చర్చ:శ్రీకాళహస్తి

తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Gsnaveen
శ్రీకాళహస్తి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 52 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషంఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


శివ శివయనరాధ శివనామము చేదా
శివ పాదం మీద నీశిరసు ఉంచరాదా
భవసాగరము ఈదే ఇ దొర్భరవేదనఏల
కరుణామయుడుకాదా ప్రభుచరణ ధూళి పడరాదా
హరహరహర అంటే మన కరువు తిరిగి పొదా

కరి పురుగు పాముబోయ మెరలిడగా వినలేదా
కైలాసం దిగి వచ్చి కైవల్యం ఇవలేదా
మదరాంతకుడి పై నిమనసు ఎన్నడుపొదేలా
మమకారుపుతెర స్వామిని కనులార కనరదా

ఇది అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారి కీర్తన
ఇది ఇక్కడ పెట్టచ్చా!
19:28, 16 May 2007‎ శాస్త్రి talk contribs block

సుబ్బరంగా పెట్టవచ్చు --నవీన్ 09:32, 11 జూన్ 2007 (UTC)Reply

శ్రీకాళహస్తి అంధ్ర ప్రదేశ్ లో తిరుపతికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న మున్సిపాలిటీ. ఇది స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న పుణ్య క్షేత్రం. వాడుకలో అందరూ ఈ ఊరిని కాళహస్తి అంటారు.

కాళహస్తి దక్షిణ భారత దేశంలోని శైవ క్షేత్రాలలో ఒకటి. ఆలయ ప్రాంగణం స్వర్ణముఖి నదీ తీరం నుండి సమీపంలో కొండల వరకూ విస్తరించి ఉంది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. ఈ ఆలయ నిర్మాణంలో మూడు పెద్ద గాలి గోపురాలు ఆనాటి భారీ నిర్మాణ శైలికి అద్దం పడతాయి. ఈ ఆలయం కృష్ణ దేవరాయలి కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయం లో వేయి స్తంభాల మండపం ఎంతో ప్రశస్తమైనది.

క్షేత్ర పురాణం:

కాళహస్తికి ఆ పేరు మూడు జీవులనుండి వచ్చింది. శ్రీ (సాలీడు), కాళ (సర్పం), హస్తి (ఏనుగు); ఈ మూడు జీవులు శివార్చన చేసి ఇక్కడే మోక్షాన్ని పొందాయి. ఆలయ గర్భ గుడిలో ఈ మూడు జంతువుల శిల్పాలను చూడవచ్చు. స్కంద పురాణంలోను, శివ పురాణంలోను, లింగ పురాణంలోను కాళహస్తి క్షేత్ర విశేషాలు చూడవచ్చు. స్కంద పురాణంలో అర్జునుడు ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామినర్చించాడని, సమీపంలో పర్వతంపై భరద్వాజ మహర్షిని సందర్శించాడని ఐతిహ్యం. కన్నప్ప (భక్త కన్నప్పగా ప్రశస్తుడు) అనే కోయ జాతి యువకుడు కూడా ఈ స్వామినర్చించి మోక్షం పొందాడు. తమిళ మునులలో అప్పర్, సుందరర్, సంబంధర్ లు ఈ స్వామినర్చిస్తూ అనేక భక్తి గీతాలు వ్రాశారు. శిశుహత్యా దోష నివారణకై సృష్టికర్త బ్రహ్మ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వర్ణముఖి నదిలో స్నానమాచరించాడని మరొక ఐతిహ్యం. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి శుకబ్రహ్మాశ్రమం కూడా కాళహస్తిలోనే కలదు.

Return to "శ్రీకాళహస్తి" page.