చర్చ:సుమేరు నాగరికత

తాజా వ్యాఖ్య: గణిత పరిభాష టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Inquisitive creature
సుమేరు నాగరికత వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2023 సంవత్సరం, 27 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

వ్యాసంలో ఎన్వికీ లింకులు

మార్చు
కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

ముందుగా ఈ వ్యాసంలో గణనీయమైన కృషి చేసిన వాడుకరి:Inquisitive creature గారికి ధన్యవాదాలు.

వ్యాస పాఠ్యంలో వందల కొద్దీ లింకులు ఇంగ్లీషు వికీపీడియాకు పోతున్నాయి. మొత్తం లింకులు సుమారు 330 ఉండగా, అందులో 275 లింకులు (మొత్తం లింకుల్లో 83%) ఇంగ్లీషు వికీకి ఇచ్చారు. చాలా అరుదైన సందర్భాల్లో ఇతర భాషా వికీపీడియాలకు లింకులు ఇవ్వవచ్చేమో గానీ, మరీ ఎక్కువగా ఇస్తే ఆ వ్యాసం పాఠకుడిని ఆ వికీకి పంపించే వేదిక లాగా తయారౌతుంది. "ప్రధాన వ్యాసాలు" మూస లోను, "ఇవి కూడా చూడండి" విభాగంలోను కూడా ఎన్వికీ లింకులున్నాయి.

  1. తెలుగులో వ్యాసాలు లేనట్లైతే ఎర్రలింకులు ఇచ్చి, తెలుగు లోనే ఆయా పేజీలను సృష్టించాలి. పేజీని సృష్టించనట్లైతే, ఎర్రలింకులు కూడా ఇవ్వరాదు.
  2. మరీ ముఖ్యమైన అంశానికి తగు వివరణ ఇవ్వకపోతే పాఠకులకు విషయం అర్థం కాదనుకున్న సందర్భాల్లో, పేజీని సృష్టించే సమయం లేదనుకుంటే, దానికి క్లుప్తంగా వివరణను నోట్స్ రూపంలో (మూలం) ఇవ్వవచ్చు.

ఈ ఎన్వికీ లింకులను తీసెయ్యాలని నా ప్రతిపాదన.

ఇతర వికీల్లో ఏం చేస్తున్నారో చూద్దామని నేనొక పదికి పైగా ఇతర భాషా వికీల్లో ఈ వ్యాసాన్ని పరిశీలించాను. ఎవ్వరూ ఇలా ఇతర వికీలకు లింకులు ఇవ్వలేదు. __ చదువరి (చర్చరచనలు) 01:39, 28 ఆగస్టు 2022 (UTC)Reply

@Chaduvari నా పనిని గుర్తించినందుకు కృతజ్ఞతలు. ఒక విషయంపై మరింత తెలుసుకోవాలి అనుకుంటే, ఆ పని తేలిక అవడానికే ఇలా ఒక వ్యాసంలో నుండి ఇంకో దానికి లంకెలుంటాయని నేననుకుంటున్నాను. తెలుగు వ్యాసాలు లేని పక్షంలో అలా తెలుసుకోవాలంటే మనందరికీ తెలిసేందుకు అవకాశం ఉన్న భాష కనుక ఎన్‌వికి పెట్టాను. అది కూడా సుమేరు ఎన్‌వికీ వ్యాసంలో ఉన్న పనికిరాని లింకులు కొన్ని పెట్టలేదు. ఏదేమైనా ఇది నా అభిప్రాయము మాత్రమే. ఇదివరకు మీరు కొన్ని లింకులు తొలగించినప్పుడే మీతో చర్చించాల్సింది. మరచిపోయాను.
ఏదేమైనా ఈ చర్చలో తొలగించాలని నిర్ణయమైతే, దాన్ని గౌరవించి రోజుకు 4 చొప్పున తీసేస్తూ పోతాను. అలాగే చర్చతో సంబంధం లేకుండా ఇక మీదట ఎవరైనా తీసేసినా, ఆ సవరణలో నేను మళ్ళీ వేలు పెట్టబోను.
మీరందరూ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోండి గానీ, తెవికీ వ్యాసాలు లేని ఆ అంశాలను గమనించి వాటికి వ్యాసాలు తయారుచేయగలిగితే బాగుంటుందని నా విన్నపం.😀 Inquisitive creature (చర్చ) Inquisitive creature (చర్చ) 03:02, 28 ఆగస్టు 2022 (UTC)Reply
ముందుగా ఈ వ్యాసం సృష్టించి పూర్తి వివరాలతో అభివృద్ధి చేసినందుకు Inquisitive creature గార్కి ధన్యవాదాలు. తరువాత ఈ చర్చలో చదువరి గారి అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను.యర్రా రామారావు (చర్చ) 14:13, 28 ఆగస్టు 2022 (UTC)Reply

గణిత పరిభాష

మార్చు

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం లభించని పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, చర్చ కొనసాగించండి. ఆ తరువాత చర్చ ప్రారంభించినవారు {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చవచ్చు. నిర్వాహకులు అప్పుడప్పుడు ఈ మూస గల పేజీలను సమీక్షించి చర్చ ఒక దశకు చేరి ముందుకు పోయే అవకాశం లేనప్పుడు అదే పని చేస్తారు. ఆరునెలలు గడచినా స్పందనలు లేకపోతే మూసను లింకుగా నిర్వాహకులు చేసినచో, అటువంటి పేజీలను మూసకు లింకున్న పేజీల ద్వారా ఆసక్తిగలవారు పరిశీలించడానికి వీలవుతుంది.
  1. ఈ వ్యాసంలో 'సంస్కృతి' అంకంలో 'గణితం' అనే భాగంలో, అలాగే 'వారసత్వం' అనే అంకంలో గణిత విశేషాలు ఉన్నవి. అవి అర్థం చేసుకునేంత పరిజ్ఞానం, తెలుగులో గణిత పదజాలం తెలిసినవారు ఈ సంబంధిత అంకాలను ఎన్వికిలో చూసి అనువదించగలరు. Sexagesimal system ను షష్టిగుణిత, షష్ట్యంకగుణిత, షాష్టిక వంటి పేర్లతో పిలుస్తారు.
  2. సుమేరు భాషా, శరాకార లిపీ తెలిసిన వారెవరైనా ఆ భాష పదాలు సరిగ్గా ఉన్నాయేమో సరిజూడ ప్రార్థన.
  3. అరబిక్ తెలిసిన వారెవరైనా ఉంటే ప్రదేశాల పేర్లు సరిగ్గా వ్రాయబడ్డవో లేదో చూడండి.
  4. ఈ చర్చ పేజీలో ఇంకో టపాలో ఒక చర్చ జరుగుతున్నది. అందులో పాల్గొని వ్యాస మెరుగుదలకు తోడ్పడగలరు.

Inquisitive creature (చర్చ) 04:39, 4 సెప్టెంబరు 2022 (UTC)Reply

Return to "సుమేరు నాగరికత" page.