చల్లా శ్రీనివాస్

చల్లా శ్రీనివాస్ తెలంగాణలో ప్రసిద్ధ సినీ విమర్శకుడు. సినిమా పై ఎన్నో విమర్శనాత్మక వ్యాసాలు రాశారు.

చల్లా శ్రీనివాస్

జీవిత విశేషాలు

మార్చు

ఆయన రెండు సార్లు నంది అవార్డులు అందుకున్నారు.[1] కరీంనగర్ జిల్లాలా గోదావరిఖని ఇతడి స్వస్థలం. 2009 నంది అవార్డుల జ్యూరీ మెంబరుగా చేశారు. జర్నలిస్టుగా ఎంతోమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు. వారిలో శివాజీ గణేశన్, కన్నడ రాజ్‌కుమార్, దేవానంద్, షబానా అజ్మీ, రాంగోపాల్ వర్మ... వంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగళ్ చేతుల మీదుగా బెస్ట్ ఫిలిం క్రిటిక్ అవార్డు అందుకున్నారు. 100 ఏళ్ల భారతీయ సినిమా ఉత్సవాల సందర్భంగా తీసిన జాతీయస్థాయి డాక్యుమెంటరీలో చల్లా శ్రీనివాస్ ఇంటర్వూ కూడా ఉండటం విశేషం. గత 30 ఏళ్లుగా ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి సండే మ్యాగజైన్ కు ఇంచార్జ్ గా వున్నారు.

మూలాలు

మార్చు
  1. "2006కు నంది అవార్డుల ప్రకటన". Archived from the original on 2016-03-05. Retrieved 2015-08-28.

ఇతర లింకులు

మార్చు