కణ్వశ్రీ
కణ్వశ్రీ నాటక రచయిత, సినీ రచయిత.
జీవిత విశేషాలుసవరించు
ఇతని అసలు పేరు మైసూరు చంద్రశేఖరం.[1] చంద్రశేఖర కణ్వశ్రీ, కణ్వశ్రీ, విద్వాన్ కణ్వశ్రీ అనే పేర్లతో రచనలు చేశాడు. ఇతడు నెల్లూరు జిల్లా, కోట గ్రామంలో జన్మించాడు. అధ్యాపక వృత్తిలో ఉన్న ఇతడు నెల్లూరులో లలితకళానిలయాన్ని స్థాపించాడు. నెల్లూరు యాసలో నాటకం వ్రాసిన తొలి రచయితగా ప్రసిద్ధుడు. ఇతని నాటకాలన్నీ లలితకళానిలయం పక్షాన రాష్ట్రమంతటా ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. ఇతని బాలనాగమ్మ, మాయాబజార్ నాటకాలను నేటికీ సురభి నాటకసమాజం ప్రదర్శిస్తున్నది. ఇతడు మద్రాసులో స్థిరపడిన తరువాత కొన్ని సినిమాలకు మాటలు, పాటలు వ్రాశాడు.
రచనలుసవరించు
పద్యకావ్యాలుసవరించు
- సత్యాగ్రహి
నాటకాలుసవరించు
- అజాతశతృ[2] (1948)
- ఆనాడు (1948)
- ఇదా ప్రపంచం (1950)
- బాలనాగమ్మ (1950)
- మాయాబజారు (1950)
నాటికలుసవరించు
- లవ్ ఈజ్ బ్లైండ్ (1970)
సినీరచనలుసవరించు
ఈ క్రింది సినిమాలకు వ్రాశాడు[3].
- శ్రీ కృష్ణ పాండవ యుద్ధం - పాటలు
- నీడలేని ఆడది - పాటలు
- అమ్మాయిలూ జాగ్రత్త - పాటలు
- జగన్మాత - పాటలు
- భోగ భాగ్యాలు - పాటలు
- చలాకీ రాణి కిలాడీ రాజా - సంభాషణలు
మూలాలుసవరించు
- ↑ దాసరి, నల్లన్న (2008). నాటక విజ్ఞాన సర్వస్వం (1 ed.). హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 240.
- ↑ చంద్రశేఖర, కణ్వశ్రీ (1948). అజాతశత్రు (1 ed.). నెల్లూరు: వి.వి.నాయుడు అండ్ సన్స్. Retrieved 2 February 2015.
- ↑ ఘంటసాల గళామృతం బ్లాగునుండి[permanent dead link]