చర్చ:మంగళ్య భగ్యము
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
దిక్కుమాలిన భాష ఉన్న ఈ వ్యాసాన్ని తక్షణం తొలగించాలి. ఇలాంటి భాష వికీపీడియాకు తలవంపులు. వాడుకరి:రవిచంద్ర గారు తొలగింపు మూస ఉంచారు కాబట్టి చర్చలో రాస్తున్నాను గానీ, అసలు దీనికి చర్చాయోగ్యత లేదు. ఇలాంటి భాష ఉన్న ఈ వ్యాసానికి చర్చార్హత లేదు. అసలు ఇలాంటి భాష రాసి (యాంత్రికానువాదమో మరో దరిద్రమో చేసి) ఇక్కడ పారేసిన వాడుకరులకు వికీపీడియా అంటే గౌరవం లేదు. తెలుగు భాషంటే గౌరవం లేదు. వాళ్ళు తెలుగు భాషకు సిగ్గుచేటు. ఛిఛీ! గూగుల్లో అనువాదం చేసి ఇక్కడ పారేస్తే దిద్దుబాట్ల సంఖ్య పెరుగుతుంది, మన పేరిట ఒక వ్యాసం కూడా పడుంటుంది, పైగా చిన్నమెత్తు శ్రమ లేదు అనే దిక్కుమాలిన ఆలోచన తప్ప వీళ్ళకు మరో ఉద్దేశం ఉందని నాకు అనిపించడం లేదు. ఛిచ్ఛీ! __చదువరి (చర్చ • రచనలు) 09:52, 19 మార్చి 2019 (UTC)
- చదువరి గారూ నా అభిప్రాయాన్ని సమర్ధించినందుకు ధన్యవాదాలు. నేనొక్కడినే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే బాగుండదని చర్చకు పెట్టాను. రవిచంద్ర (చర్చ) 11:16, 19 మార్చి 2019 (UTC)