చల్లపల్లి

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం లోని గ్రామం

చల్లపల్లి (ఆంగ్లం: Challapalli), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం. పిన్ కోడ్ నం. 521 126., ఎస్.టి.డి.కోడ్ = 08671.[1]

చల్లపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
చల్లపల్లి is located in Andhra Pradesh
చల్లపల్లి
చల్లపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°07′00″N 80°56′00″E / 16.1167°N 80.9333°E / 16.1167; 80.9333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి కట్టా పద్మావతి
జనాభా (2001)
 - మొత్తం 15,423
 - పురుషులు 7,558
 - స్త్రీలు 7,865
 - గృహాల సంఖ్య 3,935
పిన్ కోడ్ 521126
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

చల్లపల్లి మండలంసవరించు

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చిడెపూడి, పాగోలు , నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.

చల్లపల్లి గ్రామానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది.

చల్లపల్లి రాజులు/జమిందారులుసవరించు

చల్లపల్లిని రాజధానిగా యార్లగడ్డ వంశీకులు దేవరకోట రాజ్యమును కొద్ది కాలము పాలన చేశారు. ఇప్పటికీ ఇక్కడ చల్లపల్లి రాజా కట్టించిన చల్లపల్లి కోట అనే భవంతి ఉంది. సా.శ. 1576 లో యార్లగడ్డ గురువారాయడు ఈ రాజ్యమును స్థాపించారని ప్రతీతి[3]. చల్లపల్లి రాజవంశీకులు నేటికీ అక్కడ జీవిస్తున్నారు. వీరిని చల్లపల్లి జమిందారులు అని కూడా అంటారు. స్వాతంత్ర్యము వచ్చిన పిమ్మట, రాచరిక వ్యవస్థ నిర్మూలనతో, చల్లపల్లి రాజులకు అధికారము పోయింది.

చల్లపల్లి కోటసవరించు

పూర్వము ప్రజలకు సమయాన్ని తెలియజేయటానికి కోటలో ప్రతి గంటకు గంటను మోగించేవారు. ఈ సంప్రదాయము నేటికీ కొనసాగుతున్నది. ఈ కోటనుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి కనిపిస్తుందని, కోట నుండి కనకదుర్గ గుడి రహస్య సొరంగము ఉన్నదని స్థానిక ప్రజల నమ్మకము. అలానే, మచిలీపట్నము శివార్లలో వున్న శివగంగ అమ్మవారి గుడికి అయ్యే ఖర్చు రాజావారు భరించేవారని, కోట నుంచి గుడికి సొరంగమార్గము ఉంది అని ప్రతీతి. ఈ కోట రమారమి 200 సంవత్సరాల పూర్వము కట్టించింది. కోటని చూడటానికి, అక్కడ వారిని కలువటానికి బయటి వారికి కుదురుతుంది, కానీ అనుమతి తీసుకోవాలి.

గ్రామ భౌగోళికంసవరించు

[4] సముద్రమట్టానికి 10 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలుసవరించు

రేపల్లె, మచిలీపట్నం, పెడన, తెనాలి

సమీప మండలాలుసవరించు

ఘంటసాల, మోపిదేవి, మొవ్వ, అవనిగడ్డ

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 59 కి.మీ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, హైదరాబాదు, నుండి నేరుగా బస్సు సౌకర్యము ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

 1. శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల.
 2. రాజావారు గ్రామంలో ఒక ఉన్నత పాఠశాలను కూడా కట్టించారు. పరిసర గ్రామాలకు ఇదే పెద్ద ఉన్నత పాఠశాల.
 3. ఆంధ్ర ప్రదేశ్ పభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల:- ఈ పాఠశాల స్థానిక నారాయణరావునగర్‌లో ఉంది. ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు, 500 మంది విద్యార్థినులు విద్యనభ్యసించుచున్న ఈ పాఠశాలలో, ఎస్.సి.ఉప ప్రణళిక నిధులు 4.3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, అదనపు గదుల నిర్మాణానికి, 2013లో శంకుస్థాపన నిర్వహించ్నారు. ఈ నిర్మాణం ఇంకనూ పూర్తికాలేదు. [21]
 4. విజయశ్రీ సన్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల:- 2015,అగష్టు-22,23 తేదీలలో, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన జపాన్ షిటోకాన్ కరాటే ఛాంపియన్ షిప్-2015 పోటీలలో, ఈ పాఠశాల విద్యార్థి కొనకళ్ళ జగన్ శంకరతేజ రజతపతకం సాధించాడు. ఈ పాఠశాలకే చెందిన విద్యార్థిని కొనకళ్ళ భావన కాంస్య పతకం సాధించింది. [17]
 5. సెయింట్ మదర్ థెరెస్సా ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల.
 6. శ్రీ వరదా వెంకటరామలింగేశ్వరరావు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేయుచున్న శ్రీమతి వేసంగి లక్ష్మీకుమారి, జిల్లా ఉత్తమ ఉపాధాయురాలిగా ఎంపికైనారు. ఈమె ఈ పురస్కారాన్నీ, ప్రశంసా పత్రాన్నీ, 2015,సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, కృష్ణా జిల్లా పాలనాధికారి శ్రీ బాబు-ఏ, చేతులమీదుగా అందుకున్నారు. [20]

విజయ జూనియర్ కాలెజి, సిర్స్ప జూనియర్ కాలేజి, శారదా సన్ ఫ్లవర్ జూనియర్ కాలేజి, శ్రీకృష్ణా జూనియర్ కాలెజి, సెయింట్ ధామస్ ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్, చల్లపల్లి ఇంగ్లీష మీడియం హైస్కూల్, ఎ.పి.ఎస్.డబ్ల్యు రెసిడెన్సియల్ స్కూల్, విజయ కాన్వెంట్ హైస్కూల్, వి.ఎస్. సన్ ఫ్లవర్ స్కూల్, చల్లపల్లి

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

వైద్య సౌకర్యంసవరించు

కస్తూర్బా ప్రభుత్వ ఆసుపత్రిసవరించు

2004లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకలతో నిర్మించారు. ఇది మోపిదేవి, మొవ్వ, చల్లపల్లి, ఘంటశాల మండలాలో పెద్ద ప్రభుత్వ అసుపత్రి.

పద్మావతి వైద్యశాలసవరించు

ఈ వైద్యశాల 28వ వార్షికోత్సవాన్ని 2015,డిసెంబరు-26వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలకు, స్వచ్ఛ చల్లపల్లి రథసారథి డాక్టర్ డి.ఆర్.కె.ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు నూతన వస్త్రాలు బహుకరించారు. [25]

బ్యాంకులుసవరించు

 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫో.నం. 08671/222 200.
 2. ఆంధ్రా బ్యాంక్.

ఆశ్రమాలుసవరించు

అదరణ గృహం, వృద్ధాశ్రమం:- చల్లపల్లిలోని నిమ్మలతోటలో, 2011,జూన్-6వ తేదీనాడు, గుడివాడ మండలం, మోటూరు గ్రామానికి శ్రీ జంజనం రామమోహనరావు, జీసస్ క్రైస్ట్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వృద్ధాశ్రమం నెలకొల్పి, కుటుంబాలనుండి బయటకు వెళ్ళిపోతున్న వృద్ధులకు ఆశ్రయం, వసతి సౌకర్యాలు కల్పించారు. 14 మంది నిత్య అన్నదాతలుగా ఉన్న ఈ ఆశ్రమంలో, ప్రస్తుతం 30 మంది అనాథ వృద్ధులు ఆశ్రయం పొందుచున్నారు. ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగి అయిన శ్రీ రామమోహనరావు, ఉదయం 8 గంటల వరకు, ఈ ఆశ్రమంలో పనిచేసి అఫీసుకు వెళ్ళిపోతారు. తిరిగి సాయంత్రం అరు గంటలకు ఇక్కడకు వచ్చి తన సేవలందించుచున్నారు.[22]

ఎన్.టి.ఆర్.పార్క్సవరించు

చల్లపల్లి గ్రామంలోని ఈ పార్కును రెండు దశాబ్దాల క్రితం రెండు ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసారు. నారాయణరావునగర్ లో స్థలాలను పేదలకు అందించిన తరుణంలో, ఈ పార్కులో, తెలుగు మాగాణ సమారాధన స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ పార్కు కార్తీకమాస వనసమారాధన లాంటి కార్యక్రమాలకు అనువుగా ఉంది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ నుగూడా అభివృద్ధిపరచినరు. ఇటీవల ఈ పార్కును దాతలు, పంచాయతీ సహకారంతో నందనవనంలాగా తీర్చిదిద్దినారు. [23]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

కె.ఈ.బి.కెనాల్.

రాజకీయముసవరించు

ఇక్కడ ఒక కమ్యూనిస్టు స్తూపము కూడా ఉంది.

గ్రామ పంచాయతీసవరించు

 1. ఈ గ్రామ పంచాయతీ 1888 లో బ్రిటిష్ వారి కాలంలోనే ఏర్పడింది. నియోజకవర్గంలోనే అతి పెద్ద రెండవ పంచాయతీ. 2011 నాటికి ఓటర్లు=10,557.
 2. 1982లో తాలుకా విధానమును మార్చిన తరువాత, దివి తాలుకా నుంచి చల్లపల్లి మండలాన్ని సృష్టించారు. చల్లపల్లి గ్రామానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది.
 3. "గంగులవారిపాలెం" చల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
 4. 2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కట్టా పద్మావతి సర్పంచిగా ఎన్నికైనారు. [3]
 5. చల్లపల్లి గ్రామాన్ని స్వచ్ఛభారత్ స్ఫూర్తితో,"స్వచ్ఛ చల్లపల్లి"గా తీర్చిదిద్దటానికి గత 200 రోజులుగా జనవిఙాన వేదిక ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ సహకారంతో చేయుచున్న కృషికి, స్వచ్ఛఛాంపియన్ పురస్కారం లభించినది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, జాతీయస్థాయిలో, హైదరాబాదులో "సుకుకి ఎక్స్ నోరో" అను స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన "క్లీన్ ఇండియా" సదస్సులో, ఈ పురస్కారాన్ని, జన విఙాన వేదిక అధ్యక్షులు డాక్టర్ డి.ఆర్.కె.ప్రసాద్, డాక్టర్. పద్మావతి, గ్రామ సర్పంచ్ శ్రీమతి కట్టా పద్మావతి, ఈ పురస్కారాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఐ.వి.ఆర్.కృష్ణారావు, శ్రీమతి అక్కినేని అమల చేతులమీదుగా అందుకున్నారు. ఈ పురస్కారాన్ని, జనవిఙానవేదీక, చల్లపల్లి గ్రామపంచాయితీ లకు సంయుక్తంగా అందించారు. [16]
 6. చల్లపల్లి గ్రామ పంచాయతీ జాతీయస్థాయిలో స్వచ్ఛ పురస్కారానికి ఎంపికైనది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, 2017,మార్చి-8న, గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో నిర్వహించు ఒక కార్యక్రమంలో, చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి కట్టా పద్మావతి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నుండి ఈ పురస్కారం అందుకోనున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం "స్వచ్ఛశక్తి సప్తాహం-2017" కార్యక్రమంలో పాల్గొనేటందుకు ఈమె గుజరాత్ రాష్ట్రం వెళ్ళినారు. చల్లపల్లి కేంద్రంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహించడం, జాతీయస్థాయిలో స్వచ్ఛ చల్లపల్లికి ఖ్యాతి లభించింది. చల్లపల్లిని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా రూపుదిద్దుకునేటందుకు చురుకైన పాత్ర వహించిన ఈ మహిళా సర్పంచిని ప్రభుత్వం గుర్తించి, ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈమెతోపాటు పురస్కారానికి ఎంపికైన మహిళా సర్పంచ్‌లంతా గుజరాత్ రాష్ట్రంలోని వెహెలాల్ గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. [28]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయలుసవరించు

 1. శ్రీ లక్ష్మీగణపతిస్వామివారి ఆలయం:- ఈ ఆలయ 41వ వార్షికోత్సవం, 2017,ఆగష్టు-26వతేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీగణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. [30]
 2. శ్రీ కార్యసిద్ధి గణపతి దేవాలయం:- స్థానిక నిమ్మలతోటలో నూతనంగా నిర్మిచబోయే ఈ ఆలయ నిర్మాణానికి, 2014, ఆగష్టు-10, ఆదివారం నాడు, భూమిపూజ చేసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయినది. విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2014,డిసెంబరు-13వ తేదీ శనివారం, మార్గశిర శుద్ధ చతుర్దశినాడు, స్వామివారి గ్రామోత్సవాన్ని, భక్తులు ఘనంగా నిర్వహించారు. 15వ తేదీ సోమవారం నాడు, ఉదయం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, అఖండస్థాపన, మద్యాహ్నం మండపారాధనలు, అగ్నిప్రతిష్ఠాపన, జలాధివాసం, క్షీరాధివాసం, 16వ తేదీ, మంగళవారం నాడు స్వామివారికి పంచామృతాభిషేకం, పుష్పాధివాసం పూజలు, 17వ తేదీ బుధవారం, మార్గశిర బహుళ విదియ నాడు పీఠపూజ, నవరత్న గర్తన్యాసముల విశేషపూజలు నిర్వహించిన అనంతరం, 7-45 గంటలకు, విగ్రహావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, విఘ్నేశ్వరునికి పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదువేలమంది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. [9],[13]&[14]
 3. శ్రీ చక్రస్థిత అన్నపూర్ణాసమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2016,ఫిబ్రవరి-22వ తేదీ, మాఘశుద్ధ పౌర్ణమినాడు, ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని, నయనానందకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, స్వామివారికి జలాభిషేకం, పుష్పాభిషేకం, శాస్త్రోక్తంగా విశేషపూజలు నిర్వహించారు. [26]
 4. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
 5. శ్రీ రామాలయం, రజకపేట.
 6. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- చల్లపల్లి గ్రామంలోని విజయవాడ రహదారిపై గల కోమలానగర్ లోని ఈ ఆలయం, బ్రహ్మంగారి ఏడవ తరం మనుమడు, ప్రస్తుత బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి, శ్రీ వీరభోగవసంతంత వెంకటేశ్వరస్వామి గారి చేతులమీదుగా ప్రతిష్ఠ గావింపబడింది.ఈ ఆలయంలో, 36వ వార్షికకళ్యాణమహోత్సవాలు 2014,ఫిబ్రవరి-9 ఆదివారం, మాఘశుద్ధ దశమి నాడు, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య, ఘనంగా నిర్వహించారు. తరువాత 11వ తేదీ మంగళవారంనాడు, స్వామివారి ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఆ రోజే శ్రీ మద్విరాట్ విశ్వకర్మ జయంతిని గూడా ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయంవద్ద, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [5]
 7. శ్రీ సంపటాలమ్మ అమ్మవారి దేవాలయం;- 2003,మార్చిలో ఈ దేవాలయ పునరుద్ధరణ జరిగింది. ఈ దేవాలయ వార్షికోత్సవం, ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో, మొదటి ఆదివారం జరుగును. అమ్మవారి గ్రామోత్సవం ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో శుక్ల ఏకాదశి నుండి వారం రోజులపాటు నిర్వహించెదరు. అమ్మవారి వంశపారంపర్య అర్చకులు, అమ్మవారి పుట్టింటి వంశీకుల ఆధ్వర్యంలో, ఈ వేడుకలను ఘనంగా నిర్వహించెదరు. పుట్టింటివారయిన పత్తిపాటివారు, అమ్మవారికి శాస్త్రోక్తంగా ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించెదరు. ఈ గ్రామోత్సవంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, జలబిందెనూ, ఇంటింటికీ తీసికొని వెళ్ళి, భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కలిగించెదరు. భక్తులు అమ్మవారికి నిండు బిందెలతో వారపోసి, పసుపు, కుంకుమలను సమర్పించి, అమ్మవారి అనుగ్రహం పొందటం, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. [6] & [7]
 8. శ్రీ గరుడ ఆంజనేయస్వామివారి ఆలయం.
 9. శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం:- బస్సుస్టాండు కూడలిలో ఉన్న ఈ ఆలయంలో, 2014,మే-22 నుండి, హనుమజ్జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించుచున్నరు. ఈ కార్యక్రమాలలో భాగంగా, 22న సాయంత్రం 6 గంటలకు శ్రీరామనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. 23న స్వామివారి జయంతి మహోత్సవాలు, శ్రీ సీతా రామ లక్ష్మణులకు అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. సాయంత్రం 7 గంటలకు స్వామివారి శాంతికళ్యాణం, పూజాది కార్యక్రమాలు నిర్వహించెదరు. [8]
 10. చల్లపల్లి గ్రామ జాతర:- చల్లపల్లిలో ప్రతి సంవత్సరం తమ ఇలవేల్పులకు నిర్వహించే గ్రామజాతరను, 2014, ఆగష్టు-10, ఆదివారం, శ్రావణపౌర్ణమి నాడు, ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వీరంకివారి వీరుళ్ళకు, పోతురాజుస్వామి, సంపటాలమ్మ అమ్మవారికి, గ్రామదేవతల విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. డప్పు దరువులకు నాగేంద్రనృత్యం, వీర తాళ్ళు, వీర కత్తులతో సాహస విన్యాసాలు ప్రదర్శించారు. ఆలయంలో పసుపు, కుంకుమలు సమర్పించారు. [10]
 11. శ్రీ అయ్యప్పస్వామి ఆలయం:- చల్లపల్లి గ్రామంలోని శివాలయం వెనుక, 30 సెంట్లస్థలంలో, అయ్యప్పస్వామి దేవాలయ నిర్మాణానికి, 2014, ఆగష్టు-20, బుధవారం ఉదయం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారలకు ప్రత్యేకపూజలు, భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించారు. నూతనంగా నిర్మించతలపెట్టిన శ్రీ గణపతి, అయ్యప్పస్వామి, కుమారస్వామి, మాళికాపురోత్తమ్మ అమ్మవారి దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన నిర్వహించారు. ఈ ఆలయనిర్మాణానికి స్థలాన్ని గురుస్వాములు శ్రీ దింటకుర్తి మోహనరావు, శ్రీ అన్నవరపు సత్యనారాయణ అందించారు. ఈ ఆలయాలలో పంచలోహ విగ్రహాలను ప్రతిష్ఠించారు. [11]&[27]
 12. జమ్మిలంకమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక ఆలయంలో, 2014, ఆగష్టు-24, ఆదివారం నాడు, అమ్మవారి జాతరను భక్తులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను, కలశస్థూపాలను వీరుళ్ళు శిరస్సుపై ధరించి, అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. జమ్మిలంకమ్మ అమ్మవారి వంశస్తుల ఆధ్వర్యంలో జాతరను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ప్రభను తోడ్కొని కలశాలను, వీరకత్తులు, వీర తాళ్ళతో డప్పువాయిద్యాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారికి నిండుబిందెలతో వారపోస్తూ, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. [12]
 13. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- చల్లపల్లి తూర్పు వీధిలోని ఈ ఆలయ 23వ ఆరాధన మహోత్సవాలు, 2015,మార్చి-1వ తేదీ ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం నాలుగు వేలకిపైగా భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [15]
 14. శ్రీ అవతార్ మెహర్ బాబా మందిరం:- స్థానిక ఆర్ & బి. ఆవరణలో ఉన్న ఈ మందిరంలో, అవతార్ మెహర్ బాబా స్వర్ణోత్సవ వేడుకలు, 2015,ఆగష్టు-29,30 తేదీలలో ఘనంగా నిర్వహించారు. [18]
 15. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక ఎస్.టి.కాలనీలో, గురు భవానీలు ఉద్దండి పాండురంరాగారావు, శ్రావణం వెంకటకృష్ణారావుల ఆధ్వర్యంలో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015,డిసెంబరు-21వ తేదీ సోమవారం ఉదయం 9-45 గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. [24]

చల్లపల్లమ్మ పేరుతో గ్రామదేవతసవరించు

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామ పొలిమేరలోని అటవీ ప్రాంతంలో వేంచేసియున్న గ్రామదేవతలు చల్లపల్లిమ్మ తల్లి అమ్మవారు, పోతురాజు, నాగేంద్రస్వామి వార్లకు గ్రామస్థులు, 2014,మార్చి-4న ప్రత్యేక పూజలు చేసి అన్నదాన సంతర్పణ చేశారు. అడవిగట్టు వద్ద చల్లపల్లిమ్మ తల్లి పేరుతో వేంచేసియున్న సత్యాలమ్మ తల్లికి కొన్నేళ్ళుగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు. [ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,మార్చి-5; 2వపేజీ]

మోపిదేవి ఆలయంసవరించు

కోట దగ్గరలో, సుమారు 7కిమీ దూరములో, ప్రఖ్యాతి గాంచిన మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (నాగేంద్ర స్వామి) ఆలయం ఉంది. ఇక్కడ శివుని కుమారుడైన కుమారస్వామి నాగేంద్రస్వామి రూపంలో వెలిసారు.

కర్మాగారముసవరించు

చల్లపల్లి నుండి 3 కిలోమీటర్ల దూరములో, లక్ష్మీపురంలో చల్లపల్లి రాజా కట్టించిన చక్కెర కర్మాగారము ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

కీ.శే. కంచర్ల రాఘవయ్య, సైకత శిల్పి, బుల్లితెర నటుడు, ఉపాధ్యాయుడు.

చల్లపల్లి గ్రామ విశేషాలుసవరించు

శ్రీవైష్ణవి & రమ్యశ్రీసవరించు

చల్లపల్లి గ్రామానికి చెందిన ఈ అక్కాచెల్లెళ్ళు, గత ఐదు సంవత్సరాలుగా ప్రపంచ జ్ఞాపకశక్తి పోటీలలో తిరుగులేని ప్రతిభ చూపుచున్నారు. తాజాగా వీరు హాంగ్ కాంగ్ నగరంలో 2015,ఆగష్టు-22,23 తేదీలలో నిర్వహించిన ఏషియన్, హాంగ్ కాంగ్ మెమొరీ ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీలలో వ్యక్తిగత విభాగంలో పాల్గొని తమ ప్రతిభ చూపినారు. ఈ పోటీలలో శ్రీవైష్ణవి ఏషియన్ ఛాపియన్ షిప్పులో నేంస్ & ఫేసెస్ విభాగంలో స్వర్ణపతకం సాధించింది. హాంగ్ కాంగ్ ఛాంపియన్ షిప్ప్పులోనూ ఇదే విభాగంలో శ్రీవైష్ణవి రజతపతకం సంపాదించింది. రమ్యశ్రీ ఏషియన్ అడల్ట్స్ కేటగిరీలో ఐదవస్థానంలో మిలిచింది. వీరు వందల ఫోన్ నంబర్లను అలవోకగా చెప్పేస్తూ, వేలసంఖ్యలో ముఖాలను గుర్తుపెట్టి పేర్లు చెప్పేస్తారు. [19]

ఘనవ్యర్ధాల సంపద ఉత్పత్తి కేంద్రంసవరించు

చల్లపల్లిలోని చిల్లల వాగు సమీపంలో ఉన్న స్థలంలో ఈ కేంద్రాన్ని నిర్మించుచున్నారు. [29]

చల్లపల్లి మండలంలోని గ్రామాలుసవరించు

మండల గణాంక వివరాలుసవరించు

జనాభా (2001) - మొత్తం 53,813 - పురుషుల సంఖ్య 26,885 - స్త్రీల సంఖ్య 26,928
అక్షరాస్యత (2001) - మొత్తం 69.59% - పురుషుల సంఖ్య 74.84% - స్త్రీల సంఖ్య 64.35%;

జనాభాసవరించు

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[5]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. చల్లపల్లి 3,935 15,423 7,558 7,865
2. లక్ష్మీపురం 3,659 13,483 6,909 6,574
3. మాజేరు 1,114 4,335 2,179 2,156
4. మంగళాపురం(చల్లపల్లి) 1,182 4,260 2,095 2,165
5. నడకుదురు 1,058 3,710 1,874 1,836
6. నిమ్మగడ్డ 235 857 421 436
7. పాగోలు 864 3,226 1,620 1,606
8. పురిటిగడ్డ 591 2,062 1,043 1,019
9. వక్కలగడ్డ 934 3,109 1,538 1,571
10. వెలివోలు 432 1,537 741 796
11. యార్లగడ్డ 538 1,811 907 904

ఇవి కూడా చూడండిసవరించు

చల్లపల్లె, అనంతపురం జిల్లా, సోమందేపల్లె మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ : 515 122., చల్లపల్లె గ్రామం, హిందూపురం పట్టణానికి 5 కి.మీ, దూరంలో ఉంది.  

టీ. చల్లపల్లి లేదా ఠానా చల్లపల్లి తూర్పు గోదావరి జిల్లా, ఉప్పలగుప్తం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 533 213., ఎస్.టి.డి.కోడ్ = 08856.

చల్లపల్లి స్వరూపరాణి , రచయిత్రి:- గుంటూరు జిల్లా, అమృతలూరు మండలం, ప్యాపర్రు గ్రామానికి చెందినవారు.

మూలాలుసవరించు

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-16. Retrieved 2009-06-29.
 4. "http://www.onefivenine.com/india/villages/Krishna/Challapalli/Challapalli". Archived from the original on 13 మే 2016. Retrieved 25 June 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help); External link in |title= (help)
 5. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.

వికిమాపియాలో చల్లపల్లి మాగంటివారి స్వీయచరితమయిన చల్లపల్లి జమిందారీలు

బయటి లింకులుసవరించు

[3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగష్టు-3; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-7; 1వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-10; 1వ పేజీ & 12వ తేదీ-3వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మార్చి-2; 1వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-11; 1వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మే-23; 1వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగష్టు-10; 1వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగష్టు-11; 1వపేజీ. [11] ఈనాడు కృష్ణా; 2014,ఆగష్టు-11; 3వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగష్టు-25; 2వపేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-14; 1వపేజీ. [14] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-18; 2వపేజీ. [15] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చి-2; 1వపేజీ. [16] ఈనాడు కృష్ణా; 2015,జూన్-6; 10వపేజీ. [17] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగష్టు-26; 3వపేజీ. [18] ఈనాడు కృష్ణా; 2015,ఆగష్టు-31; 3వపేజీ. [19] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-31; 20వపేజీ. [20] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-7; 1వపేజీ. [21] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-2; 41వపేజీ. [22] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-11; 44వపేజీ. [23] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-9; 39వపేజీ. [24] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-22; 40వపేజీ. [25] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-27; 45వపేజీ. [26] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-3; 2వపేజీ. [27] ఈనాడు అమరావతి; 2017,మార్చి-6; 15వపేజీ. [28] ఈనాడు కృష్ణా; 2017,మార్చి-8; 16వపేజీ. [29] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జులై-16; 3వపేజీ. [30] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఆగష్టు-27; 1వపేజీ.