చర్చ:నెట్ఫ్లిక్స్
తాజా వ్యాఖ్య: అభిప్రాయం టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
అభిప్రాయం
మార్చువాడుకరి:HarshithaNallani గారూ, మీరు ఈ వ్యాసం అనువాదాల పరికరం ద్వారా సృష్టిస్తున్నట్లు ఉంది. ఈ వ్యాసంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవి ఏమిటో తెలుసుకోవాలంటే మీరు వికీలో రచనలు చేయడానికి కొంత ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించాలి.
- అనువాదం కొన్ని చోట్ల సరిగా రాలేదు. ఉదాహరణకు. క్రొత్త కంటెంట్‌ను ఉత్పత్తి చేయడానికి, అదనపు కంటెంట్ కోసం హక్కులను పొందటానికి,190 దేశాల ద్వారా వైవిధ్యపరచడానికి వారు చేసిన ప్రయత్నాల ఫలితంగా కంపెనీ బిలియన్ల అప్పులను సంపాదించింది
- వ్యాసంలో ఎక్కడా ఇంకో వ్యాసానికి లింకులు లేవు
- వికీకి మూలాలు చూపించడం చాలా ముఖ్యం. ఇవి ఎక్కడా చూపించలేదు.
- తెలుగు భాషలో మరియు, యొక్క లాంటి పదాలు చాలా కృతకంగా అనిపిస్తాయి. ఇవి ఈ వ్యాసంలో విరివిగా కనిపిస్తున్నాయి.
- కొన్ని వాక్యాలు చాలా పొడుగై పోయాయి. చదవడానికి వీలుగా సరళంగా లేవు.
దయచేసి కొత్త వ్యాసాలను సృష్టించేటపుడు పై విషయాలను గమనించండి. ఏదైనా సందేహాలుంటే నన్ను అడగండి. రవిచంద్ర (చర్చ) 14:59, 28 మార్చి 2020 (UTC)