చర్చ:విలేఖరి

తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య

YesY సహాయం అందించబడింది


ఈ వ్యాసం పేరు విలేఖరి అని ఉండాలి. విలేకరి తప్పు పదము. దయచేసి సవరించండి.Rajasekhar1961 (చర్చ) 06:18, 18 మార్చి 2014 (UTC)Reply

చేశాను --వైజాసత్య (చర్చ) 11:13, 19 మార్చి 2014 (UTC)Reply

విలేకరి, విలేఖరి అన్న పదాలలో ఏది సరైనదో నిర్ణయించడం అంత సులభం కాదు. -అరి అన్న తెలుగు ప్రత్యయాన్ని సుంకరి, కుమ్మరి, కమ్మరి మొ॥ తెలుగు పదాల్లో వాడితే, -కర/కరి /కార అన్న సంస్కృత ప్రత్యయాలను సుధాకర, అహంకారి మొ॥ సంస్కృత ప్రత్యయాల్లో వాడుతాము. లెక్క ప్రకారం విలేఖ(సంస్కృతం) లను సృష్టించే వాడు విలేఖకరుడు, విలేఖకరి అవ్వాలి. అయితే, రెండు సన్నిహిత ధ్వనులు పక్కపక్కనే ఉన్నప్పుడు, రెండు ధ్వనులకు మారుగా ఒక్క ధ్వనిని మాత్రమే పలకడం అన్ని భాషలలో జరిగే ధ్వని పరిణామమే (ఈ ధ్వని పరిణామాన్ని సదృశ వర్ణలోపం (Haplology) అని అంటారు). ఈరకమైన ధ్వని పరిణామం వలన విలేఖకరి అన్న పదం విలేఖరి/విలేకరి గా మారిందని చెప్పుకోవచ్చు. లిఖించేవాడిని (రాసేవారిని) అచ్చతెలుగులో “లేకరి” అనేవారు (మహాప్రాణాలు అచ్చతెలుగులో అల్పప్రాణాలు అవుతాయి కదా!). విలేఖలు రాసేవాడు, విలేకరి అయినా కావాలి, లేదా విలేఖకరి అయినా కావాలి. బూదరాజు గారెప్పుడూ విలేకరి అనే రాసేవారు.

Return to "విలేఖరి" page.