దేవరకోట సంస్థానానికి చల్లపల్లి రాజధానిగా ఉండేది.చల్లపల్లి కోటను 1860 సంవత్సర కాలంలో నిర్మించారు.ఈ జమీ పరిధిలో సుమారు వందకుపైగా గ్రామాలు ఉండేవి. యార్లగడ్డ వంశీయులు చల్లపల్లిని పాలించేవారు.[1][2]

చల్లపల్లి కోట చిత్రం

కోట విస్తీర్ణం

మార్చు

ఈ కోట 190 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. 1949లో భారతదేశంలో విలీనమైంది.

చల్లపల్లి కోట

మార్చు

చల్లపల్లిలో ప్రధాన ఆకర్షణ గా ఈ రాజావారి కోట. అశోక వృక్షాలు, భారీ చెట్లతో, నిండైన పచ్చదనంతో ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది. కోటలోని అపురూప శిల్ప సంపద అందరినీ ఆకట్టుకుంటుంది. కోట ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసిన కంచుగంట ఆ రోజుల్లో చల్లపల్లివాసులకు గడియారంగా ఉపయోగపడేది. గంట గంటకూ.. ఆ కంచు గంట మోగించే వాళ్లు. దానిని బట్టి కోట చుట్టుపక్కల ప్రజలు సమయాన్ని తెలుసుకునేవారు. నేటికీ ఆ సంప్రదాయం కొనసాగుతుంది.[3]

ఇతర విషయాలు

మార్చు

కోటముందు భాగం శిథిలమై కలప దెబ్బతినటంతో శిథిలాలను తొలగించి నూతన దూలాలను ఏర్పాటుచేసి పటిష్టపరుస్తున్నారు.కోట పైభాగంలో రెండువైపులా ఉన్న గదులకు మరమ్మతులు చేయించి గురుజుల ఏర్పాటు, రంగులు వేశారు.వందల ఏళ్ళనాటి శిల్పాలు, కత్తులు,శూలాలు తదితరాలను ప్రదర్శనగా ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.[4]

రవాణా సౌకర్యం

మార్చు

విజయవాడ నుంచి చల్లపల్లి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

ఇంకా చదవండి

మార్చు

ఆంధ్రప్రదేశ్ కోటలు

మూలాలు

మార్చు
  1. "Challapalli Fort చల్లపల్లి రాజావారి కోట……". www.telugukiranam.com. Archived from the original on 2019-05-15. Retrieved 2019-12-23.
  2. "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2010-06-13. Retrieved 2022-05-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. ఈనాడు దినపత్రిక. "చల్లపల్లి చూసొద్దాం". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. చల్లపల్లి చూసొద్దాం. "చల్లపల్లి చూసొద్దాం". ఈనాడు.

వెలుపలి లంకెలు

మార్చు