చల్లా వెంకట్రామ్ రెడ్డి
చల్లా వెంకట్రామిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అలంపూర్ నియోజకవర్గం నుండి 2004లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2] ఆయన 2022 డిసెంబర్ 9న భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3]
చల్లా వెంకట్రామిరెడ్డి | |||
ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 మార్చి 2023 - 29 మార్చి 2029 | |||
ముందు | రావుల రవీంద్రనాథ్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | వి.ఎం. అబ్రహం | ||
నియోజకవర్గం | శాసనసభ సభ్యులు కోటా | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004 - 2009 | |||
నియోజకవర్గం | అలంపూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 పుల్లూరు, ఉండవెల్లి మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | నిర్మల, చల్లా రాంభూపాల్ రెడ్డి | ||
బంధువులు | నీలం సంజీవరెడ్డి (తాత) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుచల్లా వెంకట్రామిరెడ్డి భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి మనవడు (కూతురి కుమారుడు). ఆయన తన సొంత గ్రామమైన పుల్లూరు సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2004లో అలంపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత వైఎస్సార్ పార్టీలో చేరి, అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ 2022 డిసెంబర్ 9న భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5]
తెలంగాణ శాసనమండలికి మార్చి 2023లో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పేరును మార్చి 7న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా[6] ఆయన 9న నామినేషన్ దాఖలు చేశాడు.[7] 16 మార్చి నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగియడంతో బరిలో ఎవరు లేకపోడడంతో చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించి ఆయనకు ధ్రువీకరణ పత్రాలు అందజేశాడు.[8]
చల్లా వెంకట్రామిరెడ్డి 2023 మార్చి 31న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[9]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Andhra Jyothy (20 April 2022). "చల్లాకు బీజేపీ వల" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2022. Retrieved 13 June 2022.
- ↑ ABP Live (9 December 2022). "బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ Eenadu (17 November 2023). "స్వతంత్రులుగా సత్తా చాటారు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ telugu (10 December 2022). "బీఆర్‌ఎస్‌లోకి 'చల్లా'". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ Sakshi (8 March 2023). "ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు వీరే". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
- ↑ "దేశపతి , చల్లా , నవీన్‌ల నామినేషన్ దాఖలు" (in ఇంగ్లీష్). 9 March 2023. Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
- ↑ Andhra Jyothy (17 March 2023). "ముగ్గురు బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవం". Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ NT News (31 March 2023). "ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన దేశపతి, నవీన్ కుమార్, చల్లా". Archived from the original on 22 March 2024. Retrieved 22 March 2024.