ప్రాజెక్టు టైగర్ - శుద్ధి సూచనలుసవరించు

కొన్ని విభాగాల్లో (జీవిత విశేషాలు, ఆర్గ్యుమెంట్ రియాలిటీ) వ్యాకరణం, భాష కాస్త సవరించాల్సివున్నాయి. (భారీ సమస్యలు కాకున్నా నాణ్యతను తగ్గించేలా ఉన్నాయి) దయచేసి భాషను సరళీకరించగలరు. అలానే ఒక కాపీ ఎడిట్ అవసరం. ఉదాహరణకు choosing to die a patriot అన్న వాక్యభాగానికి "దేశభక్తిని చంపడానికి ఎంచుకుంటాడు" అన్న అనువాదం సరికాదు. దాని సరైన అనువాదం "దేశభక్తునిగా మరణించడానికి నిర్ణయించుకున్నాడు" అనొచ్చు. ఇటువంటివి దిద్దాలన్నమాట. --పవన్ సంతోష్ (చర్చ) 15:06, 24 ఏప్రిల్ 2018 (UTC)

పవన్ సంతోష్ గారూ, మరలా చేర్చాను పరిశీలించండి.--కె.వెంకటరమణచర్చ 13:28, 30 ఏప్రిల్ 2018 (UTC)
మాస్టారూ పోటీకి స్వీకరించానండీ. అత్యావశ్యకమైన వ్యాసాల నాణ్యత పెంచుతున్న అభ్యర్థుల్లో మీరు ఒకరు. అభినందనలండీ. మరిన్ని వ్యాసాలు రాస్తారని ఆశిస్తున్నాను. ఏప్రిల్ నెలకు గాను ఇప్పటివరకూ పరిశీలిస్తే (ఇంకా 5 గంటలు మిగిలివుంది) 8 వ్యాసాలతో మీరు మొదటి స్థానంలో ఉన్నారు. తెలుగు వికీపీడియా ఈ పోటీలో ఇంకా వంద వ్యాసాల మార్కును అందుకోలేదు, దానికి కారణం మనం నాణ్యత విషయంలో చాలా గట్టిగా ఉండడం వల్లనే అయినా, మనం రాశినీ వాసినీ కూడా పెంచితే బావుంటుందని వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇందుకు నావంతుగా స్థానికంగా మనవారు కోరుకున్న 500 వ్యాసాల జాబితాను సహ జ్యూరీ సభ్యుడు చదువరి సహకారంతో ప్రయాసకోర్చి రూపొందిస్తున్నాను. అంతేగాక వికీపీడియా:ప్రతీ వికీపీడియాలోనూ ఉండాల్సిన పదివేల వ్యాసాల జాబితాను తమిళ వికీపీడియన్ ఒకరి సహకారంతో స్థానికీకరిస్తున్నాను. ఆ జాబితా సహా మిగిలిన జాబితాలను సద్వినియోగం చేస్తూ వ్యాసాలను రాయడంలో మీవంటివారి సహకారం ఈ విషయంలో నాకు ఉంటుందని నమ్ముతున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 13:42, 30 ఏప్రిల్ 2018 (UTC)
పవన్ సంతోష్ గారూ, ఈ ప్రాజెక్టు టైగర్ వ్యాసాల జాబితాలో నాకు ఇష్టమైన రంగంలో వ్యాసాలు లేనందున ఆసక్తి లేకుండా పోయిందండీ. ఎక్కువగా ఇతర భాషల సినిమా వ్యాసాలు, ఇతరాలు ఉన్నాయి. అందువలన సరిగా వ్రాయలేకపొయాను. మన సభ్యులు కోరిన వ్యాసాల జాబితా వస్తే వ్యాసాల సంఖ్య పెరగవచ్చు. --కె.వెంకటరమణచర్చ 16:04, 30 ఏప్రిల్ 2018 (UTC)
రమణ గారూ! స్థానిక ప్రాధాన్యత కల అంశాలు ఒకసారి చూడండి. అందులో మీరు కోరిన అంశాలను (ఇతరులు కోరినవాటితో పాటుగా) జాబితా వేసి, ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో సూచించాను. లేనివాటన్నిటినీ ఈ 500 అంశాల జాబితాలో పెడతాము. కాబట్టి ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతందని ఆశిస్తున్నాను. మీరు కూడా ఒకసారి పేజీలో ఆ పట్టికలు చూసి మీ అభిప్రాయం చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 17:24, 30 ఏప్రిల్ 2018 (UTC)
Return to "మణిశంకర్" page.