చర్చ:రమణీయం
Authors blog రచయితల బ్లాగు లింకు ఉండకూడదని ఏదన్నా నియమం ఉందా. అజ్ఞానం కొద్దీ అడుగుతున్నాను. Chavakiran 10:34, 17 ఏప్రిల్ 2011 (UTC)
- తెవికీలో నియమాల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న నియమాలు చాలా తక్కువ. ఇదివరకటి చర్చలు, పాటించిన సంప్రదాయాలు తదితరాల ఆధారంగానే తెవికీని నెట్టుకు వస్తున్నాము. ఇక బ్లాగు లింకు విషయానికి వస్తే "బ్లాగు" అనే ఏకైక కారణంగానే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బయటి లింకులనుంచి తొలిగించాను. ఎందుకంటే రేపు ఎవరో ఒక ఎల్లయ్య ఒక వ్యాసం రాసి బ్లాగు లింకు ఇచ్చి, ఇదివరకు ఇలాంటి లింకులున్నాయని ఎదురు తిరగవచ్చు. అసలు బ్లాగులు ప్రామాణికం కానేకావు. తత్కారణం గానే మనం దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ వ్యాసంలో బ్లాగు లింకు లేకున్నా వ్యాసానికి ఎలాంటి ఇబ్బంది లేదు, లింకు ఇచ్చినంత మాత్రానా వ్యాసం పరిపూర్ణం అవుతుందని చెప్పలేము. వ్యాసంలో వివాదాస్పద వాక్యాలు కూడా లేవు. అంతగా అవసరం అనుకుంటే అంతర్జాలంలోనే ఎక్కడో ఒకచోట వ్యాసానికి తగిన ఆధారం దొరకవచ్చు, లేదా ప్రామాణిక గ్రంథాలలో ఉండవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:56, 17 ఏప్రిల్ 2011 (UTC)
- My point - If there is an official blog of a book/author we need to add it to external links. Because that is run by real people whom telugu wiki is discussing! For the people who are visiting tewiki for information would love to visit the real people's blog/website. Blogs are different from official blog. But then how to differentiate from fake official blogs? Not sure, but these two blogs (ramaneeyam, bank babu ) doesn't seem to be fake. Let us say nara chandra babu naidu started a blog, don't we add it to his tewiki page as external link? Chavakiran 03:30, 18 ఏప్రిల్ 2011 (UTC)
అధికారిక బ్లాగు అని తెలుసుకోవడం కష్టమే. ఆ రచయితకు సంబంధించిన వివరాలు ఇతర చోట్ల లభ్యం కానప్పుడు బ్లాగులోని విషయాలు సరైనవేనని పూర్తిగా నమ్మడం కుదరదు. ఉదా:కు ఎవరో ఎల్లయ్య తాను గొప్ప రచయితనని, ఎన్నో పుస్తకాలు రచించానని ఒక బ్లాగు ప్రారంభిస్తే ఆ బ్లాగు ప్రాతిపదికగా తెవికీలో వ్యాసం రాసి బయటి లింకులలో ఆ బ్లాగు లింకు పెడితే, అసలు ఎల్లయ్య ఎవరు, అతనున్నాడా, ఆ పుస్తకాలేంటి, అతను రచయితనేనా తదితర సందేహాలకు సమాధానమేమిటి? అదే ఒక ప్రముఖ వ్యక్తి ఉదా:కు చంద్రబాబు బ్లాగు పెడితే ఆ బ్లాగును వ్యాసంలో బయటి లింకులలో లింకివ్వవచ్చు. ఎందుకంటే చంద్రబాబు గురించి ఇదివరకే అతని సమాచారం అందరికీ తెలుసు. ఏదైనా కొత్త సమాచారం అందులో ఉన్నా అది సాధారణంగా తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం లేదు. బ్లాగులో తప్పు వ్రాస్తే సాధారణ ప్రజానీకం, మీడియా ఊరుకోరు. ఇలా ఇదివరకే సమాచారం అందుబాటులో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి బ్లాగుకు, సాధారణ వ్యక్తి బ్లాగుకు తేడా ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:55, 18 ఏప్రిల్ 2011 (UTC)