చర్చ:ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తాజా వ్యాఖ్య: శ్రీలత మన: తృష్ణ టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Kiranmayee

ప్రాజెక్టు సమాచారం

మార్చు
  ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


జాబితా పరిధి

మార్చు

ఇది నాకు నచ్చిన పుస్తకాల జాబితా వంటిది కాదు. అన్ని పుస్తకాలు, రచయితల జాబితా అంతకంటే కాదు.


ఇది వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా చేయబడిన తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన పుస్తకాల జాబితా. ఈ జాబితాలో ఏ పుస్తకాలు చేర్చబడినాయో, ఇంకా ఎలాంటివి చేర్చవచ్చునో వంటి వివరాలు ఇక్కడ వివరించబడినాయి. ఈ జాబితాను విస్తరించడానికి స్పష్టమైన విధానాన్ని వాడండి.

ఈ జాబితాలోని పుస్తకాలు ఎంపిక చేయడంలో ఈ క్రింది పరిధులు పరిగణించబడినాయి.


ప్రాచీన రచనలు

మార్చు

(1870 ముందు వెలువడినవి)

  • పింగళి లక్ష్మీ కాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర, ద్వారకానాధ శాస్త్రి - తెలుగు భాషా చరిత్ర: ఈ రెండు రచనలలో ఆయా కవుల, రచనల గురించి వ్రాసే సందర్భంలో 'ఇది ముఖ్యమైన రచన', 'విశిష్ట స్థానం ఉన్నది' వంటి విశేషణాలు వాడినవి
  • అష్ట దిగ్గజాలలో ఒక్కొక్కరిది కనీసం ఒక్కొక్క రచన

ఈ రచనలు అవి వెలువడిన కాలం అనుగుణంగా (షుమారుగా) జాబితాలో ఇవ్వబడినాయి.

ఆధునిక రచనలు

మార్చు

ఈ రచనలు ఆయా విభాగాలలో అకారాది క్రమంలో ఇవ్వబడ్డాయి.

జాబితా విస్తరణ

మార్చు

ఇది మీకు ఇష్టమైన పుస్తకాల జాబితా కాదు. అలాగని ఈ జాబితాను మఅర్చకూడదని లేదు.

  • పైన ఉన్న మార్గ దర్శకాలకు అనుగుణంగా ఇంకా పుస్తకాలను ఈ జాబితాలో చేర్చవచ్చును.
  • ఫైన ఉన్న మార్గదర్శకాలను కూడా మీరు మార్చవచ్చును. అందుకు అనుగుణంగా జాబితాను మార్చవచ్చును. ఏ వైనా మార్పులు చేసినపుడు కారణాలు చర్చాపేజీలో వ్రాయండి.
  • ఒక్కో రచయిత, లేదా సబ్జక్టు గురించిన పుస్తకాలు వ్రాయాలంటే అందుకు వేరే జాబితాలు తయారు చేయండి. స్పష్టమైన ఎన్నుకొనే ప్రమాణాలు లేకుండా ఈ జాబితాను పెంచవద్దు.
  • ఏదైనా పుస్తకం గురించి వ్యాసం వ్రాయాలంటే నిస్సంశయంగా వ్రాయండి. స్వాగతం. ఆ పుస్తకం ఈ జాబితాలో ఉండాలని నియమం లేదు.

ఈ జాబితాలో 'ఇస్లామీయ పుస్తకాలు' అనే అంశాన్ని కూడా చేర్చితే బాగుంటుంది.

ఈ చర్చా పేజీ జాబితా కూర్పుల రచయితలు

మార్చు

ఈ జాబితాలో చలం పుస్తకాలు చేర్చడం గురించి

మార్చు

శివా! ఈ జాబితాలో మీరు చలం పుస్తకాలు చాలా చేర్చారు. ఈ జాబితా ఉద్దేశ్యమూ, అందులో ఉంచాల్సిన పుస్తకాల పరిధిని గురించి పైన వివరంగా వ్రాశాను. పరిశీలించండి. చలం పుస్తకాల గురించి వ్రాయడానికి అవి ఈ జాబితాలోనే ఉండాల్సిన అవుసరం లేదు. చలం రచనల జాబితా వ్యాసం చాలును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:46, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply

నిజమే! తరువాత గమనించాను, సరిచేస్తాను.--SIVA 08:39, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply

శ్రీలత మన: తృష్ణ

మార్చు

శ్రీలత గారు రచించిన మన: తృష్ణ గురించి వెతికాను, దొరకలేదు. అంత ప్రాముఖ్యము కాని పుస్తకము ఇక్కడ అవసరము లేదు అని చిదివిన తరువాత తీసివేశాను. కిరణ్మయీ 16:48, 27 జూలై 2009 (UTC)Reply

Return to "ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా" page.