చర్చ:వెన్నెల

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri

సూర్యుని నుంచి పొందిన వెలుతురును బట్టి వెన్నెల హెచ్చు తగ్గుల్లో మార్పులుంటాయి. ముఖ్యంగా సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి అడ్డు వచ్చే విధానంపైనే వెన్నెల వెలుతురు యొక్క హెచ్చుతగ్గుల్లో మార్పు ఉంటుంది. ఈవాక్యం తప్పు కనుక తొలగించవలెను.సూర్యునికి చంద్రునికి భూమి అడ్డుగా రావటాన్ని చంద్రగహణము అంటారు.ఇలాభూమి చంద్రునికి,సూర్యునికి అడ్దుగా రావటం సంవత్సరంలో రెండు,మూడుసార్లుజరుగుతుంది,అదియు పూర్ణిమరోజున జరుగుతుంది.మీరువ్రాసిన ప్రకారం రోజూ చంద్రగ్రహణమే?.ఇంతవరకు ఎవ్వరుకనుగొననని ఒకగొప్పవిశ్వరహస్యాన్ని ఆవిస్కరించారు.భూమిపై అర్ధగోళములో ఎప్పుడూ సూర్యకాంతి ప్రసిరించినట్లే,చంద్రుని అర్ధగోళముపై సూర్యకాంతి సతతం ప్రసరిస్తునే వుంటుంది,ఒక్క చంద్రగ్రహణం సమయంలో తప్పించి.చంద్రకాంతిహెచ్చు తగ్గులుగా మారుటకుకారణం,భూమిచుట్టూ చంద్రుని భ్రమణకాలం,భూమి తనచుట్టుతానుతిరుగుటకు పట్టుకాలం, సూర్యునిచుట్టు భూమితిరుగుటకు గల భ్రమణకాలాల వ్యాత్యాసం వలన చంద్రకళలలో తేడాలు,అమవ్యాస,పూర్ణిమలు ఏర్పడుతాయి.ఉదా.పున్నమి రోజు సూర్యుడు పరమట వున్నప్పుడు,చంద్రుడు తూర్పున వున్నందున సూర్యకాంతి పడుచంద్రుని అర్ధగోళముసంపూర్ణంగా కని పిస్త్తుంది. అమవాసరోజున సూర్యచంద్రులు పడమటి దిక్కుననే వుండటంవలన చంద్రకాంతి మనకు కనిపించదు.చంద్రకళలు భ్రమణలాలాల తేడా వలననే తప్ప భూమి సూర్యచంద్రుల మధ్యగా రావటం వలనకాదు. పాలగిరి (చర్చ) 06:35, 28 జనవరి 2013 (UTC)Reply

నేను పాలగిరి గాలి వ్యాఖ్య తో ఏకీభవిస్తాను.( కె.వి.రమణ- చర్చ 12:26, 28 జనవరి 2013 (UTC))Reply


సూర్య చంద్రులు, గ్రహ గమనం, భ్రమణ కాలం, చంద్రకళలు........... ఇవన్నీ సైన్స్ కు సంబంధించిన అంశాలు. వెన్నెల - దాని వర్ణన అనుభూతికి సంబంధించినవి. వ్యాసం ప్రారంభించే ముందు మీరు ఈ అంశాన్ని రాయాలనుకున్నది సైన్స్ పరంగానా లేదా కవితాత్మకం గానా అన్నది ముందుగా నిర్ణయించుకోండి. ఆ తర్వాత మీరు రాయదలచుకున్న అంశానికి సంబంధించి మీకు తెలిసిన విషయాన్ని విషయ ప్రధానంగా పేపర్ మీద రాసి చూసుకుని, విషయం సంపూర్ణంగా ఉందని మీరు సంతృప్తి పడితే ఆ విషయాన్ని తెవికీలో రాయండి. తెవికీలో ఉన్న ఇటువంటి సమాచారాన్ని అథంటిక్ సమాచారంగా టీచర్లు, విద్యార్థులూ భావించి, ఆ ప్రకారంగానే చదువులు సాగిస్తే - రేపటి మన పిల్లకాయలు అజ్ఞానంలో, అయోమయంలో పడిపోతారు. అందువల్ల మీరుగానీ, మేముగానీ ఈ సమాజానికి మేలుచేయ్యకపోగా కీడుచేసినవారం అవుతాము. ఈ వ్యాసం అసంపూర్ణంగా ఉన్నందున సైన్స్ పరంగా రాయాలనుకుంటే - సూర్యుడికీ చంద్రుడికీ వుండే తేడా, సూర్య కాంతిలో హెచ్చు తగ్గులు, చంద్రకాంతి లో హెచ్చు తగ్గులు, అందుకు కారణాలు, సూర్య చంద్రగమనం పై ఆధారపడిన సముద్రపు ఆటుపోట్లు, అందుకు కారణాలు, రవిచంద్ర గ్రహాలపై ఆధారపడిన జ్యోతిష్య శాస్త్ర్హం - ఇలా అనేక అంశాలపై వివరణాత్మకంగా వ్యాసం రాయవలసిందిగా మనవి.
వెన్నెల గురించే రాయాలనుకుంటే - వెన్నెలను కవితా వస్తువుగా తీసుకుని తెలుగు భాషలో నాటి నుంచి నేటి వరకూ వచ్చిన సాహిత్యం, అవి రచించిన సాహితీ వేత్తలు, ఆ వర్ణనలో దాగి ఉన్న భాషా సౌందర్యం, మనసును హత్తుకున్న వెన్నెల చల్లదనం... అందమైన తెలుగు పదాలతో రాయవలసిందిగా మా విన్నపం. .........Malladi kameswara rao (చర్చ) 10:53, 28 జనవరి 2013 (UTC)Reply

సూర్యుని నుండి పడిన కాంతి పరావర్తనం మూలంగా కాంతి కనబడుతుంది. చంద్రుడు అస్వయం ప్రకాశమని గమనించాలి. చంద్రగ్రహణం "పౌర్ణమి" రోజు వస్తుంది. కాని ప్రతి పౌర్ణమి నాడు చంద్రగ్రహణం రాదు కదా. ఈ వ్యాసం శాస్త్రీయ పరంగా సరిదిద్దుదాం( కె.వి.రమణ- చర్చ 12:24, 28 జనవరి 2013 (UTC))Reply

నేను చెప్పిన విషయము తప్పని మీరు సోముగారికి రాసిన చర్చలో వుంది మీ అనుమాన నివృత్తికి, ఇంగ్లిసు వికిపీడియాలోని ఈ వ్యాసాన్ని చదవండి

1.http://en.wikipedia.org/wiki/Lunar_cycle

2.A lunar phase or phase of the moon is the appearance of the illuminated (sunlit) portion of the Moon as seen by an observer, usually on Earth. The lunar phases change cyclically as the Moon orbits the Earth, according to the changing relative positions of the Earth, Moon, and Sun. The half of the lunar surface facing the Sun is always sunlit,పాలగిరి (చర్చ) 15:56, 30 జనవరి 2013 (UTC)Reply

Return to "వెన్నెల" page.