చర్చ:సుబ్రహ్మణ్య భారతి

సుబ్రహ్మణ్య భారతి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 45 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


సుబ్రహ్మణ్య భారతి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2017 సంవత్సరం, 1 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ధన్యవాదాలు

మార్చు

ఈ వారం వ్యాసానికి సుబ్రహ్మణ్య భారతి వ్యాసానికి రవిచంద్ర గారు ప్రతిపాదించినట్టు ఇప్పుడే గమనించాను. నాకు సుబ్రహ్మణ్య భారతి అత్యంత అభిమాన కవి. ఆయన పాటలు నోరారా పాడుకుందుకు రాకపోయినా ఆ పాటల మట్టుకు తమిళం నేర్చుకున్నవాణ్ణి. అటువంటి కవి వ్యాసం గూగుల్ అనువాదిత వ్యాసంగా పూజా నైవేద్యాలు లేని ఆలయంలా పడివుండడం చూసి, శక్తి మేరకు అనువదించి శుద్ధి చేశాను. ఆ మహాకవి వ్యాసాన్ని నేను ఒకపక్క అనువదిస్తూండగానే, ఈ వారం వ్యాసంగా పరిగణించడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నా వద్ద తెలుగులో సుబ్రహ్మణ్య భారతిపై వచ్చిన అనువాద గ్రంథాలు ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని మరింత విస్తరిస్తాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 11:16, 19 ఆగష్టు 2016 (UTC)

మీరు రాయడం అయిపోయిన తరువాత చెప్పండి, నేను కూడా సమీక్ష చేస్తాను. అప్పుడు ఈ వారం వ్యాసంగా ప్రకటిద్దాం. --రవిచంద్ర (చర్చ) 11:31, 19 ఆగష్టు 2016 (UTC)
సుబ్రహ్మణ్య భారతి గురించి తెలుగు వాళ్ళు గర్వపడవలసినది ఏంటంటే తమ భాషపట్ల విపరీతమైన అభిమానం చూపించే తమిళుడిగా పుట్టి తెలుగును సుందర తెనుంగు అని పొగిడాడు. అది నాకు నచ్చింది. పవన్ దీనికి మూలాలతో సహా వ్యాసంలో పెట్టే బాధ్యత మీదే సుమా :-) --రవిచంద్ర (చర్చ) 11:35, 19 ఆగష్టు 2016 (UTC)
Return to "సుబ్రహ్మణ్య భారతి" page.