చర్చ:47వ జి7 సమ్మిట్

తాజా వ్యాఖ్య: అంతరలింకులు చేర్చడం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

అంతరలింకులు చేర్చడం

మార్చు

నమస్కారం Aloknandaprasad గారు, తెవికీకి స్వాగతం. వ్యాసాలలో అంతర్ లింకులు చేర్చే టప్పుడు ముఖ్యంగా తెలుగు వికీలో ఉన్న వ్యాసాలకు లింకు చేర్చడం మంచిది. ఉదాహరణకు భారతదేశానికి భారతదేశం అని చేర్చవచ్చు అది నీలం రంగులో వస్తుంది, ఒక వేళా ఆ పేజీ లేనట్టయితే ఎర్ర లింక్ వస్తుంది. లేదా మీరు ఆంగ్ల వికీ గాని ఇంకా ఇతర వికీల నుండి లింకులు చేర్చాలనుకుంటే నొటేషన్ ఉపయోగించవచ్చు. ఉదాహరణకి కేరళ కాంగ్రెస్ కి ఆంగ్ల వ్యాసం నుండి లింక్ ఇలా ఇవ్వచ్చు, కేరళ కాంగ్రెస్. ధన్యవాదాలు Nskjnv (చర్చ) 15:43, 2 జూలై 2021 (UTC)Reply

ధన్యవాదాలండి! నొటేషన్ ఎలా ఉపయోగించాలి? Aloknandaprasad (చర్చ) 15:48, 2 జూలై 2021 (UTC)Reply

తెలిసిందండి, ధన్యవాదాలు. ఒక సందేహం - కొన్ని వికి పేజీలు ఆంగ్లంలో మాత్రమే ఉన్నవి తెలుగులోకి అనువదించబడవలసి ఉండవచ్చు. అలాంటి వాటికి ఎర్ర లింక్ పెట్టాలా లేక ఆంగ్ల వికీ లింక్ పెట్టాలా? Aloknandaprasad (చర్చ) 15:57, 2 జూలై 2021 (UTC)Reply

@Aloknandaprasad: తెలుగు వికీపీడియాలో తెలుగు మాత్రమే వచ్చినవారు చాలామంది చదువుతారు కాబట్టి తెలుగులో వ్యాసం లేకపోతే, ఉండదగ్గది అనుకుంటే ఎర్ర లింకు ఇవ్వడమే ఉత్తమం అండి. మరొక ముఖ్యమైన అంశం కూడా ఇందులో ఇమిడివుంది. అదేమిటంటే - ఎర్ర లింకు ఇస్తే, అక్కడ వ్యాసం లేదన్న విషయం తోటి వాడుకరులు గమనించి, ఆసక్తి ఉంటే సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి, తెలుగులో ఉంటే లింకు, లేకుంటే ఎర్ర లింకు మంచిది. ఆంగ్ల వ్యాసాలను లింక్ చేయడం ప్రయోజనకరం కాదు. --పవన్ సంతోష్ (చర్చ) 19:38, 2 జూలై 2021 (UTC)Reply
Return to "47వ జి7 సమ్మిట్" page.