చర్చ:వయోవృద్ధ పౌరుల నిర్వహణ, రక్షణ , సంక్షేమ చట్టం - 2007

తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు, ఇతర అంశాలు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: K.Venkataramana

వ్యాసం పేరు, ఇతర అంశాలు మార్చు

కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

ఈ వ్యాసంలో కింది అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి.

  1. వ్యాసం పేరు అసంపూర్ణంగా ఉంది. సరైన పేరుకు తరలించాలి.
  2. కొన్ని వాక్యాలను పత్రికల్లోని వ్యాసాల్లో వచ్చే వ్యాఖ్యానాల్లాగా రాసారు. ఉదా: "ప్రపంచ వ్యాప్తంగా భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, మొదలగు వ్యవస్థలకు ప్రపంచ వ్యాప్తంగా భారత దేశం పెట్టింది పేరు." ఇలాంటి వాక్యాలకు మూలాలను చూపించాలి.
  3. వ్యక్తుల అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని తీసేస్తే బాగుంటుంది, లేదా మూలాలనివ్వాలి. ఉదా:
    1. "ప్రభుత్వం చేసిన ఈ చట్టం ఎంతటి మహోన్నత మైనదైనా, వయో వృద్ధులకు వరదాయిని ఐనా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పట్టుగొమ్మ అయిన మనుషులకు, మనసులకు, మానవీయతకు అత్యంత విలువనిచ్చే పుణ్యభూమి అయిన ఈ భారత దేశంలో ఇటువంటి చట్టం చేయడానికి దోహద పడిన పరిస్థితులు ఏర్పడడం ఎంత శోచనీయం?"
    2. "ఈ వయో వృద్ధులు తమ జీవిత కాలంలో ఎంత సంపాదించినా వారి పిల్లలు, ఆ ఆస్తినంతా తమ పేరున బలవంతంగా వ్రాయించుకొని దిక్కులేని వారిని చేసి ఇంటినుండి బయటికి గెంటివేస్తున్నారు."

పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 04:06, 29 ఏప్రిల్ 2021 (UTC)Reply

దీనికి సరిపోలిన వ్యాసం Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 ఆంగ్లవికీపీడియాలో ఉంది.దానికి వికీ డేటా లింకు కలిపాను.దాని ప్రకారం " తల్లిదండ్రుల, వయోవృద్ధ పౌరుల నిర్వహణ, సంక్షేమ చట్టం - 2007 " అని దారిమార్పు లేకుండా తరలించవచ్చును. యర్రా రామారావు (చర్చ) 07:16, 16 జూన్ 2022 (UTC)Reply
ఈ చర్చ సంవత్సరాల తరబడి చేసినా వ్యాస సృష్టి కర్తలు స్పందించరు. కనుక మూలాలు లేని వ్యక్తుల అభిప్రాయాలుగా భావిస్తున్న వాక్యాలను తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 05:32, 22 జూన్ 2022 (UTC)Reply
Return to "వయోవృద్ధ పౌరుల నిర్వహణ, రక్షణ , సంక్షేమ చట్టం - 2007" page.