4 ఆగస్టు 2012‎ న YVSREDDY చే సృష్టించబడిన వ్యాసంలోని సమాచారం

మార్చు

పులి సింహం వంటి బలమైన జంతువులు తమ ఆహారం కోసం జింక ఏనుగు వంటి అనేక రకాల జంతువులను తమ కాళ్లను ముఖ్యంగా ముందరి కాళ్లను విసరి వాటిని చంపడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధంగా ఒక జంతువు మరొక జంతువుపై దాడి చేసేటప్పుడు తమ కాళ్ల గోర్లు అవతలి జంతువు చర్మంపై బలమైన గాయాన్ని కలుగచేస్తాయి. అనగా ఒక జంతువు మరొక జంతువును చంపడానికి తన కాళ్లును బలంగా విసరడాన్ని పంజా విసరడం అంటారు. బలమైన, పదునైన గోర్లు, శక్తివంతమైన వేళ్లు కలిగిన జంతుపాదాన్ని పంజా అంటారు. మనిషి చేతికి ఉన్న ఐదు వేళ్లు (పంచ వేళ్లు) నుంచే ఈ పంజా అనే పదం ఏర్పడింది.

[[వర్గం:జంతువులు]

ఈ వ్యాసాన్ని 19 ఏప్రిల్ 2023‎ న తొలగించారు. ఈ వ్యాసం తొలగించవలసిన వ్యాసం కాదు. దశాబ్దం క్రిందట సృష్టింపబడిన ఈ వ్యాసాన్ని తొలగించటం వలన ఈ వ్యాసం యొక్క చరిత్ర కూడా తొలగిపోతుంది నిర్వాహకులు గమనించగలరు. ఈ వ్యాసం విజ్ఞానానికి సంబంధించిన వ్యాసం, కావున ఈ వ్యాసాన్ని తిరిగి 19 ఏప్రిల్ 2023‎ న మరికొంత సమాచారాన్ని చేర్చి సృష్టించాను. YVSREDDY (చర్చ) 20:05, 19 ఏప్రిల్ 2023 (UTC)Reply

ముందుగా ఈ పేజీ ఎందుకు తొలగించబడిందో దానికి కారణం
1. పంజా (అయోమయ నివృత్తి), 2. పంజా (అయోమయ నివృత్తి) రెండూ అయోమయనివృత్తి పేజీలే. రెండిటికి పేజీ సృష్టికర్త ఒకరే.రెండు దశాబ్దం క్రిందట సృష్టించిన పేజీలే.వికీపీడియా:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి ప్రాజెక్టులో భాగంగా రెండు పేజీలు ఉన్నందున ఒక పేజి తొలగించబడిందని గ్రహించాలి.
వైవిఎస్ రెడ్డి గారి ఇతర కారణాలు
  • ఈ వ్యాసం తొలగించవలసిన వ్యాసం కాదు.
అవును నిజమే సరియైన మూలాలు, విస్తరణతో ఉన్న వ్యాసం వికీపీడీయాలో తొలగించవలసిన వ్యాసం కాదు.
  • దశాబ్దం క్రిందట సృష్టింపబడిన ఈ వ్యాసాన్ని తొలగించటం వలన ఈ వ్యాసం యొక్క చరిత్ర కూడా తొలగిపోతుంది నిర్వాహకులు గమనించగలరు.
ఇది వాస్తవంకాదు వ్యాసం తొలగించినా చరిత్ర ఎప్పటికీ ఎక్కడికీ పోదు.చిరస్థాయిగా ఉంటుంది.దానికి చింతించాల్సిన పనిలేదు.చరిత్ర కోసం అంతగా తపించే వైవిఎస్ రెడ్డి గారు మరి తొలగించిన పేజీ సృష్టించిన సందర్బంలో తొలగించిన పేజీ చరిత్రను ఎందుకు తీసుకురాలేకపోయారో అర్థంకాని ప్రశ్నగా మిగిలింది.
  • ఈ వ్యాసం విజ్ఞానానికి సంబంధించిన వ్యాసం, కావున ఈ వ్యాసాన్ని తిరిగి 19 ఏప్రిల్ 2023‎ న మరికొంత సమాచారాన్ని చేర్చి సృష్టించాను.
తొలగించిన పేజీకి, ఇప్పుడు సృష్టించి విస్తరించిన పేజీకి తేడా రెండు వాక్యాలు మాత్రమే
ఇక పోతే ఇప్పుడు సృష్టించిన పేజీలోని మూలం అసలు ఆ వ్యాసానికి సంభందం లేని మూలం.అది ఈ వ్యాసానికి మూలంగా పనికిరాదు.వ్యాసానికి సరియైన మూలం లేనిచో తొలగించటానికి అవకాశం ఉంటుంది. యర్రా రామారావు (చర్చ) 23:23, 19 ఏప్రిల్ 2023 (UTC)Reply
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:పంజా&oldid=3887912" నుండి వెలికితీశారు
Return to "పంజా" page.