షబానా అజ్మీ

భారతీయ రాజకీయవేత్త మరియు నటి

సయ్యిదా షబానా అజ్మీ (జననం 1950 సెప్టెంబరు 18) భారతీయ సినీ నటి, టీవీ అభినేత్రి, రంగస్థల నటి. ఈమె పూణే లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చదువుకున్నారు. 1974 లో తొలిసారి సినిమాలలో కనిపించారు. వాణిజ్యపరంగా ఉన్న సాంప్రదాయ సినిమాలకు పోటీగా సరికొత్త భావాలతో, కథాకథనంతో ప్యారలెల్ సినెమా లేదా ఆల్టర్నేట్ సినిమా అని పిలువబడే రెండో పంథా సినిమాలకు ఈమె ప్రసిద్ధి. ఈమె నటనకు చాలా ప్రసిద్ధి. ఐదు సార్లు ఉత్తమ నటిగా భారత ప్రభుత్వం ఈమెను గుర్తించింది. ఇది కాక మరెన్నో పురస్కారాలు, గుర్తింపులు ఈమె పొందింది.

షబానా అజ్మీ
అప్సర ఫిలిం అవార్డ్స్ వద్ద షబానా అజ్మీ
జననం
షబానా కైఫీ అజ్మీ

(1950-09-18) 1950 సెప్టెంబరు 18 (వయసు 73)
వృత్తినటి, సామాజిక కార్యకర్త

షబానా 1950, సెప్టెంబరు 18న హైదరాబాదులో జన్మించింది. షబానా తల్లి షౌకత్ అజ్మీ నాటకరంగం, సినిమా నటి.

120కి పైగా సాంప్రదాయ వాణిజ్య సినిమాలలో, ఆర్టు సినిమాలలో ఈమె నటించింది. 1988 నుండి ఎన్నో విదేశీ సినిమాలలో కూడా కనిపిస్తుంది. నటన కాకుండా షబానా సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. ఐక్యరాజ్యసమితి వారి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNPFA) కి గుడ్విల్ అంబాసడర్, మహిళా హక్కు పోరాటాల కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలు కూడా. ఈమె ప్రముఖ కవి, రచయిత జావేద్ అక్తర్ ను వివాహం చేసుకున్నారు.4

నటించిన చిత్రాలు

మార్చు

ఈమె నటించిన చిత్రాలలో ముఖ్యమైన చిత్రాలు కొన్ని:

  • అంకుర్ (1974)
  • ఇష్క్ ఇష్క్ ఇష్క్ (1974)
  • పరిణయ్ (1974)
  • ఫస్లా (1974)
  • నిశాంత్ (1975)[1]
  • షక్ (1976)
  • ఫకీరా (1976)
  • షత్రంజ్ కె ఖిలాడి (1977)
  • అమర్ అక్చర్ ఆంథోని (1977)
  • హీరా ఔర్ పత్తర్ (1977)
  • ఖేల్ ఖిలాడీ కా (1977)
  • చోర్ సిపాహీ (1977)
  • కిస్సా కుర్సీకా (1977)
  • పర్వరీష్ (1977)
  • కర్మ్ (1977)
  • విశ్వాస్‌ఘాత్ (1977)
  • దేవత (1978)
  • స్వర్గ్ నరక్ (1978)
  • అమర్ దీప్ (1979)
  • జీనా యహా (1979)
  • స్పర్శ్ (1980)
  • ఆల్బర్ పింటో కో గుస్సా క్యో ఆతా హై (1980)
  • సమీర (1981)
  • ఏక్ హీ భూల్ (1981)
  • అర్థ్ (1982)
  • నమ్‌కీన్ (1982)
  • మాసూమ్ (1983)
  • మండి (1983)
  • ఖాంధార్ (1984)
  • కామ్‌యాబ్ (1984)
  • కామోష్ (1985)
  • కమ్లా (1985)
  • అంజుమన్ (1986)
  • నసీహత్ (1986)
  • ఇతిహాస్ (1987)
  • ది బెంగాలీ నైట్ (1988)
  • బడా దిన్ (1988)
  • సతి (1989)
  • ఏక్‌ దిన్ అచానక్ (1989)
  • దిశ (1990)
  • ఏక్ డాక్టర్ కి మౌత్ (1990)
  • ఝూటీ షాన్ (1991)
  • ఫతే (1991)
  • పతంగ్ (1992)
  • అధర్మ్ (1992)
  • సన్ ఆఫ్ ది పింక్ పాంథర్ (1993)
  • ఫైర్ (1996)
  • మృత్యుదండ్ (1997)
  • ఎర్త్ (1998)
  • గాడ్‌మదర్ (1999)
  • గజ గామిని (2000)
  • అహల్యా బాయి (2002)
  • తెహ్‌జీబ్ (2003)
  • మార్నింగ్ రాగా] (2004)
  • 15 పార్క్ ఎవెన్యూ (2005)
  • ఉమ్రావ్ జాన్ (2006)
  • సారీ భాయ్ (2008)
  • ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఆఫ్టర్‌లైఫ్ (2010)
  • కల్పవృక్ష్ (2012)
  • ది రిలక్టంట్ ఫండమెంటలిస్ట్ (2013)
  • ఎ డిసెంట్ అరేంజ్‌మెంట్ (2014)
  • జజ్‌బా (2015)
  • చాక్ అండ్ డస్టర్ (2016)
  • నీరజ (2016)
  • రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (2023)

వార్తలలో షబానా

మార్చు

గృహహింస లఘుచిత్రం

మార్చు

స్త్రీల సమస్యలపై తరచూ స్పందించే బాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ గృహహింసపై ఓ లఘుచిత్రంలో పనిచేస్తున్నారు. నషీద్ ఫరూఖీ లఘుచిత్రం 'అవుట్‌సైడ్'లో శనివారం పనిచేయడం ప్రారంభించానని, ఈ చిత్రం గృహహింస ప్రధానాంశంగా సాగుతుందని షబానా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. షబానా తన పెంపుడు కుమార్తె నమ్రతా గోయెల్‌తో కలిసి మిజ్వాన్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ గ్రామీణ మహిళల సాధికారతపై పనిచేస్తోంది.

మూలాలు

మార్చు
  1. Ziya Us Salam (4 October 2012). "Nishant (1975)". The Hindu. Retrieved 1 July 2019.

బయటి లంకెలు

మార్చు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు