చర్చ:స్వాతి నాయుడు(యాంకర్)
ఈ పేజీని తొలగించకూడదు
మార్చుఈ పేజీని తొలగించకూడదు ఎందుకంటే ఆమె ఒక భారతీయ యాంకర్ మరియు తగినంత సూచనలు కలిగి ఉంది. Lingalanga (చర్చ) 12:46, 14 జూన్ 2018 (UTC)
??? Lingalanga (చర్చ) 13:08, 14 జూన్ 2018 (UTC)
డిలీషన్ మూస ఏకపక్షంగా తొలగించడం తగదు
మార్చుడిలీషన్ మూస తీసేసినంత మాత్రాన చర్చ అంతటితో ముగిసిపోదని వాడుకరి గుర్తించాలి, అలానే ప్రతీ భారతీయ యాంకర్‌కీ ఒక్కో పేజీ చొప్పున వికీపీడియా సృష్టించేందుకు ఇదేమీ డేటాబేస్ కాదు. అంశానికి విషయ ప్రాముఖ్యత ఉండాలి. వ్యాసంలో ఉన్న మూలాల్లో కోరా వంటివి పలువురు అభిప్రాయాలు సహా వ్యక్తం చేసే సామాజిక వేదిక, కొన్నిటిలో ఈమె ఒక నటి అన్న వివరం తప్ప మరేం లేదు. ఈ విషయానికి విషయ ప్రాముఖ్యత ఉందని నిరూపించే, ప్రామాణికమైన ఆధారం ఒక్కటీ సమర్పించలేదు. భాష కూడా చాలా కృతకంగా ఉంది (ఉదాహరణకు ఆమె తన YouTube ప్రాజెక్ట్ల నుండి ఉచితమైనప్పుడల్లా ఆమె పుస్తకాలు చదవడం ఇష్టపడుతుంటుంది. ఆమె భవిష్యత్లో డైరెక్టర్ గా మారడానికి ఇష్టపడింది. ఆమె పెంపుడు జంతువులకి ఇష్టం ఉంది, ఆమె తన చిన్ననాటి నుండి ఆమెకు పిల్లులను కలిగి ఉంది, ఆమె కోరుకునేటప్పుడు కూడా ఆమె కుక్కలను కలిగి ఉండాలని కోరుకుంటుంది.) పైగా ఆమె స్వంత బ్లాగ్ నుంచి కూడా లింకులు ఇచ్చారు. ఇవన్నీ నాణ్యతాపరంగా చాలా తీవ్రమైన సమస్యలు. కనుక ఈ వ్యాసాన్ని తొలగిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:05, 15 జూన్ 2018 (UTC)