చర్చ:వెల్డింగ్

తాజా వ్యాఖ్య: హైడ్రోజన్ ఉదాహరణ సరియేనా? టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri
వెల్డింగ్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వెల్డింగ్ కు తెలుగుపదం

మార్చు

వెల్డింగ్ కు తెలుగు పదం ఏమిటి?లోహాలను అతికిస్తారు కనుక 'టంకం' అనవచ్చునా?లోహాల జోడింపు పద్ధతి అనాలా? తెలుపగలరు.

టంకం పద్ధతిలో లోహలను అతికించు పద్ధతిలో ,వెల్దింగ్ పద్ధతిలో లోహాలను అతికించు పద్ధతిలో చాలా వ్యత్యాసంవున్నది.టంకం ను ఆంగ్లంలో soldering అంటారు.మీ సందేహాలకు సమాధానం ఈ వ్యాసాన్ని నేను పూర్తిగా విస్తరించిన తరువాత అవగాహన కు వస్తుంది.కొన్ని సాంకేతిక పదాలను ఆంగ్లంలో నే వుండటం అవసరము.లోహాలను జోడించుట,అతుకుట వంటి పద శీర్షికలు సరిపడవు.అందుచే వెల్దింగ్ అనేపదాన్ని,బాగా ఆలోచించినపిమ్మట వుంచాను.పాలగిరి (చర్చ) 04:04, 26 ఫిబ్రవరి 2013 (UTC)Reply
మీ స్పంధనకు ధన్యవాదాలు.
బూదరాజు ఆధునిక వ్యవహారకోశంలో welding అంటే అతకటం అని వున్నది. ఆంగ్ల విక్షనరీలో వెల్డ్ అనగా To bind together inseparably; to unite closely or intimately. అనియు To join two materials (especially two metals) together by applying heat, pressure and filler, either separately or in any combination అని వున్నది. కాబట్టి అతకటం పేరు బాగుంటుంది. ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 07:00, 26 ఫిబ్రవరి 2013 (UTC)Reply
తెవికీ ఒకానొక నియమాల ప్రకారం కొత్త పదాలు ఇక్కడ మనం సృష్టించము. ఆల్రడీ వాడుకలో ఉన్న పదాలతోనే వ్యాసాలు వ్రాస్తాము. అవి ఆంగ్ల పదాలైనా. అంటే ఇక్కడ మనం వెల్డింగ్ అనే వ్రాసుకోవాలి. కాకుంటే తెలుగు పదం అని ఒక విభాగం పెట్టి అక్కడ వివిధ తెలుగు పదాల సలహాలు ఉంచుకోవచ్చు. భవిష్యత్తులో ఆ పదాలు పాపులర్ అయితే అప్పుడు వ్యాసం ప్రధానంగా ఆ పేరుతో మార్చుకోవచ్చు. Chavakiran (చర్చ) 07:49, 26 ఫిబ్రవరి 2013 (UTC)Reply

coalescence కు తెలుగు అర్ధం

మార్చు

{{సహాయం కావాలి}} coalescence కు తెలుగు అర్థం ఎవ్వరైన చెప్పగలరా?.ఆంగ్లవాక్యం:Arc welding is a group of welding process wherein coalescence is provided by heating with an electric arc or arcs.పాలగిరి (చర్చ) 10:25, 28 ఫిబ్రవరి 2013 (UTC)Reply

  • coalescence అనగా "ఏకీభావము" "కలిసిపోవుట" "మేళనము" అనే అర్ధాలు వస్తాయి. దీనినిబట్టి విద్యుత్ చాపం వల్ల లోహాలు ఏకీభావము చెంది ఒకటిగా మారుట అనే అర్ధం వస్తుంది.... (సోము)

హైడ్రోజన్ ఉదాహరణ సరియేనా?

మార్చు

ఈ వ్యాసం లో లోహం ఆక్సీకరణం చెందకుండా జడవాయువు తో చర్య పొందిస్తారని ఉన్నది. జడవాయువుకు ఉదాహరణగా హైడ్రోజన్ అని రాసారు. కాని అది జడవాయువు కాదు.   కె. వి. రమణ. చర్చ 09:13, 3 మార్చి 2013 (UTC)Reply

  వెల్డింగ్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 5 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

 
Wikipedia
Return to "వెల్డింగ్" page.