చర్చ:ముక్కామల (పెరవలి)


అక్షరాస్యత శత శాతం అని వ్రాశారు కొద్దిగా నమ్మశక్యము గా లేదు. ఇటువంటి విషయాలకు మూలాలు చేర్చితే బాగుంటుంది.--మాటలబాబు 03:14, 23 ఆగష్టు 2007 (UTC)

ముక్కామల,దాని ప్రక్కనుండే కాకరపర్రు,తీపర్రు,ఉసులుమర్రు ఇవన్నీ బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్న ఒకప్పటి అగ్రహారాలు.ఇక్కడ అక్షరాస్యత ఎక్కువేకాని వందశాతం మాత్రం ఉండబోదు.vissu 04:11, 23 ఆగష్టు 2007 (UTC)

కాకరపర్రు, పెరవలి నాకు బాగా తెలుసు. ఉషశ్రీ (పురాణపండ దీక్షితులు) కాకరపర్రు గ్రామము నుండే కదా..పెరవలి నుండి రావులపాలెం కి , తణుకు కి తరచు బస్సులు ఉండేవి. 1985-86 మాట.--మాటలబాబు 04:23, 23 ఆగష్టు 2007 (UTC)

అవునండి.ఈ ఏరియానుండి చాలా మంది ప్రముఖులు ఉన్నారు.శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలు నవలలో ఈప్రాంతం గురించి చాలా వ్రాయబడిఉంది.పెరవలి ఇప్పుడు పెద్ద సెంటర్ కూడా నిడదవోలు డిపో తీసేయకముందయితే ప్రతి పది నిముషాలకొక బస్సుండేది.vissu 04:55, 23 ఆగష్టు 2007 (UTC) అక్షరాస్యత "సుమారు" నూరుశాతం అంటే గ్రామం లో వంద,రెండు వందల మంది కంటె ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండరు అని ఉద్దేశ్యం (మరీ చిన్నపిల్లలు తప్ప). అక్షరాస్యతకు కొలబద్ద : కొన్ని అక్షరాలు గుర్తు పట్టడం,సంతకం పెట్టగలగడం. ఈ కొలమానాన్ని లెక్క లోకి తీసుకోకుంటే నావద్ద సమాధానం లేదు.----కంపశాస్త్రి 13:12, 23 ఆగష్టు 2007 (UTC)

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తన ఆత్మకథ "అనుభవాలూ-జ్ఞాపకాలూ" లో ముక్కామల గురించి వ్రాశాడు. ఎందుకు వ్రాయడూ? అతడు ఈ ఊరి వారి అమ్మాయిని (మేనరికం)పెళ్లిచేసుకున్నాడుకదా.----కంపశాస్త్రి 13:45, 23 ఆగష్టు 2007 (UTC)

ముక్కామల (పెరవలి) గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "ముక్కామల (పెరవలి)" page.