చర్లపల్లి (హైదరాబాదు)

మేడ్చల్ జిల్లా, కాప్రా మండలానికి చెందిన గ్రామం.
(చర్లపల్లి, హైదరాబాదు నుండి దారిమార్పు చెందింది)

చర్లపల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కాప్రా మండలానికి చెందిన గ్రామం.ఇక్కడ పరిశ్రమలు ఉండడంతో ఇది పారిశ్రామిక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల వార్డుల పునర్విభజన ప్రకారం, తూర్పు జోన్ లో ఉన్న కాప్రా సర్కిల్ 3 వ విభాగంలోకి వస్తుంది.

చర్లపల్లి
సమీప ప్రాంతాలు
చర్లపల్లి is located in Telangana
చర్లపల్లి
చర్లపల్లి
Location in Telangana, India
చర్లపల్లి is located in India
చర్లపల్లి
చర్లపల్లి
చర్లపల్లి (India)
Coordinates: 17°03′36″N 79°18′00″E / 17.0600°N 79.3°E / 17.0600; 79.3
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్
జోన్తూర్పు
సర్కిల్కాప్రా
వార్డు3
Elevation
17.0700 మీ (56.0039 అ.)
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500051&501301
Area code0402726
Vehicle registrationటి.ఎస్ 08

పరిశ్రమలు మార్చు

నగరంలోని పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటైన ఈ చర్లపల్లి వివిధ పారిశ్రామిక సంస్థలకు నిలయంగా ఉంటూ చిన్న తరహా, ఉత్పాదక పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది.[1][2]

కేంద్ర కారాగారం మార్చు

ఇక్కడ కేంద్ర కారాగారం ఉంది. హైదరాబాదు నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కారాగారం 120 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయబడింది.

రవాణా వ్యవస్థ మార్చు

చర్లపల్లికి సమీపంలోని చంగిచర్లలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్ డిపో ఉంది. చర్లపల్లి మీదుగా అనేక బస్సులు వివిధ ప్రాంతాలకు నడుస్తున్నాయి. చర్లపల్లిలో రైల్వేస్టేషన్ కూడా ఉంది.పెరిగిన ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఢిల్లీ, చెన్నై తదితర రూట్లకు చర్లపల్లి రైల్వే జంక్షను అనుకూలంగా ఉండడంతో నగర శివార్లలోని చర్లపల్లి రైల్వే జంక్షనును అభివృద్ధి చేయబోతున్నారు.[3]

మూలాలు మార్చు

  1. సాక్షి (15 August 2018). "ఇండస్ట్రీ ఇన్ సిటీ @1857". Archived from the original on 11 September 2018. Retrieved 11 September 2018.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-11-10. Retrieved 2018-09-11.
  3. నమస్తే తెలంగాణ (31 August 2018). "మెట్రో పరుగులు ప్రత్యేకం". Archived from the original on 11 September 2018. Retrieved 11 September 2018.

వెలుపలి లంకెలు మార్చు