలో మమ్మల్ని ముందు వరసలో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు మాకు ఉర్దూ బెడదలేదు. కులం గొడవాలేదని షేక్ ఏసుపాదం, షేక్ దానియేలు లాంటి క్రైస్తవ దూదేకుల వాళ్ళు సెలవిచ్చారు. పైగా త్వరలో స్వంత చర్చి కడతారట. నూతిలో పడతావా? పాతర్లో పడతావా? అన్నట్లయింది సమావేశం. ఎవరి మతాన్ని వారు సమర్ధించుకున్నారు. మనమంతా ఒక కుల పోళ్ళం కాబట్టి మనకందరికీ ఒకే మతం ఉండాలని కొందరు పిడివాద దూదేకులు వాదించారు. ఎవరి మతం ఎవరు విదిచిపెడతారు? ఎవరి మతం వారిదేనని కొందరు ఉదారవాద దూదేకులు ఎదురు తిరిగారు. ఆహా! ఏమీ లౌకికవాదం! ఎంతటి అద్భుతమీ భిన్నత్వంలో ఏకత్వం! సకల మతాల సారాలను ఆచారాలను తనలో ఇముడ్చుకొని సర్దుకొని చక్కగా పోతున్న దూదేకుల ఐకృత వర్ధిల్లాలని కొందరు సెక్యులర్ దూదేకుల వారు అరిచారు. అన్ని మతాల వాళ్ళూ మనల్ని కరివేపాకుల్లాగా వాడు కొని అవతల పారేస్తున్నారు. వెనుకపడిన కులాల జనాభాలో 4 శాతం ఉన్నాం. ఎప్పుడన్నా మనకు ఎమ్మెల్యే పదవిచ్చారా? ఒక్క దూదేకుల వాడైనా ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యాడా? ఆర్ధికాభివృద్ధి లేకుండా ఈ మతాలెందుకు? అని కొందరు హేతువాద దూదేకులు ఆక్రోశించారు.


దూదేకటం అనే వృత్తి పోయింది. ఇప్పుడెవరూ ఆ వృత్తి చేయటం లేదు. ఇక మీదట ఆ వృత్తినే చేసి బ్రతికే అవకాశమూ లేదు. ఇంకా ఆ వృత్తి పేరుతోనే కులం పేరు ఎందుకు? మన కులానికి మరేదయినా మంచి పేరు పెట్టాలని కొందరు సంస్కరణవాదులు మాట్లాడారు. కూటికీ గుడ్డకూ రాని బ్యాండు మేళాలు,సన్నాయి వదిలేసి సాంకేతిక విద్యలు చదవాలనీ, ప్రభుత్వాన్ని భూములడగాలనీ కొందరు కమ్యూనిస్టు దూదేకులవారు డిమాండ్ చేశారు. బంతికే రావద్దంతే విస్తరాకు తెమ్మన్నట్టుంది మీ వ్యవహారం. ఏదో ఒక మత గుంపులో చేరితే తప్ప బెదురు తీరని బడుగు జీవులం మనం. ఏమతంలో చేరితే మన పేదరికం అంతరిస్తుంది? ఏ మతంలో చేరితే మన పిల్లల భ్వష్యత్తుకు భధ్రత కలుగుతుంది? ఏ మతంలో చేరితే వాళ్ళ పిల్లల్ని మన పిల్లలకిచ్చి పెళ్ళిళ్ళు చేసి మనల్ని హృదయ పూర్వకంగా కలుపుకుంటారు? మనం దాడిచేసేవాళ్ళం కాదు ఎప్పుడూ దాడులకు గురవుతున్న వాళ్ళం. ఇప్పుడు కావలసింది మన ఆత్మల రక్షణ కాదు. మన ప్రాణాలకు భౌతిక రక్షణ, ఆర్ధిక రక్షణ, సాంఘిక రక్షణ, ఏ మతంలో దొరుకుతుంది? కుల విచక్షణ చూపకుండా మానవతాభావంతో కరుణ రసాన్ని కురిపించి మనపట్ల సమ గౌరవం చూపే మతమేది? ఆ మనవతా మత మేది? అంటూ కొందరు సభ లోనే అన్వేషించారు. కానీ ఫలితం కానరాలేదు. ఓదార్చేకొద్దీ ఏడ్చే బిడ్దల్లాంటివే కష్టాలన్నారు. కణత తలగడ కాదు. కల నిజం కాదు. కుల మత రహితం కాకపోయినా వాటి ప్రసక్తి లేని లౌకిక భారతం ఓ మంచి ఆశే. మానవ మత భారతం చక్కటి అభిలాషే. కానీ అది ఎన్నటికీ నిజంకాని కల అని కులమతాల నెత్తుటి చరిత్ర నిరూపించింది. రిజర్వేషన్లు లేనిదే ఎక్కిరాలేని జాతులు, రిజర్వేషన్ల కోసమే కొనసాగింపబడుతున్న కులాల లెక్కలూ, రాజ్యాంగ బద్దం కాగా ఇక కులమత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం ఎలా సాధ్యం? రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది. ఇప్పుడు కుల మత సంఘాల పేరుతో గిరులు గీసుకొని కంచెలు కట్టుకొని స్వకీయ రక్షణ. పరపీడన సిద్ధాంతాలతో సాగిపోతున్న నరహంతక ముఠలు ఎన్నని చెప్పగలం? భారతీయ సమాజం కుల మతాల విభజన వల్ల మానసికంగా చిందర వందరై పోయింది. కుహనాఇక్యత వర్ధిల్లుతోంది. మానవత్వాన్ని, ప్రోది చేసి మనందరినీ నిజంగా ఐక్యపరిచే సాధనం మానవతావాదమే. దేవుడి పేరుతో స్ధాపించబడిన కులమతాలు మానవ ఐక్యతకు, మానవ సౌభాగ్యానికి బాటలు వేయాలంటే మతదురభిమానాపు పొరలు కప్పిన వారి కళ్ళల్లో మానవత్వపు కరుణా కాంతులు నిండాలి. హత్యలు చేసే చేతులు పదిమందికి అన్నం పెట్టాలి. ఆస్తులు, ప్రాణాలు, మానాలు దోచుకునే దుర్మాగులు పరోపకారులుగా మారాలి. ఇలా మనుషుల్ని కారుణ్యమూర్తులుగా మలచలేని మతాలు వ్యర్ధం. మానవత్వాన్ని కాలరాచే మతాలు మన పాలిట శాపాలు. మతాలకు మానవత్వమే గీటురాయి.

తటస్థ దృక్కోణం మార్చు

ఈ వ్యాసంలో వ్యక్తిగత అభిప్రాయాలున్నాయి. తటస్థంగా లేదని నా అభిప్రాయం. తటస్థ దృక్కోణం మరియు Neutral point of view చూడండి. ఆపై వ్యాసాన్ని సరిదిద్దండి. — వీవెన్ 07:47, 20 జూన్ 2007 (UTC)Reply

ఈ చర్చావ్యాసం తటస్థ దృక్కోణం సంతరించుకునేలా మార్చే స్వేచ్చ మీకు ఉందనీ, మీరు సరిదిద్దవచ్చనీ,ఎవ్వరైనా వాడుకోవచ్చనీ అనుకొంటున్నాను.--Nrahamthulla 08:03, 20 జూన్ 2007 (UTC)Reply
వ్యాసపు మొదటి రెండు పేరాలు, వికీ పద్ధతిలో ఉన్నాయి. మూడో పేరా కొంత వరకు పరవాలేదు. మిగతా భాగం మొత్తాన్నీ తీసెయ్యాలని నా ఉద్దేశ్యం. __చదువరి (చర్చరచనలు) 08:23, 20 జూన్ 2007 (UTC)Reply
అదే సులువనుకుంటా..చాలా పనిఉంది ఈ వ్యాసంలో --వైజాసత్య 08:37, 20 జూన్ 2007 (UTC)Reply
రహంతుల్లా గారూ, వ్యాసంలో చాలామటుకు మీ అనుభవాలు, ఎదురైన సంఘటనలు ఉండం వలన అవన్నీ తొలగించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మీరు రాసిన ప్రతి ఎప్పటికీ పేజీ చరిత్రలో భద్రపరచి ఉంటుంది. మీరు ఏ పత్రికలోనో మరెక్కడైనా పెట్టుకోదలచితే చెప్పండి మళ్లీ అంతా టైపు చేసే అవసరం లేకుండా ఆ ప్రతిని పంపిస్తా --వైజాసత్య 09:05, 20 జూన్ 2007 (UTC)Reply
అవును, కేవలం వికీపీడియాకు అనువుగా లేదు కాబట్టే తొలగించడం జరిగింది గానీ, మంచి సమాచారముంది అ వ్యాసంలో. రహంతుల్లా గారూ, దాన్ని మీ బ్లాగులో గానీ, మరే అనువైన స్థలంలోనైనాగానీ పెడితే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 09:24, 20 జూన్ 2007 (UTC)Reply
దీని ప్రతి ఒకటి భద్రపరచాను.వికీకి అనువుగా ఇమిడేంత భాగాన్ని ఉంచి మిగతా దాన్ని తీసి వేయండి.బ్లాగుల పరిజ్ఞానం ఇంకా అలవడలేదు.త్వరలో అదికూడా నేరుస్తా.--Nrahamthulla 10:12, 20 జూన్ 2007 (UTC)Reply
Return to "దూదేకుల" page.