తెలంగాణ శాసనమండలి

తెలంగాణ ఉభయసభల రాష్ట్ర శాసనసభ ఎగువ సభ
(తెలంగాణ శాసన మండలి నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ శాసన మండలి లేదా తెలంగాణ విధాన సభ రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఎగువ సభ.[1] తెలంగాణ శాసనసభ అనేది దిగువ సభ. తెలంగాణ శాసన మండలిలో 40మంది సభ్యులు ఉంటారు. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికవుతారు. ఇది శాశ్వత సభ. అనగా శాసన సభ వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు.

తెలంగాణ శాసన మండలి
Coat of arms or logo
రకం
రకం
ఎగువ సభ
నాయకత్వం
ప్రొటెం ఛైర్మన్‌
సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, ఎంఐఎం
2022 జనవరి 12 - నుండి ప్రస్తుతం నుండి
ఖాళీ
నిర్మాణం
సీట్లు40 (34 ఎన్నిక + 6 నామినేటెడ్)
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (37)

ఇతరులు (3)

ఎన్నికలు
ఓటింగ్ విధానం
సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2015 డిసెంబరు 30
సమావేశ స్థలం
జూబ్లీహాల్, హైదరాబాదు.
వెబ్‌సైటు
Legislative Council - Telangana-Legislature

తెలంగాణ శాసన మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన రోజైన 2014, జూన్ 2న ఏర్పాటుచేయబడింది.

ప్రదేశం

మార్చు

తెలంగాణ శాసన మండలి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని శాసనసభ ప్రాంగణంలో ఉంది.

మాజీ చైర్మన్లు

మార్చు

ప్రొటెం స్పీకర్లు

మార్చు

శాసన మండలి సభ్యులు

మార్చు

తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎఐఐఎంఐఎం పార్టీల ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏకైక బిజెపి సభ్యుడు రామ్‌చందర్ రావు 2021 ఎన్నికల్లో ఓడిపోయాడు. కింది జాబితాలో ఈ క్రిందివి ఉన్నాయి:

 • ఎమ్మెల్యేలు ఎన్నుకున్న 14 మంది సభ్యులు (1/3)
 • స్థానిక అధికారుల నుండి 14 మంది సభ్యులు (1/3)
 • గవర్నర్ నామినేట్ చేసిన 6 మంది సభ్యులు (1/6)
 • రాష్ట్ర ఉపాధ్యాయులు ఎన్నుకున్న 3 మంది సభ్యులు (1/12)
 • పట్టభద్రులు ఎన్నుకున్న 3 మంది సభ్యులు (1/12)

శాసనసభ సభ్యులు ఎన్నుకున్నవారు

మార్చు

Keys:       టిఆర్ఎస్ (13)       ఏఐఎంఐఎం (1)

క్రమసంఖ్య సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 శేరి సుభాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2019 మార్చి 30 2025 మార్చి 29
2 సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర సమితి 2019 మార్చి 30 2025 మార్చి 29
3 ఎగ్గే మల్లేషం భారత జాతీయ కాంగ్రెస్ 2019 మార్చి 30 2025 మార్చి 29
4 మహ్మద్ మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్ర సమితి 2019 మార్చి 30 2025 మార్చి 29
5 దేశపతి శ్రీనివాస్[5] తెలంగాణ రాష్ట్ర సమితి 2023 మార్చి 30 2029 మార్చి 29
6 చల్లా వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2023 మార్చి 30 2029 మార్చి 29
7 కురుమయ్యగారి నవీన్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి 2019 మే 31 2029 మార్చి 29
8 పి.వెంక‌ట్రామి రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2021 డిసెంబరు 01 2027 నవంబరు 30
9 తక్కెళ్లపల్లి రవీందర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి 2021 డిసెంబరు 01 [6] 2027 నవంబరు 30
10 బండ ప్రకాష్ తెలంగాణ రాష్ట్ర సమితి 2021 డిసెంబరు 01 2027 నవంబరు 30
11 గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2021 డిసెంబరు 01 2027 నవంబరు 30
12 మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఐఎంఐఎం 2019 మార్చి 30 2025 మార్చి 29
13 బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ 2024 జనవరి 23 2027 నవంబరు 21
14 బల్మూరి వెంకట్ భారత జాతీయ కాంగ్రెస్ 2024 జనవరి 23 2027 నవంబరు 21

స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకున్నవారు

మార్చు

Keys:       టిఆర్ఎస్ (13)       ఏఐఎంఐఎం (1)

క్రమసంఖ్య నియోజకవర్గం సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 ఆదిలాబాద్ దండె విఠల్ భారత జాతీయ కాంగ్రెస్ 2022 జనవరి 5 2028 జనవరి 4
2 కరీంనగర్ టి. భానుప్రసాద్ రావు భారత జాతీయ కాంగ్రెస్ 2016 జనవరి 5 2028 జనవరి 4
3 కరీంనగర్ ఎల్.రమణ తెలంగాణ రాష్ట్ర సమితి 2022 జనవరి 5 2028 జనవరి 4
4 మెదక్ యాదవ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2022 జనవరి 5 2028 జనవరి 4
5 రంగారెడ్డి శంబీపూర్ రాజు (సుంకరి రాజు) తెలంగాణ రాష్ట్ర సమితి 2016 జనవరి 5 2028 జనవరి 4
6 మహబూబ్ నగర్ ఎన్.నవీన్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2024 జూన్ 2 2028 జనవరి 4
7 మహబూబ్ నగర్ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2016 జనవరి 5 2028 జనవరి 4
8 ఖమ్మం తాతా మధు తెలంగాణ రాష్ట్ర సమితి 2022 జనవరి 5 2028 జనవరి 4
9 వరంగల్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2019 జూన్ 3 2028 జనవరి 4
10 నల్గొండ ఎంసీ కోటిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2022 జనవరి 5 2028 జనవరి 4
11 రంగారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 2019 జూన్ 3 2028 జనవరి 4
12 హైదరాబాద్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు భారత జాతీయ కాంగ్రెస్ 2019 ఆగస్టు 7 2025 ఆగస్టు 6
13 నిజామాబాద్ కె. కవిత తెలంగాణ రాష్ట్ర సమితి 2020 అక్టోబరు 12 2028 జనవరి 4
14 హైదరాబాద్ మీర్జా రహమత్ బేగ్ ఎంఐఎం 2023 మే 2 ప్రస్తుతం

పట్టభద్రుల నియోజకవర్గాల నుండి ఎన్నికైనవారు

మార్చు

Keys:       టిఆర్ఎస్ (2)       కాంగ్రెస్ (1)

క్రమసంఖ్య నియోజకవర్గం సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 నల్గొండ, వరంగల్,

ఖమ్మం

తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ 2024 జూన్ 8 2027 మార్చి 29
2 నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్,

కరీంనగర్

టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ 2019 మార్చి 30 2025 మార్చి 29
3 మహబూబ్ నగర్, హైదరాబాద్,

రంగా రెడ్డి

సురభి వాణి దేవి[7] తెలంగాణ రాష్ట్ర సమితి 2021 మార్చి 30 2027 మార్చి 29

ఉపాధ్యాయ నియోజకవర్గాల నుండి ఎన్నికైనవారు

మార్చు

Keys:       స్వత్రంత్ర (3)

క్రమసంఖ్య నియోజకవర్గం సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 నల్గొండ, వరంగల్,

ఖమ్మం

అలుగుబెల్లి నర్సిరెడ్డి స్వతంత్ర 2019 మార్చి 30 2025 మార్చి 29
2 నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్,

కరీంనగర్

కూర రఘోత్తంరెడ్డి స్వతంత్ర 2019 మార్చి 30 2025 మార్చి 29
3 మహబూబ్ నగర్, హైదరాబాద్,

రంగా రెడ్డి

ఏ.వీ.ఎన్. రెడ్డి బీజేపీ 2023 మార్చి 30 2029 మార్చి 29

గవర్నర్ నామినేట్ చేసినవారు

మార్చు

Keys:       టిఆర్ఎస్ (6)

క్రమసంఖ్య సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 బస్వరాజు సారయ్య[8] భారత జాతీయ కాంగ్రెస్ 2020 నవంబరు 2026 నవంబరు
2 బొగ్గారపు దయానంద్ భారత జాతీయ కాంగ్రెస్ 2020 నవంబరు 2026 నవంబరు
3 సిరికొండ మధుసూధనాచారి తెలంగాణ రాష్ట్ర సమితి 2021 డిసెంబరు 14 2027 డిసెంబరు 13
4 గోరేటి వెంకన్న[8] తెలంగాణ రాష్ట్ర సమితి 2020 నవంబరు 2026 నవంబరు

మాజీ ఎమ్మెల్సీలు

మార్చు
క్రమసంఖ్య నియోజకవర్గం సభ్యుడు పార్టీ ప్రారంభం ముగింపు
1 శాసనసభ సభ్యులు కోటా ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ 2015 జూన్ 4 2021 జూన్ 3
2 శాసనసభ సభ్యులు కోటా మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌ తెలంగాణ రాష్ట్ర సమితి 2016 అక్టోబరు 13 2021 జూన్ 3
3 శాసనసభ సభ్యులు కోటా గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2019 ఆగస్టు 26 2021 జూన్ 3
2 శాసనసభ సభ్యులు కోటా నేతి విద్యాసాగర్ తెలంగాణ రాష్ట్ర సమితి 2015 జూన్ 4 2021 జూన్ 3
5 శాసనసభ సభ్యులు కోటా బోడకుంటి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర సమితి 2015 జూన్ 4 2021 జూన్ 3
6 శాసనసభ సభ్యులు కోటా కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితి 2015 జూన్ 4
2021 జూన్ 3
2021 జూన్ 3
2023 డిసెంబరు 9
7 శాసనసభ సభ్యులు కోటా మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2015 జూన్ 17 2021 జూన్ 16
8 స్థానిక సంస్థల కోటా నారదాసు లక్ష్మణ్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితి 2016 జనవరి 5 2022 జనవరి 4
9 స్థానిక సంస్థల కోటా వి. భూపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2016 జనవరి 5 2022 జనవరి 4
10 స్థానిక సంస్థల కోటా బాలసాని లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్ర సమితి 2016 జనవరి 5 2022 జనవరి 4
11 స్థానిక సంస్థల కోటా తేరా చిన్నపరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2019 జూన్ 3 2022 జనవరి 4
12 స్థానిక సంస్థల కోటా పురాణం సతీశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి 2016 జనవరి 5 2022 జనవరి 4
13 ఎమ్మెల్యే కోటా టి.సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ 2013 మార్చి 2019 మార్చి
14 మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగా రెడ్డి కాటేపల్లి జనార్థన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2017 మార్చి 30 2023 మార్చి 29
15 శాసనసభ సభ్యులు కోటా ఎలిమినేటి కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2017 మార్చి 30 2023 మార్చి 29
16 శాసనసభ సభ్యులు కోటా వల్లోల్ల గంగాధర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి 2017 మార్చి 30 2023 మార్చి 29
17 స్థానిక సంస్థల కోటా సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఎంఐఎం 2017 మే 2 2023 మే 1
18 గవర్నర్ కోటా డి. రాజేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి 2017 మే 28 2023 మే 27
19 గవర్నర్ కోటా ఫరూక్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర సమితి 2017 మే 28 2023 మే 27
20 స్థానిక సంస్థల కోటా వి. భూపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2021 జూన్ 4 2022 జనవరి 3
21 ఎమ్మెల్యే కోటా పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2021 డిసెంబరు 01 2027 నవంబరు 30
22 స్థానిక సంస్థల కోటా (మహబూబ్ నగర్) కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 2016 జనవరి 5 2023 డిసెంబరు 8

2024 ఉప ఎన్నిక

మార్చు

స్థానిక సంస్థల కోటా

మార్చు

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నిలక సంఘం ఫిబ్రవరి 26న ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేయగా కాంగ్రెస్‌ తరఫున మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌రెడ్డి, మరో స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌ గౌడ్‌ పోటీ చేశారు.

ఈ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యేలు14, ఎంపీలు 02, ఎమ్మెల్సీలు 03 మొత్తం 19 మంది, ఎంపీటీసీ సభ్యులు 888, జడ్పీటీసీ 83, మున్సిపల్ కౌన్సిలర్లు 449 మొత్తం 1439 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. మార్చి 28న జరిగిన ఎన్నికలలో మొత్తం 1,439 ఓట్లకు గాను 1,437 పోల్‌ అయ్యి 99.86 శాతంగా పోలింగ్‌ నమోదైంది.[9] మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌ కాలేజీలో ఏప్రిల్‌ 2న జరగాల్సిన ఓట్ల లెక్కింపు సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 2న ఓట్లు లెక్కించి, అనంతరం విజేత ప్రకటన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అదేశాలు జారీ చేసింది.[10]

ఈ ఎన్నికల్లో మొత్తం 1,437 ఓట్లు పోలవగా  జూన్ 2న జరిగిన ఓట్ల లెక్కింపులో అందులో 21 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించగా, మిగిలిన 1,416 ఓట్లలో బీఆర్ఎస్‌కు 762, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌ రెడ్డికి 653 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 109 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[11][12][13]

పట్టభద్రుల కోటా

మార్చు

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం 2024 మే 02న నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 03 నుంచి 9 వరకూ నామినేషన్ల స్వీకరణ, 13 వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా, 27న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.[14] పల్లా రాజేశ్వర్ రెడ్డి 2023లో జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం డిసెంబరు 9న ఎమ్మెల్సీ పదవికి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక షెడ్యూల్‎ను ప్రకటించింది. ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు.[15][16][17]

ఈ ఉప ఎన్నికలో మొత్తం 52 మంది పోటీ చేస్తుండగా రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

మూలాలు

మార్చు
 1. సాక్షి. "తెలంగాణ శాసన మండలి చైర్మన్ ఎన్నిక". Retrieved 22 February 2017.
 2. Sakshi (3 June 2021). "తెలంగాణ: మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ పోస్టులు ఖాళీ". Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.
 3. TV9 Telugu (3 June 2021). "శాసన మండలిలో విచిత్ర పరిస్థితి.. ఒకేసారి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ రిటైర్.. ప్రొటెం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డి". TV9 Telugu. Archived from the original on 4 జూన్ 2021. Retrieved 4 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Namasthe Telangana (12 January 2022). "శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్‌గా ఎంఐఎం ఎమ్మెల్సీ". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
 5. NTV Telugu (31 March 2023). "ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేశపతి, నవీన్‌కుమార్‌, చల్లా". Archived from the original on 31 March 2023.
 6. TNews Telugu (1 December 2021). "'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం షురూ". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
 7. నమస్తే తెలంగాణ, వార్తలు (20 March 2021). "పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం". Archived from the original on 20 March 2021. Retrieved 20 March 2021.
 8. 8.0 8.1 The Hans India, Telangana (14 November 2020). "Telangana Cabinet strikes balance with MLC posts". www.thehansindia.com. Archived from the original on 14 November 2020. Retrieved 20 March 2021.
 9. Andhrajyothy (29 March 2024). "ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతం". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
 10. A. B. P. Desam (1 April 2024). "ఫలితం జూన్ 2 తర్వాతే - మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ వాయిదా !". Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.
 11. Andhrajyothy (2 June 2024). "మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వశం". Archived from the original on 2 June 2024. Retrieved 2 June 2024.
 12. EENADU (2 June 2024). "మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం". Archived from the original on 2 June 2024. Retrieved 2 June 2024.
 13. EENADU (3 June 2024). "స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నవీన్‌కుమార్‌ రెడ్డి". Archived from the original on 3 June 2024. Retrieved 3 June 2024.
 14. NT News (3 May 2024). "నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
 15. TV9 Telugu (2 May 2024). "పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. కాంగ్రెస్ నుంచి పోటీలో కీలక నేత." Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 16. Andhrajyothy (2 May 2024). "నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల." Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
 17. Andhrajyothy (26 April 2024). "మోగిన 'పట్టభద్రుల' నగారా". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.