చర్చ:భారతీయ దుస్తులు
తాజా వ్యాఖ్య: సలహాలు, సూచనలు కోరడమైనది టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj
సలహాలు, సూచనలు కోరడమైనది
మార్చుఈ వ్యాసం ఆంధ్రుల దుస్తులు, భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు వలె సులువు కాదని నాకు ముందే తెలుసు. అందుకే ముందు వాటిని పూర్తి చేసే ప్రయత్నాలలో ఉన్నాను. కే వి ఆర్ గారి ప్రోత్సాహం మేరకు మొదలు పెట్టాను. ఆరంభం లోనే ఎక్కడి నుండి మొదలు పెట్టాలనే సవాలు ఎదురైనది. ఆంగ్ల వ్యాసం అనువాదంతో మొదలు పెట్టాను. తర్వాత ఎలా ముందుకెళ్ళాలో తెలియక, ఆంగ్ల వికీ లో భారతీయ దుస్తులకి సంబంధించిన చిత్రాలని జతపరచే ప్రక్రియ పూర్తి చేశాను. ఈ చిత్రాలకు సంబంధించి ఆంగ్ల వ్యాసాలలోని ముఖ్య సమాచారం చేర్చాను. ఇక్కడ ఆగిపోయాను.
సహ తెవికీపీడియనుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కోరడమైనది. దయచేసి సహాయం చేయండి. మీ వద్ద ఇంకనూ అదనపు సమాచారం ఉంటే చేర్చవలసినదిగా మనవి. శశి (చర్చ) 16:44, 9 ఏప్రిల్ 2013 (UTC)