చర్చ:భారతదేశపు చట్టాలు

తాజా వ్యాఖ్య: 13 సంవత్సరాల క్రితం. రాసినది: Talapagala VB Raju

1833 లో బ్రిటిష్ ప్రభుత్వం ఛార్టర్ ఏక్ట్ 1833 (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ 1833 అని కూడా అంటారు) అమలు చేయటంతో, భారత దేశాని కి (నాటి బ్రిటిష్ ఇండియా) అంతటికీ ఒకే శాసనం చేయటానికి అధికారం కలిగింది. అప్పటినుంచీ భారతదేశానికి (బ్రిటిష్ ఇండియా) అంతటికీ చట్టాలు చేయటం మొదలైంది. ఆనాటి నుంచి, అంటే 1834 సంవత్సరం నుంచి, 20 జూన్ 2011 వరకు, భారత దేశం లో 2245 చట్టాలు అమలులో ఉన్నాయి. వాటిని క్రమపద్ధతిలో అందరికీ అందుబాటులో ఉంచాలన్నదే ఈ ప్రయత్నం. ప్రతి రోజు 20 చట్టాలు ఈ పట్టికలో చేర్చగలిగితే, ఈ పట్టిక పూర్తి కావటానికి కనీసం 115 రోజులు సమయం పడుతుందని ఒక అంచనా. Talapagala VB Raju 05:44, 20 జూన్ 2011 (UTC)Reply

  • ఈ వ్యాసం అత్యంత ఉపయోగకరమైనది అన్నది నా ఉద్దేశ్యం. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఉన్న సాధారణ విషయాలు కూడా సామాన్య మానవులకు అందుబాటులో లేవు. సులభశైలిలో చట్టాల వివరణ అందించడం హర్షించతగిన విషయం. ఎంత సమయం తీసుకున్నా పరవా లేదు. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఇలాంటి వ్యాసాన్ని అందిస్తున్న తలపాగల వి బి రాజుగారికి ధన్యవాదాలు.--t.sujatha 13:14, 21 జూన్ 2011 (UTC)
Return to "భారతదేశపు చట్టాలు" page.