ఎ.యస్. రామశాస్త్రి వ్రాసిన తెలుగు కథల పుస్తకం రమణీయం . అనామకుడు అనే కలం పేరుతొ వ్రాసాడు. ఈ పుస్తకంలో ఆలుమగల దాంపత్య కాలచక్రం గురించి కవి రమణీయంగా వివరించాడు. ఏడాదికి ఆరు ఋతువులు వున్నట్టే ఆలుమగల దాంపత్య కాలచక్రంలోనూ వుంటాయని, పెళ్ళి, సంతోషం, సంసారం, సంగరం, సంతానం, సంతృప్తి అనే మజిలీల మీదుగా - కామం పెరిగి, విరిగి, తరిగి నిష్కామభరితమైన స్నేహంగా, ప్రేమగా యెలా పరివర్తనం చెందుతుందో కవి మనకు ఈ పుస్తకం ద్వారా చెప్పాడు. నిన్న కన్న బిడ్డ ఇవాళ పిల్లలవుతారు, ఇవ్వాల పిల్లలు - రేపటికి తల్లిదండ్రులు, ఎల్లుండికి తాతలూ, అవ్వలూ అవుతారు కవి మనకు రమణీయంలో ఈ కాలచక్రాన్ని సీత, రామం పాత్రల రూపంలో మనకు కళ్లకు కట్టినట్లు రమణీయంగా చెప్పాడు.

రమణీయం పుస్తక ముఖచిత్రం.

కథా విశేషంసవరించు

సీతారాముళ్లనే బావమరదళ్ల - ధరిమిలా ఆలూమగళ్ల - ఆ పైన తల్లీతండ్రుళ్ల - ఆ పిమ్మట అవ్వాతాతళ్ల కథలివి, వీళ్ళందరూ కలిపి ఇద్దరే (సీత, రామం). ప్రేమలో పడడం, పెళ్లాడడం, కామించడం, రెచ్చిపోవడం, అలిసి పోవడం, క్రమంగా కోరికలు వెలిసి పోవడం, కలుపు గడ్డి కల్పవృక్షంలా కనబడడం, తేలిగ్గా నాలిక్కరుచుకోవడం, నవ్వుకోవడం ఇదే ఈ పుస్తకంలోని కథల తాత్పర్యం!

కథాక్రమంసవరించు

ఈ పుస్తకంలోని కథలు ఈ క్రింది విదంగా వుంటాయి

  • రమణీయం
  • అంకురం
  • ఓ దశాబ్దం
  • మధురం..... మధురం.....
  • చతుర్దాంకం
  • అవునా?
  • అలిగిన వేళ
  • వానప్రస్థం

ముద్రణ వివరాలుసవరించు

రమణీయం మొదటి ముద్రణ 2008 జనవరిలొ బాపు, ముల్లపూడి వెంకటరమణ చేతుల మీదుగా వాహిని బుక్ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో విడుదలైంది. దీనికి ముఖపత్ర పేజి విన్యాసం చేసినది, బొమ్మలు గీసినది బాపు.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రమణీయం&oldid=3210027" నుండి వెలికితీశారు