చలాకీ రాణి కిలాడీ రాజా
చలాకి రాణి కిలాడి రాజా 1971, అక్టోబర్ 29న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి విజయ్ దర్శకునిగా పనిచేశాడు. ఎం.సి.ఆర్.మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎం.చిట్టిబాబు, డి.రంగనాథన్ నిర్మించారు.[1]
చలాకీ రాణి కిలాడీ రాజా (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయ్ |
తారాగణం | కృష్ణ, విజయలలిత, జగ్గారావు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | ఎమ్.సి.ఆర్.మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కృష్ణ - కృష్ణ
- విజయలలిత - షీలా
- జగ్గారావు
- రాజబాబు
- అంజలీదేవి - శాంతమ్మ
- కైకాల సత్యనారాయణ - రుద్రయ్య
- ఆనంద్ మోహన్
- నల్ల రామ్మూర్తి
- రవికుమార్
- విజయశ్రీ
- జ్యోతిలక్ష్మి
- బేబీ బ్రహ్మాజీ - కృష్ణ (బాలుడిగా)
- త్యాగరాజు
- ప్రభాకర్‌రెడ్డి - ముఠా నాయకుడు
- మిక్కిలినేని - కాబూలీ
- హరగోపాల్
- అంజన్ కుమార్
- జెమిని బాలు
- శేషగిరిరావు - బడిపంతులు
- రామారావు
- రఘురాం
- ప్రభాకర్
- శ్రీనివాస్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: విజయ్
- నిర్మాతలు: ఎం.చిట్టిబాబు, డి.రంగనాథన్
- స్క్రీన్ ప్లే: ఎం.డి.సుందర్
- ఛాయాగ్రహణం: పి.ఎస్.ప్రకాష్
- కూర్పు: పి.భక్తవత్సలం
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- పాటలు: కొసరాజు, ఆరుద్ర, వీటూరి, దాశరథి
- మాటలు: విద్వాన్ కణ్వశ్రీ
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి
- కళ: బి.చలం
- నృత్యాలు: బి.హీరాలాల్, చిన్ని-సంపత్, శ్రీను
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటలకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్ని సమకూర్చాడు.[2]
క్ర.సం. | పాట | రచయిత | గాయకులు |
---|---|---|---|
1 | వస్తావా వయారముంది ఈ పడుచుపిల్ల రమ్మంది చూస్తావా తమాషా ఉంది ఈ చుక్కలోన కైపుంది | ఆరుద్ర | ఎల్.ఆర్.ఈశ్వరి |
2 | ఓ బుల్లిమామా ఓ మల్లిమామా మత్తులోన చిత్తుచేయు మందుందిరా ఒక్కసారి యేసుకోరా అక్కరైతే సూసుకోరా | కొసరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి |
3 | భలే కుర్రదానా హుషారైన జాణా నీ వాడిచూపులోన నే ఓడిపోయానే | దాశరథి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
4 | అమ్మ బాబో నీ అబ్బసోకుమాడ ఊరుకోర కిల్లాడి కొంటెవాడా | వీటూరి | ఎల్.ఆర్.ఈశ్వరి |
5 | జతగాడా ఇటురారా సరెలేరా కాచుకోరా నిన్నె కోరి వచ్చారా కన్ను వేసి వచ్చారా | కొసరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి |
కథ
మార్చుప్రభుత్వానికి చెందిన భరత్‌పూర్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్న నూర్జహాన్ వజ్రాన్ని దొంగిలించడానికి ఒక దొంగల ముఠా బయలుదేరి వెళ్ళింది. ఆ ముఠానాయకుడు ఈ దోపిడీకి లీడర్‌గా రుద్రయ్యను పంపాడు. డైమెండ్‌ను జయప్రదంగా దొంగిలించిన రుద్రయ్య దానిని బాస్‌కు అప్పగించకుండా తానే తీసుకుని పరారీ అయ్యాడు.ముఠానాయకుడు రుద్రయ్యను పట్టుకోవడానికి భీమన్న, జోసెఫ్‌లను నియమిస్తాడు. వాళ్ళు రుద్రయ్య కోసం దేశమంతా వెదుకుతుంటారు. రుద్రయ్య భార్య శాంతమ్మ దిక్కులేనిదై పురిటిలో ఉన్న తన బిడ్డ కృష్ణతో దేశాంతరాలు పట్టింది. కృష్ణ పెరిగి పెద్దవాడయ్యాడు. శాంతమ్మ ఒక ఫ్యాక్టరీలో కూలీ చేసి కృష్ణను చదివిస్తూ, తండ్రి జీవితం అతనికి తెలియకుండా పెంచింది. ఐతే కృష్ణ దొంగల్ని దోచుకునే గజదొంగగా మారి ఆమె కలల్ని కల్లలుగా మారుస్తాడు. శాంతమ్మ కృంగిపోతుంది. అగ్నికి గాలి తోడైనట్టు ఈ విషయంలో షీలా అనే క్లబ్ డాన్సర్ కృష్ణకు తోడవుతుంది. ఆ పరిస్థితులలో కృష్ణకు బాస్ ఎదురై రుద్రయ్య ఫోటో చూపించి అతన్ని పట్టుకోగలిగితే లక్షరూపాయలు బహుమానం ఇస్తానని చెబుతాడు. రుద్రయ్య తన తండ్రి అని తెలియని కృష్ణ అతడిని తప్పక పట్టుకుంటానని వాగ్దానం చేస్తాడు. రుద్రయ్య దగ్గరున్న డైమండ్ కోసం షీలాకు సంబంధించిన మరొక ముఠా ఎత్తులు వేస్తూ ఉంటుంది. ఈ రహస్యం కృష్ణకు తెలియనివ్వకుండా షీలా వలపులు నటిస్తుంటుంది. ఒక రోజు రుద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారని షీలా ద్వారా విన్న శాంతమ్మ, నిర్ఘాంతపోయి భర్తను చూడటానికి పోలీస్ స్టేషనుకు పోతుంది. కానీ అక్కడ తన కుమారుడు కృష్ణను పోలీసులు బేడీలు వేసి తీసుకువచ్చిన దృశ్యం చూసి నిలువునా నీరై ఆత్మహత్యకు పాల్పడుతుంది. శాంతమ్మ మరణించిందా? కృష్ణ తన తండ్రిని పట్టుకోగలిగాడా? షీలా ముఠా ప్రయత్నం నెరవేరిందా? రుద్రయ్య ఏమౌతాడు? వంటి ప్రశ్నలకు మిగిలిన సినిమాలో సమాధానం లభిస్తుంది.[2]
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Chalaki Rani Kiladi Raja (Vijay) 1971". ఇండియన్ సినిమా. Retrieved 27 December 2022.
- ↑ 2.0 2.1 కణ్వశ్రీ (1971). Chalaki Rani Kiladi Raja (1971)-Song_Booklet (1 ed.). మద్రాస్: ఎం.ఆర్.సి.మూవీస్. p. 12. Retrieved 27 December 2022.