ప్రధాన మెనూను తెరువు
ఎస్.వి. జగ్గారావు

ఎస్.వి. జగ్గారావు పాతతరం తెలుగు సినిమా నటుడు.[1] ఇతడు దుష్టపాత్రలను, సహాయపాత్రలను ఎక్కువగా పోషించాడు. ఈయన జగ్గారావు యన్.టి.ఆర్ నటించిన పలు చిత్రాలలో విలన్ పాత్రలు పోషించాడు.[2] ఈయన చివరి చిత్రం నాగార్జున నటించిన డాన్.

జీవిత విశేషాలుసవరించు

ఆయన గుంటూరు జిల్లాలోని తెనాలి తాలూకాకు చెందిన మోరంపూడి గ్రామంలో జన్మించాడు. బాల్యంలో ఆయన కాంగ్రెస్ సేవాదళంలో చేరి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనాడు. ఆయన గౌతు లచ్చన్న, టంగుటూరి ప్రకాశంపంతులు, ఎన్.జి.రంగా వంటి వారితో కలసి పనిచేసాడు. సమాజం చిత్ర నిర్మాణ సమయంలో ఆర్.నాగేశ్వరరావు గారు ఆకస్మిక మరణం తరువాత ఆయన స్థానంలో జగ్గారావు నటించి చిత్రాన్ని పూర్తి చేసాడు. తరువాత భక్త శబరి చిత్రంలో సన్యాసిగా నటించాడు. ఈయన ఎన్.టి.రామారావుచే ఆకర్షించబడి భీష్మ సినిమాలో దుశ్శాసనునిగా నటించాడు. అప్పటి నుండి ఆయన ఎన్.టి.ఆర్ కు కుడిభుజంగా మెలిగాడు. ఎక్కడ ఎన్.టి.ఆర్ ఉన్నా అక్కడ జగ్గారావు ఉండేవాడు. ఎన్.టి.రామారావు తరువాత సూపర్‌స్టార్ కృష్ణ ఆయనకు అన్ని చిత్రాలలో అవకాశం కల్పించాడు. అదే విధంగా ప్రముఖ దర్శకుడు విఠలాచార్య దర్శకత్వంలొ అనేక చిత్రాలలొ నటించాడు.[3] జగ్గారావు బాపు దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమా ద్వారా నటుడిగా రంగప్రవేశం చేశాడు. ఎన్టీ రామారావుకి అనుచరుడిగా పేరున్న జగ్గారావు ప్రతినాయకునిగా సుమారు 500 సినిమాలలో నటించాడు.[4] ఆయన బాపు, రమణలతో పాటు హైదరాబాదుకు మకాం మార్చాడు. ఈయన ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సభ్యునిగా కీలక పాత్ర వహించాడు.

చిత్రసమాహారంసవరించు

వ్యక్తిగత జీవితంసవరించు

ఈయనకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. ఈయన 2013 ఫిబ్రవరి 23 న తన 88వ యేట మరణించాడు.[2]

మూలాలుసవరించు

  1. "Senior Telugu villain no more". gulte.com. Retrieved 5 October 2016.
  2. 2.0 2.1 నేల రాలిన తారలు -పర్చా శరత్‌కుమార్ 27/12/2013
  3. Senior Actor Jaggarao Expired
  4. నేటి వార్తలు... టూకీగా sat, Feb 23, 2013

బయటిలింకులుసవరించు